Site icon Prime9

2025 Auto Expo: సరికొత్త కార్లు వస్తున్నాయ్.. అన్నీ ఎలక్ట్రిక్ కార్లే.. రేంజ్ పీక్స్!

Auto Expo

Auto Expo

2025 Auto Expo: 2025 ఆటో ఎక్స్‌పో వచ్చే ఏడాది జనవరిలో జరగనుంది. ఈ ఎక్స్‌పోలో ఎప్పటిలాగానే ఈ సారి కూడా చాలా కొత్త ఉత్పత్తులను పరిచయం చేయనున్నారు. దేశంలోని అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజికి తన మొదటి ఎలక్ట్రిక్ కారును తీసుకురానుంది. అలానే హ్యుందాయ్ ఇండియా క్రెటా ఎలక్ట్రిక్ వేరియంట్ కూడా పరిచయం చేయనుంది.  మహీంద్రా BE.05ని తీసుకురానుంది. ఈ మూడు ఎలక్ట్రిక్ కార్ల గురించి వివరంగా తెలుసుకుందాం.

Maruti Suzuki eVX
మారుతి సుజుకి ఈ ఎలక్ట్రిక్ కారు మొదటి లుక్‌ను 2023 ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించింది. eVX 2025 మొదటి త్రైమాసికంలో మార్కెట్‌లోకి వస్తుందని భావిస్తున్నారు. తరువాత దాని టయోటా డెరివేటివ్ కూడా పరిచయం చేయనుంది. ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ 60 kWh బ్యాటరీ ప్యాక్‌తో వస్తుందని అంచనా. ఇది దాదాపు 550 కిమీల డ్రైవింగ్ రేంజ్ అందిస్తుంది.

Hyundai Creta EV
హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్ వెర్షన్ వచ్చే ఏడాది ఎప్పుడైనా ప్రారంభించవచ్చు. ప్రస్తుతం కంపెనీ దీనిని ఇండియన్ రోడ్‌లో పరీక్షిస్తోంది. ఇది IC-ఇంజిన్ క్రెటాతో దాని ప్లాట్‌ఫామ్‌ను పంచుకోవాలని భావిస్తున్నారు. అయితే దీనికి ఫ్యూచరిస్టిక్ డిజైన్, EV టచ్ ఉంటుంది.

ఇది రూ. 20 లక్షల కంటే తక్కువ ధరతో విడుదల కావచ్చు. దీని పవర్‌ట్రైన్‌ను కోనా EV నుండి తీసుకోవచ్చు. ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ అధునాతన ఫీచర్లు, అద్భుతమైన భద్రతతో కూడిన ఫ్రంట్-వీల్-డ్రైవ్ ఎలక్ట్రిక్ మోటారును పొందచ్చని భావిస్తున్నారు. దీని అంచనా డ్రైవ్ పరిధి 450-500 కి.మీ.

Mahindra BE.05
ప్రస్తుతం మహీంద్రా – మహీంద్రా XUV400 ద్వారా ఒక ఎలక్ట్రిక్ కారు మాత్రమే విక్రయిస్తోంది. దాని EV లైనప్‌ను విస్తరిస్తూ కంపెనీ త్వరలో BE.05ని పరిచయం చేస్తుంది.

ఇటీవల జరిగిన 2025 ఆటో ఎక్స్‌పోలో దీనిని పరిచయం చేయచ్చు. ప్రత్యేక EV ప్లాట్‌ఫామ్ ఆధారంగా ఈ EV 500 కిమీ కంటే ఎక్కువ రేంజ్ అందిస్తుంది. ఇది Valeo నుండి తీసుకున్న ఎలక్ట్రిక్ మోటారును పొందుతుంది. ఇది వెనుక చక్రాలకు పవర్ సప్లై చేస్తుంది.

Exit mobile version