Site icon Prime9

TATA Tiago: దుమ్ముదులిపేసిన టాటా టియాగో.. సేల్స్‌లో దూకుడు.. 6 లక్షల మంది ఇళ్లకు చేరింది..!

TATA Tiago

TATA Tiago

TATA Tiago: హ్యాచ్‌బ్యాక్ కార్లు భారతీయులకు ఎప్పుడూ ఇష్టమైనవే. ఈ సెగ్మెంట్లో టాటా టియాగో, మారుతీ సుజికి స్విఫ్ట్, హ్యుందాయ్ ఐ20 వంటి కార్లు బాగా ప్రాచుర్యం పొందాయి. అయితే తాజాగా హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్‌లో టియాగో భారత మార్కెట్లో 6 లక్షల యూనిట్ల అమ్మకాల మార్క్‌ను అధిగమించింది. ఇంటర్నెట్‌లోని సమాచారం ప్రకారం నవంబర్ 2024 నాటికి టియాగో ఈ సంఖ్యను అధిగమించింది. అక్టోబర్ 2024 నాటికి టాటా టియాగో మొత్తం 5,96,61 మంది ఇళ్లకు చేరింది. కంపెనీ టియాగోని ఏప్రిల్ 6, 2016న మార్కెట్లోకి తీసుకొచ్చింది. దీని పూర్తి వివరాలపై ఓ లుక్కేద్దాం.

FY 2016లో టాటా టియాగో మొత్తం 1,096 కస్టమర్‌లను, 2017 FYలో మొత్తం 56,130 కస్టమర్‌లు,  FY 2018లో మొత్తం 78,829 కస్టమర్‌లను పొందింది. ఇంకా టాటా టియాగో 2019 ఆర్థిక సంవత్సరంలో మొత్తం 93,369 కస్టమర్లను, 2020 ఆర్థిక సంవత్సరంలో మొత్తం 49,365 కస్టమర్లను, 2021 ఆర్థిక సంవత్సరంలో మొత్తం 60,711 కస్టమర్లను పొందింది. మరోవైపు టాటా టియాగో 2022 ఆర్థిక సంవత్సరంలో మొత్తం 58,089 కస్టమర్లను, 2023 ఆర్థిక సంవత్సరంలో 77,399 కస్టమర్లను, 2024 ఆర్థిక సంవత్సరంలో 50,478 కస్టమర్లను. 2025 ఆర్థిక సంవత్సరంలో అక్టోబర్ నెల వరకు మొత్తం 37,202 కస్టమర్లను పొందింది.

టాటా టియాగో ఇంటీరియర్ విషయానికి వస్తే  లోపలి భాగంలో 7.0-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే కనెక్టివిటీ, 8-స్పీకర్ సౌండ్ సిస్టమ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వంటి ఫీచర్లు ఉంటాయి. ఇది కాకుండా భద్రత కోసం కారులో డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లు, వెనుక పార్కింగ్ సెన్సార్, ABS టెక్నాలజీ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. టాటా టియాగో మారుతి సుజుకి సెలెరియో, వ్యాగన్ఆర్ వంటి కార్లతో మార్కెట్లో పోటీ పడుతోంది. టాటా టియాగో  ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర టాప్ మోడల్ కోసం రూ. 5.65 లక్షల నుండి రూ. 8.90 లక్షల వరకు ఉంది.

పవర్‌ట్రెయిన్ గురించి మాట్లాడితే టాటా టియాగో 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్‌ను కలిగి ఉంది, ఇది గరిష్టంగా 86బీహెచ్‌పీ పవర్, 113ఎన్ఎమ్ పీట్ టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. ఇది కాకుండా కారులో CNG ఆప్షన్ కూడా ఉంది. ఇది గరిష్టంగా 73.5బీహెచ్‌పీ పవర్, 95ఎన్ఎమ్ పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. కారు  రెండు ఇంజన్లు 5-స్పీడ్ మాన్యువల్, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో ఉంటాయి. పెట్రోల్ మాన్యువల్ పై 20.1 కిమీ, పెట్రోల్ ఆటోమేటిక్ పై 19.43 కిమీ, CNG మాన్యువల్ పై 26.49 కిమీ,  CNG ఆటోమేటిక్ పై 28.06 కిమీ మైలేజీ ఇస్తుందని కంపెనీ పేర్కొంది.

Exit mobile version