Site icon Prime9

PEV Highrider First Electric 4 Wheeler scooter: కారు లాంటి ఎలక్ట్రిక్ స్కూటర్.. ఫీచర్స్ వేరే లెవల్.. బ్యాలెన్సింగ్ టెన్షన్ అసలు ఉండదు..!

PEV Highrider First Electric 4 Wheeler scooter

PEV Highrider First Electric 4 Wheeler scooter: ద్విచక్రవాహన మార్కెట్లో మూడు చక్రాల, నాలుగు చక్రాల ఎంపికలు అందుబాటులో ఉన్నాయి.ఇందులో PEV హైరైడర్ కూడా ఉంది. ఈ స్కూటర్ ప్రత్యేకత ఏంటంటే.. కారు మాదిరిగానే దీనికి నాలుగు చక్రాలు ఉంటాయి. దీని కారణంగా బ్యాలెన్సింగ్ టెన్షన్ ఉండదు. ఇది మాత్రమే కాదు, సౌకర్యవంతమైన సీటు, లెగ్ రూమ్, బూట్ స్పేస్ వంటి అనేక ఫీచర్లు ఉన్నాయి. ఓవరాల్‌గా ఇది ఇద్దరు ప్రయాణికులతో కూడిన కారులా ఉంటుంది.

PEV Highrider First Electric 4 Wheeler scooter
ఈ ఎలక్ట్రిక్ ఫోర్-వీలర్ స్కూటర్ డిజైన్ గురించి మాట్లాడితే ఇది ముందు భాగంలో కారు వంటి బానెట్‌ను కలిగి ఉంది. దీని క్రింద, స్కూటర్ వీల్, మోటార్ సెటప్ చేశారు. LED DRLలు ముందు భాగంలో అందుబాటులో ఉన్నాయి. అదే సమయంలో ఇది మల్టీ ఫంక్షన్‌తో కూడిన హెడ్‌లైట్‌ను కలిగి ఉంది. దీని బ్యాక్ ప్రొఫైల్ గురించి చెప్పాలంటే, వెనుక సీటు కింద పెద్ద బూట్ స్పేస్ ఉంది. ఇది వెనుక పెద్ద లైట్‌తో సెట్ చేశారు, ఇది రాత్రిపూట,  బ్రేక్‌లు వేసేటప్పుడు వెనుక ఉన్న వాహనాన్ని అలర్ట్ చేస్తుంది.

PEV Highrider First Electric 4 Wheeler scooter Specifications
ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ 600 వాట్ల బ్యాటరీ ప్యాక్ కెపాసిటీని కలిగి ఉంటుంది. హైరైడర్ ఎలక్ట్రిక్ స్కూటర్ రెండు రకాల బ్యాటరీ ఎంపికలలో అందుబాటులో ఉంది, వీటిలో లిథియం-అయాన్, లెడ్-యాసిడ్ ఉన్నాయి. బేస్ వేరియంట్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 60కిమీల రేంజ్ అందిస్తుంది. ఇది 6 గంటల్లో 0 నుండి 80 శాతం వరకు ఛార్జ్ అవుతుంది. ఈ స్కూటర్ గరిష్ట వేగం గంటకు 25 కి.మీ. ఇందులో 1000W మోటార్ ఉంది. సాధారణ ప్లగ్ సహాయంతో స్కూటర్ బ్యాటరీని ఇంట్లోనే ఛార్జ్ చేసుకోవచ్చు.

PEV Highrider First Electric 4 Wheeler scooter Features
ఈ స్కూటర్‌లో ఇద్దరు ప్రయాణికులకు సీట్లు ఉన్నాయి. ఈ రెండు సీట్లు ఆర్మ్‌రెస్ట్‌తో వస్తాయి. అలాగే, మీ రైడింగ్ ,సీటింగ్ పొజిషన్ ప్రకారం వాటిని ముందుకు లేదా వెనుకకు మూవ్ చేయచ్చు. రెండు సీట్లు చాలా సౌకర్యవంతంగా ఉంటాయి, పిల్లలు కూడా సౌకర్యవంతంగా కూర్చోవచ్చు. కాలు దగ్గర పెద్ద స్థలం కూడా ఉంది, ఇక్కడ మీరు సామాను సౌకర్యవంతంగా తీసుకెళ్లవచ్చు. దీనితో పాటు, సెంటర్ లాకింగ్ కీ, బూట్ స్పేస్ కోసం ప్రత్యేక కీ అందుబాటులో ఉన్నాయి.

స్కూటర్ ముందు భాగంలో సామాను నిల్వ చేయడానికి బాటిల్ హోల్డర్ ,ఓపెన్ ట్రంక్ ఉన్నాయి. సనన్ బ్యాగ్‌ని వేలాడదీయగలిగే హుక్ కూడా ఉంది. వెనుక భాగంలో ఒక పెట్టె కూడా అందించారు, దీని సామర్థ్యం సుమారు 40 లీటర్లు ఉంటుంది. అదే సమయంలో వెనుక సీటు కింద దాదాపు 50 లీటర్ల హిడెన్ స్టోరేజ్ అందించారు. దీని బరువు 115 కిలోలు. ఇందులో ముందు భాగంలో డిస్క్ బ్రేక్‌లు, వెనుక భాగంలో డ్రమ్ బ్రేక్‌లు ఉన్నాయి. మీరు దీన్ని వైట్, బ్లాక్, రెడ్ కలర్ ఆప్షన్స్‌లో కొనుగోలు చేయచ్చు.

PEV Highrider First Electric 4 Wheeler scooter Price
ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర గురించి చెప్పాలంటే దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.92,000. కంపెనీ తన మోటారు, బ్యాటరీ, వాహనంపై 3 సంవత్సరాల వారంటీని కూడా ఇస్తుంది. ఈ స్కూటర్ ఛార్జర్‌పై కంపెనీ ఎలాంటి వారంటీని ఇవ్వడం లేదు. ఈ స్కూటర్‌ను నడపడానికి మీకు రిజిస్ట్రేషన్, డ్రైవింగ్ లైసెన్స్ అవసరం. ప్రస్తుతం భారతీయ మార్కెట్లో ఈ విభాగంలో ఇతర ఆప్షన్లు లేవు.

Exit mobile version