Site icon Prime9

Top 5 Best Selling Cars: ఈ ఐదు కార్లకు తిరుగులేదు.. జనం ఎగబడి కొంటున్నారు..!

Top 5 Best Selling Cars

Top 5 Best Selling Cars: దేశంలో చిన్న కార్ల అమ్మకాలు ఎప్పుడూ బాగానే ఉన్నాయి. హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్‌లో కొనుగోలుదారుల కొరత లేదు. మధ్య తరగతి ప్రజల చూపు ఎప్పుడూ ఈ సెగ్మెంట్‌పైనే ఉంటుంది. ఇప్పుడు దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న టాప్ 5 కార్ల జాబితా వచ్చింది. ఈసారి కూడా మారుతీ సుజుకి కార్లు అత్యధికంగా అమ్ముడయ్యాయి. మీరు రానున్న రోజుల్లో చిన్న కారు కొనాలని ఆలోచిస్తున్నట్లయితే.. దాని కంటే ముందు ఈ 5 కార్ల గురించి వివరంగా తెలుసుకుందాం.

Maruti WagonR
మారుతీ సుజుకి వ్యాగన్ఆర్ దేశంలోనే అత్యధికంగా అమ్ముడవుతున్న చిన్న కారుగా అవతరించింది. గత ఏడాది డిసెంబర్‌లో కంపెనీ ఈ కారు మొత్తం 17,303 యూనిట్లను విక్రయించగా, డిసెంబర్ 2023లో 8578 యూనిట్ల వ్యాగన్ఆర్ విక్రయించింది. ఈసారి ఈ కారు అమ్మకాలు బాగా పెరిగాయి. దాదాపు 102శాతం YOY వృద్ధిని సాధించింది. ఇది ఫ్యామిలీ కారు. వ్యాగన్ఆర్ ధర రూ. 5.54 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ఇది 1.0L, 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్‌లతో పాటు CNGలో కూడా అందుబాటులో ఉంది.

Maruti Swift
కొత్త మారుతి సుజుకి స్విఫ్ట్ అమ్మకాలు కొన్నిసార్లు తగ్గుతాయి, కొన్నిసార్లు బాగానే ఉంటాయి. గత ఏడాది డిసెంబర్‌లో మారుతీ మొత్తం 10,421 యూనిట్ల స్విఫ్ట్‌లను విక్రయించగా, డిసెంబర్ 2023లో స్విఫ్ట్ 11,843 యూనిట్లను విక్రయించింది. ఈసారి ఈ కారు విక్రయాల్లో 12.01శాతం క్షీణత నమోదైంది. స్విఫ్ట్‌లో 1.2లీటర్ పెట్రోల్ ఇంజన్ ఉంది. ఈ కారు ధర రూ.6.49 లక్షల నుండి ప్రారంభమవుతుంది.

Maruti Baleno
మారుతి సుజుకి బాలెనోను భారతదేశంలో ఎక్కువగా ఇష్టపడుతున్నారు. కానీ ఈ కారు అమ్మకాలు చాలా సార్లు నిరాశపరిచాయి. గత ఏడాది డిసెంబర్‌లో (2024) కంపెనీ ఈ కారు మొత్తం 9,112 యూనిట్లను విక్రయించగా, డిసెంబర్ 2023లో 10,669 యూనిట్ల బాలెనో అమ్మకాలు జరిగాయి. బాలెనో ధర రూ.6.66 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.

Maruti Alto
చాలా కాలం తర్వాత, మారుతి సుజుకి ఆల్టో గత ఏడాది డిసెంబర్‌లో (2024) మొత్తం 7410 యూనిట్లను విక్రయించగా, డిసెంబర్ 2023లో 2497 యూనిట్లు అమ్ముడయ్యాయి. విక్రయాలలో 197శాతం వృద్ధి కనిపించింది. మారుతి ఆల్టో ధర రూ. 3.99 లక్షల నుండి ప్రారంభమవుతుంది.

Tata Tiago/EV
గత ఏడాది (2024) డిసెంబరులో టాటా మోటార్స్ చిన్న కారు టియాగో అమ్మకాలు కూడా పెరిగాయి, అయితే 2023 డిసెంబర్‌లో 4852 యూనిట్ల టియాగో విక్రయించారు. అమ్మకాలలో 3.17శాతం వృద్ధి కనిపించింది. టియాగో ధర రూ.4.99 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.

Exit mobile version
Skip to toolbar