Site icon Prime9

Maruti Baleno CNG: దుమ్మురేపే మైలేజ్ ఇచ్చే కార్ వచ్చేస్తుంది.. బాలెనో సిఎన్‌జి.. రేంజ్ అదిరిపోద్ది..!

Maruti Baleno CNG

Maruti Baleno CNG

Maruti Baleno CNG: భారతదేశంలో అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజికి ఇప్పుడు తన కొత్త బాలెనో టాప్ వేరియంట్‌ను సిఎన్‌జి‌లో తీసుకువస్తోంది. వచ్చే ఏడాది జరిగే భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025లో కొత్త మోడల్‌ను ప్రవేశపెట్టనున్నారు. మారుతి సుజికి కొంతకాలం క్రితం స్విఫ్ట్, డిజైర్‌లను విడుదల చేసింది. ఈ రెండు వాహనాలకు మంచి ఆదరణ లభించింది. దీన్ని దృష్టిలో ఉంచుకొని కంపెనీ ఇప్పుడు సిఎన్‌జిలో బాలెనో ట్రిప్ మోడల్‌ను తీసుకొస్తుంది.

మునుపటి కంటే ఎక్కువ మైలేజీని పొందడమే కాకుండా, కొత్త ట్రిప్‌లో అదనపు ఫీచర్లు కూడా అందుబాటులో ఉంటాయి. ఈ కొత్త మోడల్‌కు సంబంధించి మారుతి సుజుకి భారతదేశంలో ఎప్పుడు లాంచ్ చేస్తుందో ఇంకా ధృవీకరించలేదు. కానీ మీడియా నివేదికల ప్రకారం.. కంపెనీ భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025లో కొత్త టాప్-స్పెక్ CNG ట్రిమ్‌ను పరిచయం చేయవచ్చు.

Maruti Baleno CNG Engine
మీడియా నివేదికల ప్రకారం.. బాలెనో కొత్త టాప్-స్పెక్ CNG ట్రిమ్‌లోని ఇంజన్ ఎంపికను ఇప్పటికే ఉన్న వేరియంట్‌గా ఉపయోగించవచ్చు. కొత్త టాప్ ట్రిమ్ సాధారణ పెట్రోల్ మోడల్ కంటే తక్కువ పవర్ రిలీజ్ చేస్తుంది. ఇంజిన్ గురించి మాట్లాడితే కొత్త CNG ట్రిమ్‌లో 1197cc ఇంజన్ ఉంది. ఇది 5 స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో వస్తుంది. ఈ ఇంజన్ 76 బిహెచ్‌పి పవర్, 98 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

ప్రస్తుత బాలెనో CNG ఇంజన్ గురించి మాట్లాడితే.. ఇది డెల్టా, జీటా వేరియంట్‌లు అనే రెండు వేరియంట్‌లలో మాత్రమే అందుబాటులో ఉంది. ఇందులో 1.2-లీటర్, 4-సిలిండర్ పెట్రోల్ ఇంజన్‌ని ఉపయోగించారు. ఇందులో అమర్చిన ఇంజన్ గరిష్టంగా 88 బిహెచ్‌పి పవర్, 113 ఎన్ఎమ్ టాప్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. CNGకి మారినప్పుడు, ఈ ఇంజన్ గరిష్టంగా 76 బిహెచ్‌పి పవర్, 98 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

Maruti Baleno CNG Features
కొత్త బాలెనో సిఎన్‌జి డిజైన్‌లో ఎలాంటి మార్పు ఉండదు. ప్రస్తుత మోడల్ లాగానే, కొత్త మోడల్ DRLS,  రౌండ్ ఫాగ్ ల్యాంప్‌లతో LED హెడ్‌లైట్ సెటప్‌తో అదే ఫ్రంట్ ఫాసియాను పొందుతుంది. ఇది కాకుండా, దీని వెనుక లుక్‌లో ఎటువంటి మార్పు ఉండదు. ఫీచర్ల గురించి చెప్పాలంటే క్రూయిజ్ కంట్రోల్, ఆటో-ఫోల్డింగ్ ORVMలు, ఆటో-డిమ్మింగ్ IRVM, 360-డిగ్రీ కెమెరా వంటి ఫీచర్లు అందుబాటులో ఉంటాయి. ఇది కాకుండా ఇందులో 9-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను కూడా  ఉంది.

Exit mobile version