Site icon Prime9

2025 Toyota Innova Electric: ఎంత మారిపోయిందో.. ఇన్నోవా ఈవీ వచ్చేస్తోంది.. ఇలాంటీ ఫీచర్స్ చూసుండరబ్బా..!

2025 Toyota Innova Electric

2025 Toyota Innova Electric

2025 Toyota Innova Electric: టయోటా ఇండోనేషియా ఇంటర్నేషనల్ మోటార్ షో (IIMS 2025)లో కిజాంగ్ ఇన్నోవా BEV కాన్సెప్ట్‌ను ఆవిష్కరించింది. ఈ మోడల్ ఇప్పటికే మార్చి 2022లో ఇండోనేషియాలో పరిచయం చేసింది. అయితే కొత్త మోడల్ ఇప్పుడు మునుపటి కంటే మెరుగ్గా ఉంది. కొత్త మోడల్ పూర్తిగా ఎలక్ట్రిక్ 7-సీటర్ ఎంపీవీ. విశేషమేమిటంటే టొయోటా ఇన్నోవా బిఇవి కాన్సెప్ట్ ఇండోనేషియాలో ప్రవేశపెట్టిన డీజిల్ కిజాంగ్ ఇన్నోవా మాదిరిగానే ప్యానలింగ్‌ను కలిగి ఉంది. అయితే, స్పోర్టియర్ హెడ్‌ల్యాంప్‌లు, డీఆర్ఎల్‌లు, టాప్ మౌంటెడ్ ఎల్ఈడీ స్ట్రిప్, క్లోజ్డ్-ఆఫ్ గ్రిల్, బంపర్ వంటి కొన్ని ఫీచర్లు కొద్దిగా భిన్నంగా ఉంటాయి.

2025 Toyota Innova Electric Battery Pack
7-సీటర్ టయోటా ఇన్నోవా BEV కాన్సెప్ట్‌లో 59.3కిలోవాట్ లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్‌ ఉంటుంది. ఇన్నోవా BEVలో ఉపయోగించిన బ్యాటరీ ప్యాక్ చాలా భిన్నంగా ఉంటుంది. దాని ఫ్లోర్‌బోర్డ్‌లో చాలా చిన్న మాడ్యూల్స్ ఇన్‌స్టాల్ చేశారు. అలాగే, ఇంజిన్ ముందు భాగంలో చాలా పెద్ద యూనిట్ ఉంటుంది. ఛార్జర్, ఇన్వర్టర్ వాహనం వెనుక భాగంలో ఉంటాయి. ఇన్నోవా BEV టైప్-2 AC, CCS-2 DC ఛార్జర్‌లకు సపోర్ట్ ఇస్తుంది.

అయితే ఫుల్ ఛార్జిపై ఎంత రేంజ్ ఆఫర్ చేస్తుందనే దానిపై ఇంకా సమాచారం లేదు. ఇది మాత్రమే కాదు, ఇన్నోవా BEV అసెంబ్లీ లైన్‌కు ఎప్పుడు చేరుకుంటుందని ఖచ్చితంగా చెప్పలేము. దేశంలో ఎప్పుడు లాంచ్ అవుతుందనే దాని గురించి కంపెనీ నుండి ఎటువంటి సమాచారం లేదు. దేశంలో EV సెగ్మెంట్ వేగంగా అభివృద్ధి చెందుతోంది. కాబట్టి ఈ వాహనం దేశంలో లాంచ్ అవడం ఖాయం.

2025 Toyota Innova Electric Design
కొత్త ఇన్నోవా BEV బాడీ క్లాడింగ్, బ్లాక్-అవుట్ పిల్లర్స్,రూఫ్‌తో మెరుగ్గా కనిపిస్తుంది. సైడ్ ప్రొఫైల్ మల్టీ-కలర్ గ్రాఫిక్స్‌తో మరింత స్పోర్టీ లుక్‌ని పొందుతుంది. ఇది మాత్రమే కాదు, ఇందులో 16-అంగుళాల అల్లాయ్ వీల్స్ ఉన్నాయి,వాటి డిజైన్ స్పోర్టీగా ఉంటుంది. ఇందులో క్రోమ్ ఫినిష్డ్ డోర్ హ్యాండిల్స్ , ఇంటిగ్రేటెడ్ టర్న్ సిగ్నల్స్ ఉన్నాయి. డ్యూయల్ కలర్ ORVMలు కూడా అందించారు. వాహనం వెనుక భాగంలో, ఇన్నోవా BEV ఇంటర్‌కనెక్టింగ్ LED స్ట్రిప్స్‌తో టెయిల్ ల్యాంప్‌లు ఉంటాయి.

ఇంటీరియర్ విషయానికి వస్తే.. ఇన్నోవా ఎలక్ట్రిక్‌లో పెద్ద క్యాబిన్ చాలా ఆకట్టుకుంటుంది. దూర ప్రయాణాలకు ఇది ఉత్తమ ఎంపిక. ఇందులో పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంది. దీని ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌లో MIDతో అనలాగ్ డయల్స్ ఉన్నాయి. దీనికి స్టీరింగ్ వీల్‌పై స్విచ్‌లు ఉంటాయి. ఈ వాహనంలో కెప్టెన్ సీట్లు అందుబాటులో ఉన్నాయి. వెనుక ప్రయాణీకులకు కూడా స్క్రీన్‌లు చూడొచ్చు.

Exit mobile version
Skip to toolbar