Tata Sierra EV: రెనాల్ట్ డస్టర్ మరోసారి కొత్త అవతార్‌లో వస్తుంది. డస్టర్ దాని సెగ్మెంట్‌లో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎస్‌యూవీ. టాటా సియోర్రా టాప్ ఎస్‌యూవీలలో ఒకటిగా ఉంది. టాటా మోటర్స్ ప్రస్తుతం ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో ఆధిపత్యం చెలాయిస్తోంది. కంపెనీ తన అవసరాలను దృష్టిలో ఉంచుకొని మరోసారి సియెర్రా ఫేస్‌లిఫ్ట్‌ను తీసుకువస్తోంది. కానీ ఈసారి పెట్రోల్, ఎలక్ట్రిక్ వెర్షన్లలో విడుదల చేయనున్నారు. ఇది ఇటీవలె టెస్టింగ్ సమయంలో కనిపించింది. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
టాటా సియెర్రా ఎలక్ట్రిక్ మోడల్ మొదటగా లాంచ్ కానుంది. ఆ తర్వాత అది పెట్రోల్ ఇంజన్‌తో రోడ్లపైకి రానుంది. డీజిల్ ఇంజిన్‌లో కూడా కంపెనీ సియెర్రాను విడుదల చేస్తుందని నమ్ముతారు. సియెర్రా EV వచ్చే ఏడాది చివరి నాటికి పరిచయం చేస్తుంది. అయితే అంతకు ముందు దాని డిజైన్‌ను ఆటో ఎక్స్‌పో 2025లో ఆవిష్కరించే అవకాశం ఉంది.
సియెర్రా EV అనేది టాటా మోటార్స్ ప్రీమియం ఎలక్ట్రిక్ కారు. ఇది బెస్పోక్ EV ప్లాట్‌ఫామ్‌పై ఆధారపడి ఉంటుంది. అయితే టాటా సియెర్రా గత ఆటో ఎక్స్‌పోలో ప్రవేశపెట్టింది. దీనిలో LED లైట్ బార్‌తో పాటు ఫ్లష్ డోర్ హ్యాండిల్ కూడా కనిపించింది. అయితే సియర్రాను సైడ్ విండో డిజైన్‌తో తీసుకురావచ్చు. అయితే ఈసారి విడుదల చేయనున్న మోడల్ డిజైన్‌లో మార్పులు చోటు చేసుకోనున్నాయి.
టాటా కొత్త సియెర్రా 5-డోర్ బేస్డ్‌గా ఉంటుంది. దీని డిజైన్ బాక్సీ స్టైల్‌లో ఉంటుంది. అయితే దీనికి వెనుక వైపు నుండి కర్వీ లుక్ కూడా ఇచ్చారు. సైజు గురించి మాట్లాడితే సియెర్రా 4.3 మీటర్ల కంటే ఎక్కువగా ఉండబోతోంది. సియెర్రా కంపెనీ సఫారి, హారియర్ కంటే చిన్నది కావచ్చు. ఫీచర్ల గురించి మాట్లాడితే టాటా సియెర్రా లోపలి భాగం వెనుక సీటుతో లాంజ్‌గా ఉంటుంది. కొత్త-జనరేషన్ 12.3-అంగుళాల టచ్‌స్క్రీన్ సియెర్రాలో ఉంటాయి.
టాటా సియెర్రా EV ధర సుమారు రూ. 25 లక్షల నుండి ప్రారంభమవుతుంది. ఫీచర్ల గురించి మాట్లాడితే కొత్త టాటా సియెర్రా పనోరమిక్ సన్‌రూఫ్, హెడ్స్-అప్ డిస్‌ప్లే, ADAS, డ్యూయల్ పవర్డ్ ఫ్రంట్ సీట్, ప్యాసింజర్ సీట్, మినీ ఇన్ఫర్మేషన్ డిస్‌ప్లే, కూల్డ్ సీట్ వంటి ఫీచర్లను పొందవచ్చు. ఇది కాకుండా ఇది మంచి స్పేస్‌ను కూడా పొందుతుంది. ఈ వాహనంలో 55kWh బ్యాటరీ ప్యాక్‌ను చూడవచ్చు. ఫుల్ ఛార్జింగ్‌తో 550 కిలోమీటర్ల రేంజ్‌ను అందుకోవచ్చని భావిస్తున్నారు.