Site icon Prime9

Toyota Urban Cruiser EV: ఈవీ రేసులో కొత్త ప్లేయర్.. టయోటా ఎలక్ట్రిక్ కారు.. ఇక మిగతా కంపెనీల పనంతే..

Toyota Urban Cruiser EV

Toyota Urban Cruiser EV

Toyota Urban Cruiser EV: టయోటా-మారుతి సుజుకి రెండు కంపెనీలు ఫేమస్ మోడళ్లను  రీబ్యాడ్జ్ చేసి విక్రయిస్తున్నాయి. ఇప్పుడు ఈ బ్రాండ్లు భారతీయ ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలోకి ప్రవేశించేందుకు సిద్ధంగా ఉన్నాయి. మారుతి సుజుకి జనవరిలో జరిగిన ఆటో ఎక్స్‌పో 2025లో తన మొదటి ఎలక్ట్రిక్ SUV, E-వితారాను ఆవిష్కరించింది. ఈ కారు ఈ ఏడాది చివర్లో విడుదలయ్యే అవకాశం ఉంది. అలాగే, ఈ ఎస్‌యూవీ టయోటా మోడల్ కూడా రానుంది.

కానీ ఈ ఎలక్ట్రిక్ టొయోటా SUV ఇప్పటివరకు చాలా తక్కువగా కనిపించింది. అర్బన్ BEV లేదా అర్బన్ క్రూయిజర్ EV , వీడియోలు ప్రతిసారీ సోషల్ మీడియాలో కనిపించినప్పటికీ, ఇంటీరియర్ మాత్రమే బహిర్గతం కాలేదు. చివరకు ఇంటీరియర్ వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి.

వీడియోలో  టయోటా ఎలక్ట్రిక్ SUV ప్రొడక్షన్-రెడీ వెర్షన్‌గా కనిపిస్తుంది. టయోటా దీనిని అర్బన్ క్రూయిజర్ EV అని పిలుస్తోంది. ఇండస్ట్రీ సమాచారం ప్రకారం టయోటా,మారుతి ఎలక్ట్రిక్ SUVలు రెండూ భారతదేశంలోని సుజుకి గుజరాత్ యూనిట్‌లో తయారుచేస్తున్నారు. రెండు కార్లు ఒకేలా కనిపిస్తున్నాయి కానీ కొన్ని కాస్మెటిక్ మార్పులు ఉంటాయి.

టయోటా ఈవా వెర్షన్ సొగసైన హెడ్‌ల్యాంప్, డ్యూయల్-ఫంక్షన్ల ఎల్ఈడీ డీఆర్‌లతో వస్తుంది. సైడ్ ప్రొఫైల్ విషయానికి వస్తే.. ఫెండర్‌పై ఛార్జింగ్ పోర్ట్, ఎస్‌యూవీ లుక్ మెరుగుపరచడానికి మందపాటి క్లాడింగ్‌తో కూడిన 19-అంగుళాల అల్లాయ్ వీల్స్, వెనుక డోర్ హ్యాండిల్స్ C-పిల్లర్‌లు ఉన్నాయి.

వెనుక విషయానికి వస్తే.. అర్బన్ క్రూయిజర్ ఈవీ మారుతి  ఇ-వితారాని పోలి ఉంటుంది. క్లియర్-లెన్స్ LED టెయిల్ ల్యాంప్ రెండు టెయిల్ లైట్లను కలుపుతూ స్పష్టమైన గ్లాస్ ప్యానెల్‌ను కలిగి ఉంది. టయోటా బ్యాడ్జింగ్ వివిధ ప్రదేశాలలో, వెనుకవైపు AWD బ్యాడ్జ్‌ని కూడా చూడవచ్చు.

ఇంటీరియర్ విషయానికి వస్తే.. ఇది పొడవాటి AC వెంట్లతో కూడిన లేయర్డ్ డిజైన్‌ను కలిగి ఉంది. డ్యాష్‌బోర్డ్‌లో రెండు 10-అంగుళాల స్క్రీన్‌లు ఉన్నాయి, ఒకటి టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ కోసం, మరొకటి ఫుల్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ కోసం. ఇది ఏసీ కంట్రోల్స్, వాల్యూమ్ కోసం ఫిజికల్ బటన్‌లతో ఫ్లోటింగ్ సెంటర్ కన్సోల్‌ను కలిగి ఉంది.

డ్రైవర్ సీటు ఎలక్ట్రికల్‌గా అడ్జస్ట్ చేయగలదు. ఇది అనేక కంట్రోల్స్‌తో కూడిన ట్విన్-స్పోక్ స్టీరింగ్ వీల్‌ను కలిగి ఉంది. ఎక్కువ స్థలం కోసం వెనుక సీట్లను ముందుకు వెనుకకు లాగవచ్చు. ఇతర ఫీచర్లలో యాంబియంట్ లైటింగ్, జెబిఎల్ స్పీకర్లు, గ్లోస్ బ్లాక్ సెంటర్ కన్సోల్, లెవెల్ 2 అడాస్, మరెన్నో ఉన్నాయి.

Exit mobile version
Skip to toolbar