Site icon Prime9

Cheapest 7 Seater Cars: రెనాల్ట్ ట్రైబర్.. చవకైన 7 సీటర్ కార్.. డిమాండ్ కూడా తగ్గడం లేదు..!

Cheapest 7 Seater Cars

Cheapest 7 Seater Cars

Cheapest 7 Seater Cars: దేశంలో చవకైన 7 సీటర్ కార్లకు డిమాండ్ వేగంగా పెరుగుతోంది. కార్ కంపెనీలు కూడా తక్కువ ధరల విభాగంలో కొత్త కార్లను ప్రవేశపెడుతున్నాయి.  ఇప్పుడు ప్రజలు ప్రతి నెలా తమ కుటుంబం లేదా స్నేహితులతో ఎక్కడికో బయటకు వెళుతున్నారు. 7 సీట్ల కార్ల సెగ్మెంట్ నిరంతరం వృద్ధి చెందడానికి ఇదే కారణం. ప్రస్తుతం భారతదేశంలో చాలా 7 సీటర్ కార్లు అందుబాటులో ఉన్నప్పటికీ డబ్బుకు విలువైనదిగా నిరూపించగల ఒక కారు ఉంది. మీరు కూడా మీ బడ్జెట్‌లో ఉండే 7-సీటర్ కారు కోసం చూస్తున్నట్లయితే Renault Triber మీకు ఎంపిక కావచ్చు. ఈ కారు ధర, ఫీచర్ల గురించి వివరంగా తెలుసుకుందాం.

రెనాల్ట్ ట్రైబర్ తక్కువ ధరలో మంచి 7 సీట్ల కారుగా మారచ్చు. ఇందులో మీకు మంచి స్పేస్ లభించడమే కాదు, దీని పనితీరు కూడా కస్టమర్లకు నిరాశ కలిగించే అవకాశం లేదు. భద్రత కోసం ఇందులో ఈబీడీతో పాటు డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్‌లు, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ సౌకర్యం కూడా ఉంది. అంతేకాకుండా దాని బిల్డ్ క్వాలిటీ కూడా చాలా బలంగా ఉంటుంది.

పనితీరు కోసం రెనాల్ట్ ట్రైబర్ 999cc పెట్రోల్ ఇంజన్‌ని కలిగి ఉంది. ఇది 72 పీఎసస్ పవర్, 96 ఎన్ఎమ్ టార్క్‌ను రిలీజ్ చేస్తుంది. ఈ ఇంజన్ 5 స్పీడ్ మాన్యువల్, ఏఎమ్‌టీ గేర్‌బాక్స్‌తో అమర్చబడి ఉంటుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ లేదా 5-స్పీడ్ AMTతో జత చేయబడింది. ఇది మ్యాన్యువల్‌లో 17.65 kmpl, ఆటోమేటిక్‌లో 14.83 kmpl మైలేజీని ఇస్తుంది. ఈ ఇంజన్ అన్ని వాతావరణ పరిస్థితుల్లోనూ బాగా పనిచేస్తుంది.

రెనాల్ట్ ట్రైబర్‌లో 5+2 సీటింగ్ ఆప్షన్ అందుబాటులో ఉంది. అలాగే 5 పెద్ద,  2 చిన్న వ్యక్తులు ఇందులో సులభంగా కూర్చోవచ్చు. ఈ కారు 8-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను కలిగి ఉంది.  ఇది ఆపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటోకి కనెక్ట్ చేయగలదు. స్పేస్ గురించి మాట్లాడితే 5 పెద్ద వ్యక్తులు ఇందులో సులభంగా కూర్చోవచ్చు. కానీ ఇద్దరు చిన్న పిల్లలు మాత్రమే కూర్చో గలరు. అయితే ఇది పేరుకు మాత్రమే 7 సీటర్. ఇప్పుడు మీకు తక్కువ ధరకు 5+2 ఎంపిక లభిస్తోంది. అంతే కాకుండా స్థలం సరిగ్గా లేని చోట నామమాత్రంగా బూట్ స్పేస్ ఇచ్చారు.

Exit mobile version