Site icon Prime9

TVS Jupiter CNG: ఆటో మార్కెట్లో కల్లోలం.. 226 కి.మీ మైలేజ్ ఇచ్చే CNG స్కూటర్.. లాంచ్ అయితే ఇంకేమైనా ఉందా..!

TVS Jupiter CNG

TVS Jupiter CNG: ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ TVS మోటార్ ప్రపంచంలోనే మొట్టమొదటి CNG ఫ్యూయల్ స్కూటర్‌ను ఆటో ఎక్స్‌పో 2025లో పరిచయం చేసింది. TVS గత కొన్ని నెలలుగా కొత్త CNG స్కూటర్‌ను అభివృద్ధి చేస్తుందని పుకార్లు వచ్చాయి.అయితే ఇప్పుడు దీనిని కంపెనీ ప్రారంభించింది.  గత ఏడాది జూన్‌లో బజాజ్ ప్రపంచంలోనే మొట్టమొదటి CNG బైక్, ఫ్రీడమ్ 125 ను విడుదల చేసింది.

బజాజ్ ఈ బైక్‌ను పెట్రోల్, సిఎన్‌జి రెండింటితో నడిచేలా డిజైన్ చేసింది. ఇప్పుడు బజాజ్‌ని అనుసరించి టీవీఎస్ కూడా సీఎన్‌జీ రంగంలోకి దూసుకెళ్లింది. ఎక్స్‌పో మొదటి రోజునే ఎంట్రీ ఇచ్చిన ఈ CNG స్కూటర్ స్పెసిఫికేషన్స్ నుండి ఫీచర్ల వరకు వివరాలు వెల్లడయ్యాయి. అయితే దీని ధరలు ఇంకా ప్రకటించాల్సి ఉంది. రండి, దేశంలోని మొట్టమొదటి CNG స్కూటర్‌లో ప్రత్యేకత ఏమిటో తెలుసుకుందాం.

జూపిటర్ సిఎన్‌జి కమ్యూటర్ స్కూటర్, మల్టీ ఫ్యూయల్ ఎంపికలో అందుబాటులో ఉంటుందని కంపెనీ తెలిపింది. అత్యవసర పరిస్థితుల్లో పెట్రోలుతో కూడా నడపవచ్చు. కేవలం రూ. 1/కిమీ కంటే తక్కువ ఖర్చుతో, ఇది అద్భుతమైన పనితీరును అందిస్తుంది.

పెట్రోల్‌తో నడిచే జూపిటర్ 125 స్కూటర్,  కొత్తగా విడుదల చేసిన జూపిటర్ సిఎన్‌జి స్కూటర్ మధ్య డిజైన్‌లో పెద్దగా తేడా లేదు. రెండూ ఒకేలా కనిపిస్తున్నాయి. CNGని సూచించడానికి ముందు భాగంలో CNG స్టిక్కర్ మాత్రమే అతికించారు. ఈ CNG స్కూటర్‌లో CNG  సిలిండర్‌ను సీటు బూట్ స్సేస్‌లో ఉంచారు. ఈ సిలిండర్ 1.4 కిలోల సిఎన్‌జి గ్యాస్ సామర్థ్యం కలిగి ఉంటుంది.

జూపిటర్ CNG  గరిష్ట వేగం గంటకు 80.05 కిమీ. ఒక కేజీ సిఎన్‌జితో 84 కి.మీల వరకు నడపవచ్చని కంపెనీ తెలిపింది. CNG, పెట్రోల్‌తో దాని క్లెయిమ్ రేంజ్ 226 కి.మీ. ఇందులో 2 లీటర్ల పెట్రోల్‌తో పాటు 1.4 కేజీల సీఎన్‌జీని నింపవచ్చు.

TVS ఈ CNG స్కూటర్‌కు 124.8 cc, సింగిల్ సిలిండర్ ఇంజన్‌ని అందించింది. ఈ ఇంజన్ 7.2hp పవర్, 9.4Nm టార్క్ రిలీజ్ చేయగలదు. ఇది జూపిటర్ 125 పెట్రోల్ స్కూటర్ కంటే కొంచెం తక్కువ. స్కూటర్ అత్యంత ముఖ్యమైన ఫీచర్లలో ఒకటి దాని ప్రాక్టికాలిటీ, బూట్ స్పేస్.

టీవీఎస్ జూపిటర్ 125 స్కూటర్‌లో 33 లీటర్ల బూట్ స్పేస్‌ను ఇచ్చింది. ఈ స్కూటర్‌లో బూట్ స్పేస్ లేదు. ఇది కస్టమర్లపై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి.జూపిటర్ 125 స్కూటర్ ఎక్స్-షోరూమ్ ధర రూ.80,000 నుంచి రూ.91,000 మధ్య ఉంది. జూపిటర్ సిఎన్‌జి స్కూటర్ దాదాపు అదే ధరతో లేదా కొంచెం ఎక్కువ ధరతో విడుదల అవుతుందని భావిస్తున్నారు.

Exit mobile version