Budget Family Car: తక్కువ ధరకే మంచి ఫ్యామిలీ కార్.. 7 మంది హాయిగా కూర్చోవచ్చు!

Budget Family Car: దేశంలో ఎక్కువ మంది ప్రజలు దీపావళి రోజున కొత్త కారు కొనడం శుభపరిణామంగా భావిస్తారు. మీరు కూడా పండుగ రోజున మీ ఫ్యామిలీ  కోసం కొత్త కారు కొనాలని చూస్తున్నట్లయితే రెనాల్ట్ ట్రైబర్ 7 సీటర్ మంచి ఎంపికగా ఉంటుంది. ఈ కారును మీరు కేవలం రూ. 6 లక్షలకే ఇంటికి తీసుకెళ్లచ్చు. ఈ కారులో చాలా ఎక్కువ స్పేస్ ఉంటుంది. మొత్తం కుటుంబం సరిపోయేంత స్థలం ఉంది. ఇది ఒక అద్భుతైన మల్టీ పర్పస్ వెహికల్. దీని ధర, ఫీచర్లు, స్పెసిఫికేషన్లు తదితర వివరాలు తెలుసుకుందాం.

దేశీయ మార్కెట్లో ఈ కారు ఎక్స్-షోరూమ్ ధర రూ.6 లక్షల నుంచి రూ.8.97 లక్షల మధ్య ఉంది. మీరు ఇప్పుడు ఈ కారును కొనుగోలు చేస్తే దాదాపు రూ. 50 వేల తగ్గింపును కూడా పొందవచ్చు.ఇందులో 1-లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ కలదు. ఈ ఇంజన్ గరిష్టంగా 72PS పవర్, 96Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్‌తో 5-స్పీడ్ మ్యాన్యువల్, ఆటోమేటిక్ (AMT) ట్రాన్స్‌మిషన్ ఎంపికలు అందుబాటులో ఉన్నాయి. ఈ కారు లీటరుకు 18.2 నుంచి 20 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది.

కొత్త రెనాల్ట్ ట్రైబర్‌లో 8 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లే, 7 అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, వైర్‌లెస్ ఛార్జర్‌తో కూడిన పుష్ స్టార్ట్-స్టాప్ బటన్, ఎల్‌ఈడీ డీఆర్ఎల్‌తో ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు ఉన్నాయి. ఇది 182mm అధిక గ్రౌండ్ క్లియరెన్స్‌ను కలిగి ఉంది. దీన్ని అన్ని రకాల రోడ్లపై సులభంగా డ్రైవ్ చేయచ్చు. భద్రత కోసం 4 ఎయిర్‌బ్యాగ్‌లు, ABS (యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్), TPMS (టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్), TCS (ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్), రియర్ వ్యూ కెమెరా వంటి ఫీచర్లు అందించబడ్డాయి.

రెనాల్ట్ ట్రైబర్‌ ఎమ్‌విపి‌లో 6-7 మంది సౌకర్యవంతంగా కూర్చోగలరు. దాని రెండవ వరుస సీటులో 3 మంది ప్రయాణికులు కూర్చోవచ్చు. కూర్చోవడానికి కొంత ఇబ్బంది ఉన్నప్పటికీ ఈ బడ్జెట్ ప్రకారం సౌకర్యాలు చాలా బాగున్నాయి. ట్రైబర్ వాహనం ఐదు మోనోటోన్, ఐదు డ్యూయల్ టోన్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. ప్రస్తుతం మార్కెట్‌లో రూ.6 లక్షల ప్రారంభ బడ్జెట్‌తో ఎమ్‌పివి అందుబాటులో లేదు. అటువంటి పరిస్థితిలో తక్కువ బడ్జెట్ ఉన్నవారికి ట్రైబర్ ఒక గొప్ప ఎంపిక.