Site icon Prime9

Toyota Urban Cruiser Limited Edition: డబుల్ ధమాకా న్యూస్.. క్రూయిజర్ హైరైడర్ ఫెస్టివల్ లిమిటెడ్ ఎడిషన్‌ లాంచ్!

Toyota Urban Cruiser Limited Edition

Toyota Urban Cruiser Limited Edition

Toyota Urban Cruiser Limited Edition: టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ ఫెస్టివల్ లిమిటెడ్ ఎడిషన్‌ను విడుదల చేసింది. ఫెస్టివల్ సందర్భంగా కాంపాక్ట్ SUVకి ప్రత్యేక అప్‌గ్రేడ్‌లను తీసుకొచ్చారు. టాప్ 2 వేరియంట్‌లు G, Vలలో హైబ్రిడ్, నియో డ్రైవ్ పవర్‌ట్రెయిన్‌లు ఉన్నాయి. ఫెస్టివ్ లిమిటెడ్ ఎడిషన్ అన్ని టయోటా అధికారిక డీలర్‌షిప్‌లలో లిమిటెడ్ స్టాక్ అందుబాటులో ఉంటుంది. ఇది రూ. 50,817 విలువైన ఉచిత కాంప్లిమెంటరీ ప్యాకేజీని అందిస్తుంది. దీని గురించి వివరంగా తెలుసుకుందాం.

లిమిటెడ్ ఎడిషన్ అక్టోబర్ 31 వరకు డీలర్‌షిప్‌లలో మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఇంటీరియర్‌లో ఆల్-వెదర్ 3డి ఫ్లోర్‌మ్యాట్‌లు, లెగ్‌రూమ్ ల్యాంప్స్, డిజిటల్ వీడియో రికార్డర్ ఉంటాయి. బయట మడ్‌ఫ్లాప్స్, డోర్ వైజర్, డోర్ క్రోమ్ హ్యాండిల్స్, హుడ్ ఎంబ్లం, బాడీ క్లాడింగ్ ఉంటాయి. ఇది కాకుండా ముందు, వెనుక బంపర్, హెడ్‌ల్యాంప్, ఫెండర్, వెనుక డోర్ కాప్‌కు గార్నిష్ ఉంటుంది.

టయోటా అర్బన్ క్రూయిజర్‌లో ఎలాంటి అప్‌గ్రేడ్‌లు లేవు. SUV 1.5 లీటర్ నాచుర్ స్-పెట్రోల్, 1.5-లీటర్ పెట్రోల్-హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్ ఎంపికల నుండి పవర్ రిలీజ్ చేస్తుంది. ట్రాన్స్మిషన్ ఎంపికలు మాన్యువల్, ఆటోమేటిక్ యూనిట్లను కలిగి ఉంటాయి. మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో కూడిన 1.5-లీటర్ పెట్రోల్-CNG ఎంపిక కూడా అందుబాటులో ఉంది.

టయోటా కిర్లోస్కర్ మోటార్ వైస్ ప్రెసిడెంట్ మాట్లాడుతూ.. పెరుగుతున్న డిమాండ్, సానుకూల వ్యాపారం మా కార్ల తయారీని కొనసాగించడానికి ప్రోత్సహించిందని టయోటా కిర్లోస్కర్ మోటార్ సేల్స్-సర్వీస్ కార్ల వ్యాపారం వైస్ ప్రెసిడెంట్ శబ్రీ మనోహర్ అన్నారు. మేము మా వినియోగదారుల విభిన్న అవసరాలను అర్థం చేసుకోవాలి, నెరవేర్చాలి.

విలాసవంతమైన TGA ప్యాకేజీని కలిగి ఉన్న అర్బన్ క్రూయిజర్ రైరైడర్ ఫెస్టివల్ లిమిటెడ్ ఎడిషన్‌తో, మేము మా కస్టమర్‌లకు మరింత ప్రీమియం డ్రైవింగ్ అనుభవాన్ని అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ఆయన తెలిపారు. అలాగే అర్బన్ క్రూయిజర్ హైరైడర్ ప్రసిద్ధి చెందిన ప్రఖ్యాత పనితీరు, సామర్థ్యాన్ని అందిస్తుంది.

Exit mobile version