Best CNG Cars: నానాటికీ పెరుగుతున్న కాలుష్యం, ఆకాశాన్నంటుతున్న పెట్రోల్, డీజిల్ ధరల మధ్య CNG కార్లు ఒక వరంగా మారాయి. మెరుగైన ఇంధన సామర్థ్యం ఇంజన్లతో తక్కువ ధరలకు వీటిని కొనుగోలు చేయొచ్చు. ఈ కథనంలో రూ. 10 లక్షల కంటే తక్కువ ధరలో లభించే అటువంటి CNG కార్లను చూద్దాం. ఇందులో మారుతి సుజుకి ఆల్టో కె10 సిఎన్‌జి నుండి హ్యుందాయ్ ఎక్స్‌టర్ సిఎన్‌జి వరకు ఉన్నాయి.
Maruti Suzki Alto K10 CNG
ఆల్టో కె10ని భారతీయ మార్కెట్లో అత్యంత సరసమైన సిఎన్‌జి కారుగా కొనుగోలు చేయచ్చు. మారుతి ఈ ఇంధన సామర్థ్య CNG కారు ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 5.73 లక్షలు మాత్రమే.దీని 1.0-లీటర్ పెట్రోల్ ఇంజన్ CNG మోడ్‌లో 56 hp, 82.1 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది, ఐదు-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో జతచేసి ఉంటుంది. ఆల్టో కె10 సిఎన్‌జి క్లెయిమ్ చేసిన మైలేజ్ 33.85 కిమీ.
Maruti Suzuki Celerio CNG
దేశంలో అత్యంత సరసమైన సిఎన్‌జి కార్ల జాబితాలో సెలెరియో రెండవ స్థానంలో ఉంది. CNG వెర్షన్‌లో దీని ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 6.73 లక్షలు మాత్రమే. సెలెరియో కూడా 1.0 లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో వస్తుంది. ఈ పవర్‌ట్రెయిన్ 56 హెచ్‌పి, 82.1 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో జతై ఉంటుంది. ఒక కిలో సిఎన్‌జితో 34.43 కిమీల వరకు మైలేజ్ ఇస్తుందని కంపెనీ పేర్కొంది.
Tata Punch CNG
పంచ్ CNG దేశంలో అత్యంత సురక్షితమైన, అత్యంత పొదుపుగా ఉండే CNG కారుగా నిలిచింది. కంపెనీ దీనిని కేవలం రూ.7.22 లక్షల ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధరకే విక్రయిస్తోంది. సన్‌రూఫ్, అద్భుతమైన గ్రౌండ్ క్లియరెన్స్, 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌తో వస్తున్న ఈ SUV ట్విన్ సిలిండర్ టెక్నాలజీని కలిగి ఉంది. ఇందులోని 1.2 లీటర్ నాచురల్ పెట్రోల్ ఇంజన్ CNG మోడ్‌లో 72 హెచ్‌పి పవర్, 103 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ పవర్‌ట్రెయిన్ 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో ఉంటుంది. ఒక కేజీ సిఎన్‌జిలో టాటా పంచ్ సిఎన్‌జి 27 కిమీల దూరాన్ని కవర్ చేయగలదని కంపెనీ పేర్కొంది.
Maruti Suzuki Fronx CNG
మారుతి అత్యధికంగా అమ్ముడవుతున్న SUV Fronxని CNG ఎంపికలో కూడా కొనుగోలు చేయవచ్చు. దీని ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 8.47 లక్షలు. ఇందులోని 1.2 లీటర్, కె-సిరీస్ NA ఇంజన్ CNG మోడ్‌లో 77.5 పీఎస్ పవర్, 98.5 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ ఎమ్‌టీ గేర్‌బాక్స్‌తో ఉంటుంది. దీని మైలేజ్ 28.51 కిమీ.
Hyundai Exter CNG
హ్యుందాయ్ ఎక్స్‌టర్ కూడా డ్యూయల్ సిలిండర్ టెక్నాలజీతో లాంచ్ అయింది. తద్వారా వాహనంలో బూట్ స్పేస్ కొరత ఉండదు. మీరు దీన్ని రూ. 8.50 లక్షల ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర వద్ద కొనుగోలు చేయవచ్చు. ఎక్సెటర్‌లో ఇచ్చిన 1.2 లీటర్ బయో ఫ్యూయల్ ఇంజన్ 67 బిహెచ్‌పి పవర్, 95.2 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ పవర్‌ట్రెయిన్ 5-స్పీడ్ ఎమ్‌టీ గేర్‌బాక్స్‌తో జత చేసి ఉంటుంది. దీని క్లెయిమ్ మైలేజ్ 27.1 కిమీ.