Site icon Prime9

Taisor Limited Edition: కార్ లవర్స్‌కు పండగే.. పిచ్చెక్కిస్తున్న టయోటా టైసర్ లిమిటెడ్ ఎడిషన్..!

Taisor Limited Edition

Taisor Limited Edition

Taisor Limited Edition: మారుతి సుజికి, టయోటా భాగస్వామ్యంలో ఇప్పటికే చాలా కార్లు వచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే. ఇటీవల మారుతి ఫ్రాంక్ రీబ్యాడ్జ్డ్ వెర్షన్ టయోటా టైసర్‌ను అదే భాగస్వామ్యంతో విడుదల చేశారు. కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో అధిక డిమండ్ ఉన్న అదే కారు లిమిటెడ్ ఎడిషన్ ఇప్పుడు విడుదల చేసింది. పండుగ సీజన్‌లో ఎక్కువ లాభాలు ఆర్జించేందుకు కంపెనీ ఈ కొత్త లిమిటెడ్ ఎడిషన్ విడుదల చేసింది. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

కొత్త టయోటా టైసర్ కాంపాక్ట్ ఎస్‌యూవీ లిమిటెడ్ ఎడిషన్ అవసరమైన టూల్స్ ప్యాకేజీతో వస్తుంది. లోపల, బయట కాస్మోటిక్ ఛేంజస్ కూడా పొందుతుంది. ఇది ఈ నెల 31 వరకు మాత్రమే సేల్స్‌లో ఉంటుంది. అప్పటికి బుకింగ్‌ల ఆధారంగా కొత్త లిమిటెడ్ ఎడిషన్ డెలివరీలు ఉంటాయి.

కొత్త టొయోటా టైసర్ లిమిటెడ్ ఎడిషన్ మోడల్ ధర రూ.10.56 లక్షల నుంచి రూ.12.88 లక్షలు ఎక్స్షో రూమ్ ఉంది. యాక్సెసరీల ప్యాక్ దీనికి కాంప్లిమెంటరీగా అందిస్తున్నారు. కంపెనీ ప్రకారం రూ. 20,160 విలువ టయోటా జెన్యూ పార్ట్స్ (TGA) అందించారు.

ఈ కాంప్లిమెంటరీ ప్యాక్‌లన్నీ లిమిటెడ్ ఎడిషన్‌లో ఉచితంగా లభిస్తాయి. ఇందులో హెడ్ ల్యాంప్స్ చుట్టూ క్రోమ్, ఫ్రంట్ గ్రిల్, సైడ్ మౌల్డింగ్, గ్రానైట్ గ్రే, రెడ్‌లో ఫ్రంట్, రియర్ స్పాయిలర్‌లు, డోర్ సిల్ గార్డ్‌లు ఉన్నాయి.

క్యాబిన్ లోపల లిమిటెడ్ ఎడిషన్‌లో డోర్ వైజర్‌లు, ఆల్ క్లైమేట్ 3డి మ్యాట్‌లు, డోర్ ల్యాంప్స్ ఉన్నాయి.  ఇంజన్ విషయానికి వస్తే టైసర్ ఎస్‌యూవీ 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్‌తో మాత్రమే అందుబాటులో ఉంది. ఇది 100 PS పవర్, 148 Nm టార్క్‌ని విడుదల చేస్తుంది. ఇది 5 స్పీడ్ మాన్యువల్ లేదా 6 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వస్తుంది.

కంపెనీ ప్రకారం.. 1.0 లీటర్ టర్బోపెట్రోల్ ఇంజన్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ వెర్షన్ 21.1 kmpl వరకు మైలేజీని అందిస్తుంది. అలాగే 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ వెర్షన్ 19.8 kmpl మైలేజీని అందిస్తుందని కంపెనీ పేర్కొంది.

Exit mobile version
Skip to toolbar