Site icon Prime9

Tata Harrier Discount: కొత్త కారు కొనాలంటే ఇదే ఛాన్స్.. టాటా హారియర్‌పై రూ.2.75 లక్షల డిస్కౌంట్..!

Tata Harrier

Tata Harrier

Tata Harrier Discount: ప్రస్తుతం ఆటోమొబైల్ కంపెనీలు మార్కెట్లో పాత స్టాక్ క్లియర్ చేసే పనిలో పడ్డాయి. ఇందులో భాగంగా భారీ డిస్కౌంట్లు, ఆఫర్లను అందిస్తున్నాయి. ఇప్పుడు కొనుగోలుదారులు నేరుగా ప్రయోజనం పొందుతారు. మీరు కూడా ఈ సమయంలో కొత్త ఎస్‌యూవీని మీ ఇంటికి తీసుకెళ్లాంటే ఈ ఆఫర్లు చాలా ఉపయోగంగా ఉంటాయి. ఈ నెలలో టాటా మోటర్స్ దాని అత్యంత ప్రజాదరణ పొందిన ఎస్‌యూవీ హారియర్‌పై చాలా మంచి ఆఫర్లను అందిస్తోంది. సమాచారం ప్రకారం కంపెనీ MY 2023 టాటా హారియర్‌‌పై వినియోగదారులకు డీలర్‌షిప్ ద్వారా గరిష్టంగా రూ. 2.75 లక్షల వరకు తగ్గింపును అందిస్తోంది. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

భద్రత పరంగా టాటా హారియర్ చాలా బాగుంటుంది. ఇందులో EBD, 6 ఎయిర్‌బ్యాగ్‌లు, బ్రేక్ అసిస్ట్, 3 పాయింట్ సీట్ బెల్ట్, యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్‌తో కూడిన డిస్క్ బ్రేక్‌లు ఉన్నాయి. క్రాష్ టెస్ట్‌లో 5 స్టార్ రేటింగ్ ఇచ్చింది. హారియర్ నాలుగు వేరియంట్లు, ఏడు కలర్ ఆప్షన్స్‌లో అందుబాటులో ఉంది. ఇది నమ్మదగిన SUV.  కానీ ఇప్పుడు వినియోగదారులు ఈ వాహనాన్ని అంతలా ఇష్టపడటం లేదు. దీని అమ్మకాలు నిరంతరం పడిపోతున్నాయి.

ఇంజన్ గురించి మాట్లాడితే టాటా హారియర్ 2.0-లీటర్ డీజిల్ ఇంజన్ కలిగి ఉంది. ఇది 170బీహెచ్‌పీ హార్స్ పవర్, 350ఎన్ఎమ్ పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 6-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లను అందించింది. మైలేజీ గురించి మాట్లాడితే హ్యారియర్ మ్యాన్యువల్ వేరియంట్‌లో లీటరుకు 16.80 కిమీ మైలేజీని ఇస్తుందని, ఆటోమేటిక్ వేరియంట్‌లో లీటరుకు 14.60 కిమీ మైలేజీని ఇస్తుందని పేర్కొంది.

టాటా హారియర్ టాప్ మోడల్ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 14.99 లక్షల నుండి రూ. 25.89 లక్షల వరకు ఉంటుంది. ఇందులో 12.3-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను కలిగి ఉంది. ఇది కాకుండా కారులో 10.25-అంగుళాల పూర్తి డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే ఉంది. ఇది కాకుండా 10-స్పీకర్ సౌండ్ సిస్టమ్, డ్యూయల్ జోన్ ఆటోమేటిక్ AC, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, పనోరమిక్ సన్‌రూఫ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇది కాకుండా స్టాండర్డ్ 6-ఎయిర్‌బ్యాగ్‌లు, 360-డిగ్రీ కెమెరా, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, అధునాతన డ్రైవర్ అసిస్ట్ సిస్టమ్ వంటి ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి. టాటా హారియర్ ఒక పవర్‌‌ఫుల్ ఎస్‌యూవీ. ఇది నేరుగా మహీంద్రా XUV 700తో పోటీపడుతుంది.

Exit mobile version