Site icon Prime9

2025 Tata Tiago: అమ్మబాబోయ్.. టాటా నుంచి బుడ్డి కార్.. ఫీచర్లు ఏమున్నాయబ్బా..!

2025 Tata Tiago

2025 Tata Tiago: టాటా మోటర్స్ భారతదేశంలో తన చిన్నకారు టియాగో ధరను ప్రకటించింది. కారు బుకింగ్స్ కూడా ప్రారంభమయ్యాయి. అయితే కొత్త టియాగో ఫీచర్ల గురించి ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. ఈ నెలలో ప్రారంభమయ్యే ఆటో ఎక్స్‌పో 2025లో ఈ కారు మిగిలిన వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. కొత్త టియాగో పెట్రోల్ సిఎన్‌జి, ఎలక్ట్రిక్ వేర్షన్స్‌లో రానుంది. ఈ కారు నేరుగా మారుతి సుజికి సెలెరియోతో నేరుగా పోటీపడుతుంది. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

కొత్త టియాగో డిజైన్‌లో టాటా మోటార్స్ చెప్పుకోదగ్గ మార్పులు ఏమీ చేయలేదు, అయితే కొంచెం కొత్తదనాన్ని ఇందులో చూడచ్చు. దీని ఫ్రంట్ గ్రిల్‌లో మార్పు ఉంది. బంపర్ డిజైన్‌లో కొత్తదనం ఉంది. కారులో అమర్చిన టైర్లు కొత్త డిజైన్‌లో ఉన్నాయి. ఈ కారు పరిమాణంలో ఎటువంటి మార్పు లేదు, దాని ఇంటీరియర్‌లో కూడా ఎటువంటి మార్పు లేదు, ఈ కారు పరిమాణం మునుపటిలాగే ఉంటుంది.

కొత్త ఫేస్‌లిఫ్ట్ టియాగో ఇంజన్‌లో ఎలాంటి మార్పులు చేయలేదు. ఈ కారు 5 స్పీడ్ మ్యాన్యువల్,  AMT గేర్‌బాక్స్‌తో లభించే పాత 3 సిలిండర్లు, 1.2L పెట్రోల్ ఇంజన్‌ను పొందుతుంది. జనవరిలో జరగనున్న ఇండియా మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025లో కొత్త మోడల్‌ను ప్రదర్శించనున్నారు.

కొత్త టియాగో 7.0-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను పొందుతుంది. ఇది ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లేకి సపోర్ట్ ఇస్తుంది. కారు చాలా మంచి సౌండ్ సిస్టమ్‌ను కలిగి ఉంది. ఇది కాకుండా ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లు, వెనుక పార్కింగ్ సెన్సార్, ఈబీడీ, ఎయిర్‌బ్యాగ్‌లతో కూడిన యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్‌ను కలిగి ఉంది. కొత్త మోడల్‌లో పెద్దగా కొత్తదనం లేదు. మీరు ఈ కారును కొత్త రంగుల్లో కూడా కొనుగోలు చేయవచ్చు.

టాటా మోటార్స్ కొత్త టియాగో నేరుగా మారుతి సెలెరియోతో పోటీపడనుంది. ఈ కారు ధర రూ.5.36 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ఇంజన్ గురించి మాట్లాడితే సెలెరియోలో 1.0 లీటర్ K10C పెట్రోల్ ఇంజన్ ఉంది, ఇది 65బిహెచ్‌పి పవర్, 89ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 5 స్పీడ్ మ్యాన్యువల్, ఏఎమ్‌టీ గేర్‌బాక్స్‌తో వస్తుంది. ఇది డ్యూయల్ VVT ఇంజిన్‌ను కలిగి ఉంది, ఇది తక్కువ ఇంధనాన్ని వినియోగిస్తుంది. మెరుగైన పనితీరుతో ఎక్కువ మైలేజీని ఇస్తుంది.

ఈ కారు ఒక లీటర్‌లో 26కిమీ మైలేజీని ఇస్తుంది, కారులో డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లు, EBD, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ (ESP), హార్ట్‌డ్ ప్లాట్‌ఫాం, బ్రేక్ అసిస్ట్, రివర్స్ పార్కింగ్ సెన్సార్, సెగ్మెంట్-ఫస్ట్ హిల్-హోల్డ్ అసిస్ట్ ఉన్నాయి. ఫీచర్లు ఉన్నాయి.

Exit mobile version