Site icon Prime9

Toyota Hilux Black Edition: బ్లాక్ టైగర్.. హిలక్స్ బ్లాక్ ఎడిషన్.. చూస్తే అడవిలో జంతువులకు వణుకే..!

Toyota Hilux Black Edition

Toyota Hilux Black Edition

Toyota Hilux Black Edition: టయోటా కిర్లోస్కర్ మోటార్ ఒక నమ్మకమైన కార్ల తయారీ సంస్థ. గత జనవరిలో ముగిసిన భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పోలో కంపెనీ ‘హిలక్స్’ పికప్ ట్రక్ ‘బ్లాక్ ఎడిషన్’ మోడల్‌ను ఆవిష్కరించింది. ప్రస్తుతం, ఇదే పికప్ ట్రక్ రూ.37.90 లక్షల (ఎక్స్-షోరూమ్ – పాన్ ఇండియా) గ్రాండ్ ధర ట్యాగ్‌తో ప్రారంభించారు. రండి.. ఈ కొత్త కారు ఫీచర్ల గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

కొత్త టయోటా హిలక్స్ బ్లాక్ ఎడిషన్ పికప్ ట్రక్ ఆకర్షణీయమైన డిజైన్‌ను కలిగి ఉంది. సాధారణ ‘హిలక్స్’తో పోలిస్తే, ఇది బ్లాక్ కలర్ థీమ్‌లో కనిపిస్తుంది. దీని గ్రిల్, అల్లాయ్ వీల్స్, రియర్‌వ్యూ మిర్రర్స్, డోర్ హ్యాండిల్స్ కూడా బ్లాక్ కలర్‌లో కనిపిస్తాయి. ఎక్స్‌టీరియర్‌లో ప్రొజెక్టర్-LED హెడ్‌లైట్లు, LED టెయిల్ లైట్లు, టెయిల్‌గేట్‌పై ‘టయోటా’ పేరును పాత మోడల్‌లాగే పెద్ద అక్షరాలతో ఉంటుంది. కొత్త టయోటా హిలక్స్ బ్లాక్ ఎడిషన్ ఇంటీరియర్ డిజైన్ అద్భుతంగా ఉంటుంది.

ఈ పికప్ ట్రక్ పవర్‌ట్రెయిన్‌లో కూడా ఎటువంటి మార్పు చేయలేదు. ఇందులో 2.8-లీటర్ డీజిల్ ఇంజన్ ఆప్షన్ ఉంది. ఇది 204 పిఎస్ హార్స్ పవర్, 500 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ని విడుదల చేస్తుంది. ఇది 6-స్పీడ్ మాన్యువల్/6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో కూడా వస్తుంది. 12 kmpl వరకు మైలేజీని అందిస్తుంది. సరికొత్త టయోటా హిలక్స్ బ్లాక్ ఎడిషన్ పికప్ ట్రక్ 5-సీట్లు ఉంటాయి. ప్రయాణీకులు సుదూర పట్టణాలకు సులభంగా ప్రయాణించవచ్చు. వారాంతాల్లో, సెలవు దినాల్లో ప్రయాణించేటప్పుడు ఎక్కువ లగేజీని తీసుకెళ్లడానికి 435 లీటర్ల బూట్ స్పేస్ అందించారు.

కొత్త పికప్ ట్రక్‌లో అనేక అధునాతన ఫీచర్లు ఉన్నాయి. టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ (8-అంగుళాల), అనలాగ్ ఇన్‌స్ట్రుమెంట్ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే, పుష్ బటన్ స్టార్ట్/స్టాప్, డ్యూయల్ జోన్ ఆటో క్లైమేట్ కంట్రోల్, డ్యూయల్ జోన్ ఏసీ, 6-స్పీకర్ సౌండ్ సిస్టమ్, కూల్డ్ గ్లోవ్‌బాక్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ప్రయాణీకుల రక్షణ కోసం ఇందులో 7 ఎయిర్‌బ్యాగ్స్, హిల్ అసిస్ట్ కంట్రోల్, బ్రేక్ అసిస్ట్, ఫ్రంట్, వెనుక పార్కింగ్ సెన్సార్లు, రేర్ పార్కింగ్ కెమెరా, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ మౌంట్‌లు ఉన్నాయి.

Exit mobile version
Skip to toolbar