Site icon Prime9

Best Family Cars: ఫ్యామిలీకి పర్ఫెక్ట్ కార్లు.. కుటుంబంతో జాలీగా తిరగొచ్చు!

Best Family Cars

Best Family Cars

Best Family Cars: దీపావళి పండుగకు కొత్త కారు కొనాలని చాలా మంది అనుకుంటారు. అయితే తక్కువ బడ్జెట్‌లో కుటుంబానికి ఏ కారు సరిపోతుందో తెలియక తికమకపడుతుంటారు. టయోటా రూమియన్, రెనాల్ట్ ట్రైబర్, మారుతి సుజికి ఎర్టిగా చాలా తక్కువ ధరలో ఆకర్షణీయమైన ఫీచర్లను అందిస్తాయి. వీటన్నింటిని రూ.10 లక్షల్లోపు కొనచ్చు.  ఏడుగురు హాయిగా ప్రయాణించొచ్చు. అలానే మైలేజ్ విషషయంలో కూడా నిరాశపరచవు. ఇప్పుడు ఈ కార్ల గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

Toyota Rumion
ముందుగా టయోటా రూమియన్ గురించి మాట్లాడుకుందాం. దీని ధర రూ. 10.44 నుండి రూ. 13.73 లక్షలు ఎక్స్-షోరూమ్. దీనిలో S, G, V వేరియంట్‌లు ఉన్నాయి.  1.5 లీటర్ పెట్రోల్, CNG ఇంజన్లు అందుబాటులో ఉన్నాయి. ఇది 5 స్పీడ్ మ్యాన్యువల్, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో ఉంటుంది. లీటర్‌కు 20.11 నుంచి 26.11 కిమీ మైలేజీని అందిస్తుంది.

ఈ కారులో 7 మంది సులభంగా ప్రయాణించవచ్చు. ఇది టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 6 స్పీకర్ సౌండ్ సిస్టమ్, ఆటోమేటిక్ ఏసీ, క్రూయిజ్ కంట్రోల్,  పుష్ బటన్ ఇంజన్ స్టార్ట్, స్టాప్ వంటి వివిధ ఫీచర్లు ఉన్నాయి. భద్రత కోసం 4 ఎయిర్‌బ్యాగ్‌లు ఉన్నాయి.

Renault Triber
రెనాల్ట్ ట్రైబర్ గురించి చెప్పాలంటే ఈ MPV కనిష్ట ధర రూ.6 లక్షలు. గరిష్ట ధర రూ.8.97 లక్షల ఎక్స్-షోరూమ్. ఇది ఐస్ కూల్ వైట్, సెడార్ బ్రౌన్, మూన్‌లైట్ సిల్వర్ వంటి వివిధ రంగులలో కూడా అందుబాటులో ఉంది. ఇది 1 లీటర్ నాచురల్ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్‌ను కలిగి ఉంది. ఇది 20 కిమీ వరకు మైలేజీని అందిస్తుంది.

కొత్త రెనాల్ట్ ట్రైబర్ ఎమ్‌పివిలో 7 మంది సౌకర్యవంతంగా కూర్చుని సుదూర పట్టణాలకు ప్రయాణించవచ్చు. ఇది టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డిజిటల్-డ్రైవర్ డిస్‌ప్లే, వైర్‌లెస్ ఛార్జర్, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్‌తో సహా పలు ఫీచర్లను కలిగి ఉంది. ఇందులో ప్రయాణీకుల రక్షణ కోసం 4 ఎయిర్‌బ్యాగ్‌లు ఉన్నాయి.

Maruti Suzuki Ertiga
మారుతి సుజుకి ఎర్టిగా ఒక ప్రసిద్ధ ఎమ్‌విపి ధర రూ.8.69 లక్షల నుండి రూ.13.03 లక్షల ఎక్స్-షోరూమ్. 1.5 లీటర్ పెట్రోల్ అండ్ సిఎన్‌జి ఇంజన్ ఆప్షన్ ఉంది. ఇది 20.3 నుండి 26.11 kmpl మైలేజీని ఇస్తుంది. మెటాలిక్ మాగ్మా గ్రే, పెర్ల్ ఆర్కిటిక్ వైట్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

ఈ ఎర్టిగా ఎమ్‌విపి  7 మంది ప్రయాణించవచ్చు. ఇందులో టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ప్యాడిల్ షిఫ్టర్లు, క్రూయిజ్ కంట్రోల్, ఆటో హెడ్‌లైట్లు, ఆటో ఏసీ వంటి డజన్ల కొద్దీ ఫీచర్లు ఉన్నాయి. భద్రత పరంగా ఇందులో డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లు, యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఉన్నాయి.

టయోటా రూమియన్, రెనాల్ట్ ట్రైబర్, మారుతి సుజుకి ఎర్టిగా ఎమ్‌పివిలు ఒకదానికొకటి మెరుగ్గా ఉన్నాయి. ఈ కార్లలో గరిష్టంగా 7 మంది వరకు కూర్చునే అవకాశం ఉన్నందున వాటిని మీ కుటుంబ వాహనంగా సులభంగా ఎంచుకోవచ్చు. ముఖ్యంగా రుమియన్, ఎర్టిగాలకు భారీ డిమాండ్ ఉంది. కాబట్టి డెలివరీ పొందడానికి చాలా నెలలు వేచి ఉండాల్సి ఉంటుంది.

Exit mobile version