Site icon Prime9

TVS Jupiter 125 CNG: ఫుల్ ట్యాంక్ చేస్తే 226 కిమీ మైలేజ్.. సీఎన్‌జీగా టీవీఎస్ జూపిటర్.. రిలీజ్‌కి రెడీ..!

TVS Jupiter 125 CNG

TVS Jupiter 125 CNG

TVS Jupiter 125 CNG: బజాజ్ ఆటో మొదటి CNG బైక్‌ను గత సంవత్సరం ప్రారంభించింది. ఆ తర్వాత టీవీఎస్ దేశంలో తన కొత్త CNG స్కూటర్‌ను కూడా విడుదల చేయబోతోంది. ప్రస్తుతం ఈ స్కూటర్ టెస్టింగ్ జరుగుతోంది. కొత్త CNG స్కూటర్ జూపిటర్ 125 పేరుతో రానుంది. డిజైన్ పరంగా, ఇది పెట్రోల్ మోడల్‌తో సమానంగా ఉంటుంది. కొత్త CNG జూపిటర్‌లో 1.4 కిలోల CNG ఇంధన ట్యాంక్‌ను ఏర్పాటు చేశారు. విశేషమేమిటంటే ఇంధన ట్యాంక్‌ను సీటు కింద బూట్-స్పేస్ ప్రాంతంలో ఉంచారు. ఈ ఏడాది జూన్‌లో కొత్త స్కూటర్ వస్తుందని గతంలో వార్తలు వచ్చాయి.

TVS Jupiter 125 CNG Features
ఫీచర్ల గురించి మాట్లాడితే CNG స్కూటర్‌లో 2-లీటర్ పెట్రోల్ ఇంధన ట్యాంక్ ఉంటుంది. ఇంజిన్ విషయానికి వస్తే జూపిటర్ CNG 125cc సింగిల్-సిలిండర్ ఇంజిన్‌ ఉంటుంది. ఈ ఇంజన్ 7.1బిహెచ్‌పి పవర్, 9.4ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ స్కూటర్ గరిష్ట వేగం గంటకు 80 కి.మీ.

అలానే ముందు మొబైల్ ఛార్జర్, సెమీ డిజిటల్ స్పీడోమీటర్, బాడీ బ్యాలెన్స్ టెక్నాలజీ, అన్నీ ఒకే లాక్, సైడ్ స్టాండ్ ఇండికేటర్ వంటి ఫీచర్లను అందించారు. టీవీఎస్ ప్రకారం, జూపిటర్ CNG స్కూటర్ 1 కిలోల CNGపై 84 కిలోమీటర్ల మైలేజీని ఇవ్వగలదు. పెట్రోల్‌తో మాత్రమే నడిచే స్కూటర్ సగటు మైలేజ్ 40-45 kmpl. పెట్రోల్ + సీఎన్‌జీతో దీనిని 226 కిలోమీటర్ల వరకు నడపవచ్చు.

టీవీఎస్ కొత్త సీఎన్‌జీ స్కూటర్ అంచనా ధర రూ. 1 లక్ష వరకు ఉండచ్చు. కంపెనీ ప్రకారం, ఇది చాలా సురక్షితమైన CNG స్కూటర్. రోజువారీ వినియోగానికి మంచి బైక్ . CNG వల్ల కాలుష్యం తగ్గడమే కాకుండా ప్రజల డబ్బులు కూడా ఆదా అవుతాయి. బజాజ్ ఆటో ఇప్పుడు మరో CNG బైక్‌పై పని చేస్తోంది, ఇది ప్రస్తుత మోడల్ కంటే శక్తివంతమైనది. రాబోయే కాలంలో హీరో, హోండా, యమహా కూడా CNG విభాగంలోకి ప్రవేశించవచ్చు.

Exit mobile version
Skip to toolbar