Site icon Prime9

Tata Punch Camo Edition 2024: టాటా దసరా దావత్.. పంచ్ కామో ఎడిషన్ లాంచ్.. కెవ్ అనిపిస్తున్న ఫీచర్లు!

Tata Punch Camo Edition 2024

Tata Punch Camo Edition 2024

Tata Punch Camo Edition 2024: దేశీయ కార్ల తయారీ కంపెనీ టాటా మోటర్స్ పండుగ సీజన్ సందర్భంగా అత్యంత ప్రజాదరణ పొందిన మినీ ఎస్‌యూవీ టాటా పంచ్ స్పెషల్ ఎడిషన్ కామోను పరిచయం చేసింది. దీని ఎక్స్ షోరూమ్ ధర రూ. 8,44900. ఈ కారులో కొన్ని అదనపు ఫీచర్లను యాడ్ చేసింది. దీని కారణంగా టాటా అమ్మకాలు మరింత వేగవంతంగా పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. టాటా పంచ్ దాని సెగ్మెంట్‌లో అత్యధికంగా అమ్ముడైన, సురక్షితమైన కారు ఇదే. ఈ కారు సీఎన్‌జీ వేరియంట్‌లో కూడా అందుబాటులో ఉంది. ఈ కారు పూర్తి వివరాల్లోకి ఒకసారి వెళితే..!

ఈ కారులో 10.25 అంగుళాల ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లే వంటి ఫీచర్లు ఉంటాయని కంపెనీ తెలిపింది. ఇంటర్నెట్‌లోని సమాచారం ప్రకారం ఈ కారు మార్కెట్‌లోకి వచ్చినప్పటి నుంచి పంచ్ దాని అద్భుతమైన డిజైన్, పర్ఫామెన్స్, సెఫ్టీ పరంగా మంచి పేరును సంపాదించుకుంది. కస్టమర్ల నుంచి వస్తున్న భారీ డిమాండ్ గా టాటా ంచ్ లిమిటెడ్ కామో ఎడిషన్ తీసుకొచ్చింది. టాటా పంచ్ దేశంలో సురక్షితమైన సబ్ కాంపాక్ట్ స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్. ఇది గ్లోబల్ ఎన్‌కాప్ సేఫ్టీ స్టాండర్డ్స్‌లో 5 స్టార్ రేటింగ్‌ను సాధించింది.

టాటా పంచ్ కామో ఎడిషన్‌లో 1.2 లీటర్ రెవోట్రారన్ పెట్రోల్ ఇంజన్ ఉంది. ఈ ఇంజన్ సామర్థ్యం 1199 సీసీ, 3 సిలీండర్లను కలిగి ఉంటుంది. ఈ కారు ఇంజన్‌ పెట్రోల్‌పై గరిష్టంగా 87.8 పీఎస్ పవర్, 115 ఎన్‌ఎమ్ టార్క్ రిలీజ్ చేస్తుంది. సీఎన్‌జీలో దీని ఇంజన్ గరిష్టంగా 73.5 పీఎస్ పవర్, 103 ఎన్ఎమ్ టార్క్ విడుదల చేస్తుంది. ఇది 5 స్పీడ్ మాన్యువల్, 5 స్పీడ్ ఏఎమ్‌టీ , 5 స్పీడ్ మాన్యువల్ ఆధారంగా పని చేస్తుంది. టాటా మోటర్స్ కొత్త టాటా పంచ్ కమౌ ఎడిషన్‌పై 3 సంవత్సరాలు లేదా 1,00,0000 కిమీ వారంటీని అందిస్తోంది.

టాటా పంజ్ కామో ఎడిషన్ పొడవు 3827mm, వెడల్పు 1742mm, ఎత్తు 1615mm. కారు వీల్ బేస్ 2445ఎమ్ఎమ్ కాగా, గ్రౌండ్ క్లియరెన్స్ 187ఎమ్ఎమ్. బూట్ స్పేస్ 5-స్పీడ్ మ్యాన్యువల్/5-స్పీడ్ AMT వేరియంట్‌లో 366 లీటర్లు, 5-స్పీడ్ మ్యాన్యువల్ CNG వేరియంట్‌లో 319 లీటర్లు మరియు 5-స్పీడ్ మ్యాన్యువల్ CNG వేరియంట్‌లో 210 లీటర్లు. ఇది పెట్రోల్ కోసం 37 లీటర్ల సామర్థ్యాన్ని కలిగి ఉంది.

Exit mobile version