Site icon Prime9

Hyundai i20: అదిరిపోయిన ఐ20.. సేఫ్టీ‌లో టాప్.. ఫీచర్లలో తోపు..!

Hyundai i20

Hyundai i20

Hyundai i20: భారతీయ ఆటోమొబైల్ మార్కెట్‌లో హ్యుందాయ్ ఐ20 కూడా ప్రముఖ హ్యాచ్‌బ్యాక్‌లలో ఒకటి. ఈ కారుకు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ నుంచి విపరీతమైన డిమాండ్ ఉంది. ఈ పండుగ సీజన్‌లో ఈ కారు కొనాలని ప్లాన్ చేస్తుంటే ఈ సమాచారం చాలా ఉపయోగంగా ఉంటుంది. దీనిలో హ్యుందాయ్ ఐ20 ఫీచర్లు, ఆన్ రోడ్ ప్రైస్, ఈఎమ్ఐ డౌన్‌పేమెంట్ తదితర వివరాలను తెలుసుకోవచ్చు. దీని ద్వారా మంచి బడ్జెట్‌లో కారును ఇంటికి తీసుకెళ్లచ్చు.

రాజధాని ఢిల్లీలో హ్యుందాయ్ ఐ20  బేస్ ఎరా పెట్రోల్ వేరియంట్ ఆన్-రోడ్ ధర దాదాపు రూ.7.99 లక్షలు. రూ.లక్ష డౌన్ పేమెంట్ చెల్లించి కొనుగోలు చేస్తే  9.8 శాతం వడ్డీ రేటుతో 5 ఏళ్లపాటు ప్రతి నెలా దాదాపు రూ.15 వేల ఈఎంఐ చెల్లించాల్సి ఉంటుంది. అయితే హ్యుందాయ్ ఐ20 ఆన్-రోడ్ ప్రైస్,  లోన్ ఆప్షన్లు నగరాలు, డీలర్‌షిప్‌లను బట్టి మారవచ్చు. ఇది కాకుండా రుణం లభించే వడ్డీ రేటు శాతం మీ క్రెడిట్ స్కోర్‌పై ఆధారపడి ఉంటుంది. సాధారణంగా కార్ లోన్ 8-10 శాతం వడ్డీ రేటుతో లభిస్తుంది.

హ్యుందాయ్ i20 పనితీరు విషయానికి వస్తే కొత్త i20 హ్యాచ్‌బ్యాక్ 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్‌ను పొందుతుంది. ఈ ఇంజన్ 83 PS పవర్, 115 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్‌తో 5 స్పీడ్ మాన్యువల్, CVT ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఎంపిక అందుబాటులో ఉంది. ఫీచర్లు స్పెసిఫికేషన్‌లలో హ్యుందాయ్ i20 ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, 10.25 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 7 స్పీకర్ బోస్ సౌండ్ సిస్టమ్, డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, USB టైప్ సి ఫాస్ట్ ఛార్జింగ్‌తో కూడిన ఎయిర్ ప్యూరిఫైయర్ వంటి ఫీచర్లతో వస్తుంది.

ప్రయాణీకుల భద్రత కోసం హ్యుందాయ్ i20లో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ISOFIX చైల్డ్ సీట్ ఎంకరేజ్, ESC, హిల్ అసిస్ట్ కంట్రోల్, డే-నైట్ IRVM, వెహికల్ స్టెబిలిటీ మేనేజ్‌మెంట్, ప్రయాణికులందరికీ మూడు-పాయింట్ సీట్ బెల్ట్‌లు ఉన్నాయి. ఇది కాకుండా టాప్ వేరియంట్‌లో వెనుక పార్కింగ్ కెమెరా, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, ఆటోమేటిక్ హెడ్‌ల్యాంప్‌లు కూడా ఉన్నాయి. మీకు తక్కువ ధరలో ఎక్కువ భద్రత కావాలంటే మీరు హ్యుందాయ్ ఐ20ని పరిగణించవచ్చు.

భారత్ మార్కెట్లో హ్యుందాయ్ ఐ20 మారుతి బాలెనో, టాటా ఆల్ట్రోజ్ వంటి కార్లతో పోటీపడుతుంది. మారుతి బాలెనో  బేస్ వేరియంట్  ఆన్-రోడ్ ధర దాదాపు రూ. 7.52 లక్షలు. ఇది హ్యుందాయ్ ఐ20 కంటే తక్కువ. అయితే భద్రత పరంగా బాలెనో హ్యుందాయ్ ఐ20 కంటే వెనుకబడి ఉంది. కొత్త బాలెనో హ్యాచ్‌బ్యాక్ 1.2 లీటర్ పెట్రోల్, CNG ఇంజన్‌లతో వస్తుంది. వేరియంట్‌పై ఆధారపడి ఇది 5 స్పీడ్ మ్యాన్యువల్, 5 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఎంపికను కలిగి ఉంది. మారుతి సుజుకి బాలెనో 22.35 నుండి 30.61 kmpl మైలేజీని ఇస్తుంది.

Exit mobile version