Tata Punch: టాటా మోటార్స్ ఒక ఫేమస్ ఆటోమొబైల్ కంపెనీ. టాటా దేశీయ మార్కెట్లో అనేక కార్లను విక్రయిస్తుంది. వాటిలో పంచ్ అనేది ఒక ప్రసిద్ధ మైక్రో ఎస్‌యూవీ. దీనిని వినియోగదారులు పెద్ద సంఖ్యలో కొనుగోలు చేస్తున్నారు. ప్రస్తుతం, ఇదే కారు ఉత్పత్తిలో టాటా కొత్త చరిత్రను లిఖించింది. రండి.. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
టాటా మోటార్స్ 5 లక్షల యూనిట్ల ‘పంచ్’ కార్లను ఉత్పత్తి చేయడం ద్వారా భారీ మైలురాయిని సాధించింది. ఇది పెట్రోల్, సీఎన్‌జీ, ఎలక్ట్రిక్ మోడళ్ల మొత్తం ఉత్పత్తిని కవర్ చేస్తుంది. ఇది టాటా పంచ్ ఎస్‌యూవీ ప్రజాదరణను కూడా హైలైట్ చేస్తుంది. గత సంవత్సరం, ‘టాటా పంచ్’ ఎస్‌యూవీ భారీ సంఖ్యలో అమ్మకాలు జరిపి బిగ్గెస్ట్ రికార్డును సృష్టించింది.
మొత్తం 2,02,030 యూనిట్ల పంచ్ ఎస్‌యూవీలు అమ్ముడయ్యాయి. దీనితో, ప్రతి సంవత్సరం అత్యధికంగా అమ్ముడైన కార్ల జాబితాలో 40 సంవత్సరాలుగా అగ్రస్థానంలో ఉన్న మారుతి సుజుకిని అధిగమించింది.ఈ కారు ధర రూ. 6.20 లక్షల నుండి రూ. 10.32 లక్షల ఎక్స్-షోరూమ్ మధ్య ఉంటుంది. ఇది ప్యూర్, అడ్వెంచర్, క్రియేటివ్ ప్లస్ వంటి విభిన్న వేరియంట్‌ల ఎంపికను కలిగి ఉంది.
ఇది బయట ఆకర్షణీయమైన డిజైన్‌ను కలిగి ఉంది, వివిధ రంగులలో లభిస్తుంది. ఈ టాటా పంచ్ కారు శక్తివంతమైన 1.2-లీటర్ 3-సిలిండర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్, సీఎన్‌జీ ఇంజిన్‌ను కలిగి ఉంది. దీనికి 5-స్పీడ్ మాన్యువల్ లేదా 5-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఎంపిక కూడా ఉంది. ఇది వేరియంట్‌ను బట్టి 18.8 నుండి 26.99 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుంది.
కొత్త టాటా పంచ్ SUVలో 5-సీట్ల ఎంపిక ఉంది, ఇది ప్రయాణీకులు సౌకర్యవంతంగా ప్రయాణించడానికి వీలు కల్పిస్తుంది. ఇది 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ ఛార్జర్, USB టైప్-C ఛార్జింగ్ పోర్ట్, స్టీరింగ్-మౌంటెడ్ కంట్రోల్స్, 4-స్పీకర్లు, సన్‌రూఫ్‌తో సహా డజన్ల కొద్దీ ఫీచర్లను ఆఫర్ చేస్తోంది.
అలానే 2-ఎయిర్‌బ్యాగ్‌లు,టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, ప్రయాణీకుల రక్షణ కోసం రివర్సింగ్ కెమెరాను కలిగి ఉంటుంది. టాటా పంచ్ ఈవీ ఎలక్ట్రిక్ వేరియంట్లో కూడా అందుబాటులో ఉంది. దీని ధర రూ. 9.99 లక్షల నుంచి రూ. 14.29 (ఎక్స్-షోరూమ్) ఉన్నాయి. దీనిలో స్మార్ట్, స్మార్ట్ ప్లస్, అడ్వెంచర్, ఎంపవర్డ్ అండ్ ఎంపవర్డ్ ప్లస్ అనే వేరియంట్లు ఉన్నాయి.
ఈ టాటా పంచ్ ఈవీ 25 కిలోవాట్ (kWh), 35 కిలోవాట్ (kWh) సామర్థ్యం గల బ్యాటరీ ప్యాక్‌ల ఎంపికతో వస్తుంది. ఇది పూర్తిగా ఛార్జ్ చేస్తే 265 నుండి 365 కిలోమీటర్ల రేంజ్ (మైలేజ్) అందిస్తుంది. దీనికి 5 సీట్లు కూడా ఉన్నాయి. ఈఎలక్ట్రిక్ కారు ‘ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ అండ్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్’ కోసం 10.25-అంగుళాల డ్యూయల్-స్క్రీన్ సెటప్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, ఎయిర్ ప్యూరిఫైయర్, 6-స్పీకర్ సౌండ్ సిస్టమ్, యాంబియంట్ వంటి వివిధ ఫీచర్లతో వస్తుంది. ఇందులో 6 ఎయిర్‌బ్యాగులు ఉన్నాయి.