Site icon Prime9

2025 Tata Tiago Launch: టాటా టియాగో.. 5 సంవత్సరాల తర్వాత అప్‌డేట్‌.. ఈసారి ఎలా ఉంటుందంటే..?

2025 Tata Tiago

2025 Tata Tiago

2025 Tata Tiago Launch: టాటా మోటర్స్ ఇప్పుడు హ్యాచ్‌బ్యాక్ కార్ సెగ్మెంట్‌లో తన స్థానాన్ని బలోపేతం చేసుకోవడానికి సిద్ధమవుతోంది. కంపెనీ తన పాపులర్ కార్ టియాగో ఫేస్‌లిఫ్ట్ మోడల్‌ను విడుదల చేయబోతోంది. ఈ కారు టెస్టింగ్ సమయంలో చాలా సార్లు కనిపించింది. సమాచారం ప్రకారం.. టాటా ఈసారి టియాగోలో చాలా పెద్ద మార్పులు చేయబోతోంది. జనవరిలో జరగనున్న ఇండియా మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025లో కొత్త మోడల్‌ను ప్రదర్శించనున్నారు. అయితే ఈ విషయంలో కంపెనీ నుంచి ఎలాంటి అధికారిక ధృవీకరణ లేదు. కానీ మూలం ప్రకారం టాటా కొత్త టియాగో డిజైన్‌లో పెద్ద మార్పులు చేయబోతోంది. ఈ కారు మారుతి స్విఫ్ట్‌తో నేరుగా పోటీపడనుంది.

టాటా టియాగో 5 సంవత్సరాల తర్వాత అప్‌డేట్‌ను పొందింది. అంతకుముందు జనవరి 2020లో కంపెనీ ఈ కారును అప్‌డేట్ చేసింది. ఈసారి కొత్త టియాగోలో చాలా కొత్త విషయాలు కనిపించనున్నాయి. డిజైన్ నుండి ఇంటీరియర్ వరకు అప్‌గ్రేడ్‌గా నిపిస్తాయి. కారు ముందు, వెనుక విభాగాలలో మార్పులు కనిపిస్తాయి. బంపర్, హెడ్‌ల్యాంప్స్, టెయిల్ ల్యాంప్‌లను రీడిజైన్ చేయనున్నారు.

2025 Tata Tiago Engine And Design
ఇంజన్ గురించి మాట్లాడితే కొత్త టియాగోలో 3 సిలిండర్లు, 1.2L పెట్రోల్ ఇంజన్ లభిస్తుంది, ఇది 5 స్పీడ్ మాన్యువల్, AMT గేర్‌బాక్స్‌తో లభిస్తుంది. ఇది కాకుండా ఈ కారు కూడా CNG లో తీసుకురాబడుతుంది. ఇంజన్ మళ్లీ అప్‌డేట్ అవుతుందని, తద్వారా మైలేజ్ , పనితీరు పెరుగుతుందని నమ్ముతారు. ఈసారి కొత్త టియాగో హ్యాచ్‌బ్యాక్ కార్ సెగ్మెంట్‌లో మునుపటి కంటే మెరుగ్గా నిలువగలదని అంచనా.

కొత్త టియాగో కొత్త స్విఫ్ట్‌తో నేరుగా పోటీపడనుంది. Z సిరీస్ పెట్రోల్ ఇంజన్ మారుతి స్విఫ్ట్‌లో అందుబాటులో ఉంటుంది, ఈ ఇంజన్ 82hp పవర్, 112 Nm టార్క్ అందిస్తుంది. ఇందులోఈ ఇంజన్ 5 స్పీడ్ మ్యాన్యువల్, 5 స్పీడ్ AMT గేర్‌బాక్స్‌తో లభిస్తుంది. మైలేజ్ మాన్యువల్ మోడ్‌లో 24.8kmpl, AMTలో 25.75 kmpl.

భద్రత కోసం కొత్త స్విఫ్ట్ అన్ని వేరియంట్లలో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, 3 పాయింట్ సీట్ బెల్ట్, హిల్ హోల్డ్ కంట్రోల్, ESC, EBDతో కూడిన యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ కారులో 7-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 60:40 స్ప్లిట్ సీట్లు, వెనుక AC వెంట్, వైర్‌లెస్ ఛార్జర్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, సుజుకి కనెక్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

Exit mobile version