Site icon Prime9

Upcoming Toyota Cars: మార్కెట్‌లోకి మంచి మంచి కార్లు వస్తున్నాయ్.. ఛార్జింగ్ అయిపోతుందనే దిగులే లేదు.. స్పీడ్‌లో తగ్గేదే లేదు!

Upcoming Toyota Cars

Upcoming Toyota Cars

Upcoming Toyota Cars: గత కొన్ని సంవత్సరాలుగా భారతీయ కస్టమర్లలో ఎస్‌యూవీ సెగ్మెంట్‌కి డిమాండ్ నిరంతరం పెరుగుతోంది.  2024 సంవత్సరం మొదటి త్రైమాసికంలో దేశంలోని మొత్తం కార్ల అమ్మకాలలో సస్‌యూవీ సెగ్మెంట్ మాత్రమే 52 శాతం వాటాను కలిగి ఉంది.  ఈ విభాగంలో పెరుగుతున్న డిమాండ్ దృష్ట్యా ప్రముఖ కార్ల తయారీ సంస్థ టయోటా తన 3 కొత్త ఎస్‌యూవీ మోడళ్లను వచ్చే ఏడాది అంటే 2025లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. కంపెనీ రాబోయే SUVలో 7 సీటర్ వేరియంట్,  ఎలక్ట్రిక్ కారు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో టయోటా రాబోయే 3 ఎస్‌యూవీ మోడళ్ల సాధ్యమైన ఫీచర్ల గురించి వివరంగా తెలుసుకుందాం.

7-Seater Toyota Hyryder
టయోటా తన పాపులర్ ఎస్‌యూవీ టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్‌లో 7-సీటర్ వేరియంట్‌ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఇంటర్నెట్‌లోని సామాచారం ప్రకారం కంపెనీ రాబోయే 7 సీటర్ టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్‌ను వచ్చే ఏడాది అంటే 2025లో విడుదల చేయనుంది. టయోటా  రాబోయే ఎస్‌యూవీ మారుతి గ్రాండ్ విటారా 7 సీటర్ ఆధారంగా డిజైన్ చేశారు. కారులో పవర్‌ట్రెయిన్‌గా 1.5 లీటర్ నేచురల్ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్, 1.5 లీటర్ స్ట్రాంగ్ హైబ్రిడ్ పెట్రోల్ ఇంజన్ ఉపయోగించారు.

Toyota Fortuner Hybrid
టయోటా ఫార్చ్యూనర్ గత కొన్ని సంవత్సరాలుగా భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన పెద్ద సైజ్ ఎస్‌యూవీగా కొనసాగుతోంది. ఇప్పుడు కంపెనీ టయోటా ఫార్చ్యూనర్ మైల్డ్ హైబ్రిడ్ వెర్షన్‌ను వచ్చే ఏడాది అంటే 2025లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. కారులో పవర్‌ట్రెయిన్‌గా 2.8 లీటర్ డీజిల్ ఇంజన్ ఉపయోగిస్తారు. ఇది 48 వోల్ట్ మైల్డ్ హైబ్రిడ్ సిస్టమ్‌కు కనెక్టై ఉంటుంది. కారులో ఇచ్చిన ఇంజన్ గరిష్టంగా 201 బీహెచ్‌పీ పవర్,  500 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

Toyota EV
టయోటా తన తొలి ఎలక్ట్రిక్ కారును భారత మార్కెట్లో విడుదల చేయనుంది. టయోటా ఈ ఎలక్ట్రిక్ కారు రాబోయే మారుతి సుజుకి eVX ఆధారంగా మార్కెట్ఋలోకి వస్తుంది. దీనిని కంపెనీ 2025 సంవత్సరం రెండవ త్రైమాసికంలో భారతీయ మార్కెట్లో లాంచ్ చేయవచ్చు. కారు 2 బ్యాటరీ ప్యాక్‌ల ఆప్షన్లను కలిగి ఉంటుంది. అందులో మొదటిది 48kWh బ్యాటరీ ఒకే ఛార్జ్‌పై 400 కిలోమీటర్ల రేంజ్ అందించగలదు. రెండవది 60kWh బ్యాటరీ ఒకే ఛార్జ్‌పై 550 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది.

Exit mobile version