Tata Curvv: భారతీయ కార్ మార్కెట్‌లో కంపాక్ట్ ఎస్‌యూవీలకు విపరీతమైన డిమాండ్ ఉంది. ఇది అధునాతన డిజైన్, ఫీచర్లు కలిగి ఉన్నందున పెద్ద సంఖ్యలో కస్టమర్లు కూడా కొనడానికి సిద్ధంగా ఉన్నారు. ముఖ్యంగా ఆగస్ట్‌లో అమ్మకానికి వచ్చిన టాటా కర్వ్ కూపే ఎస్‌యూవీ కాంపాక్ట్ ఎస్‌యూవీలకు గట్టి పోటీనిస్తుంది. అయితే తాజాగా సెప్టెంబర్ నెల కంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్ సేల్స్ వివరాలు బయటకువచ్చాయి. టాటా కర్వ్ కార్లు రికార్డు సంఖ్యలో అమ్ముడయ్యాయి. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
సెప్టెంబర్ నెలలో టాటా మొత్తం 4,763 యూనిట్ల కర్వ్ ఎస్‌యూవీలను విక్రయించింది. అదే ఆగస్టు నెలలో విక్రయించిన 3455 యూనిట్లతో పోలిస్తే నెలవారీ (MoM) వృద్ధి 37.85 శాతం. దీంతో కాంపాక్ట్ SUV విభాగంలో హోండా ఎలివేట్ 1960 యూనిట్లు, స్కోడా కుషాక్ 1767 యూనిట్లు, వోక్స్‌వ్యాగన్ టిగువాన్ 1611 యూనిట్లలను కర్వ్ అధిగమించింది.
అయితే హ్యుందాయ్ క్రెటా 15, 902 యూనిట్లు, మారుతి సుజుకి గ్రాండ్ విటారా 10,267 యూనిట్లు, కియా సెల్ట్ 6959 యూనిట్లు, టయోటా హైరైడర్ 5385 యూనిట్లు టాటా కర్వ్ ఎస్‌యూవీ కంటే చాలా ముందున్నాయి. కర్వ్ SUVలు ఈ అక్టోబర్‌లో కూడా పెద్ద సంఖ్యలో అమ్మకానికి రానున్నాయి.
ప్రస్తుతం టాటా కర్వ్ కూపే SUV దేశీయ విపణిలో పెట్రోల్,డీజిల్, ఎలక్ట్రిక్ పవర్డ్ వేరియంట్లలో అందుబాటులో ఉంది. కర్వ్ ఎలక్ట్రిక్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 17.49 లక్షల నుండి రూ. 21.99 లక్షల మధ్య ఉంది. 45 kWh, 55 kWh బ్యాటరీని కలిగి ఉంటుంది. ఇది ఫుల్ ఛార్జ్‌పై 430 నుండి 502 కిలోమీటర్ల రేంజ్ కవర్ చేస్తుంది.
ఈ టాటా కర్వ్ ఎలక్ట్రిక్ SUVలో 5 మంది సులభంగా ప్రయాణించచ్చు. దీనిలో డిజిటల్డ డ్రైవర్ డిస్‌ప్లే 10.25 అంగుళాలు, టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ 12.3 అంగుళాలు, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, పనోరమిక్ సన్‌రూఫ్ వంటి వివిధ ఫీచర్లు ఉన్నాయి. ఇందులో భద్రత కోసం అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్, 6 ఎయిర్‌బ్యాగ్‌లు ఉన్నాయి.
ఇంధనంతో నడిచే టాటా కర్వ్ ఎస్‌యూవీ విషయానికొస్తే దీని ధర రూ. 9.99 లక్షల నుంచి రూ. 17.69 లక్షల ఎక్స్-షోరూమ్. ఇది స్మార్ట్, క్రియేటివ్ ప్లస్ Sతో సహా అనేక వేరియంట్‌లను పొందింది. ఇందులో కూడా 5 మంది దూరపు పట్టణాలకు వెళ్లచ్చు. ట్రిప్ సమయంలో ఎక్కువ లగేజీని తీసుకువెళ్లడానికి 500 లీటర్ల బూట్ స్పేస్‌ను కూడా ఉంటుంది.
కొత్త టాటా కర్వ్‌లో 1.2 లీటర్ టర్బో పెట్రోల్, 1.2-లీటర్ జిడిఐ టర్బో పెట్రోల్, 1.5-లీటర్ డీజిల్ ఇంజన్ ఆప్షన్‌లు ఉన్నాయి. ఇది వేరియంట్‌ను బట్టి 6 స్పీడ్ మాన్యువల్ లేదా 7 స్పీడ్ DCT డ్యూయల్ క్లచ్ ట్రాన్స్‌మిషన్ గేర్‌బాక్స్‌ని పొందుతుంది. ఇది 17 kmpl వరకు మైలేజీని కూడా అందిస్తుంది.
ఈ ఇంధనంతో నడిచే టాటా కర్వ్ SUV టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 9 స్పీకర్ JBL సౌండ్ సిస్టమ్, 4 స్పోక్ మల్టీ-ఫంక్షన్ స్టీరింగ్ వీల్, డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లేతో సహా పలు ఫీచర్లతో వస్తుంది. ఇందులో ప్రయాణీకుల రక్షణ కోసం 6 ఎయిర్‌బ్యాగ్‌లు, 360 డిగ్రీ కెమెరాలు ఉన్నాయి.