Tata Curvv CNG Launch: డీజిల్, పెట్రోల్‌కు బైబై.. టాటా కర్వ్ సిఎన్‌జి వచ్చేస్తోంది.. కొత్త ఏడాదిలో సరికొత్తగా..!

Tata Curvv CNG Launch: భారతదేశంలో CNG కార్లకు డిమాండ్ వేగంగా పెరుగుతుంది. ఈ సంవత్సరం కూడా అనేక కొత్త మోడల్స్ మార్కెట్లోకి వచ్చాయి. వీటిని కస్టమర్లు బాగా ఇష్డపడుతున్నారు. కొత్త సంవత్సరం కూడా ఇదే ఊపు కొనసాగనుంది. 2025లో చాలా కొత్త కార్లు లాంచ్ కానున్నాయి. వాటి సిఎన్‌జీలు ఉన్నాయి. టాటా మోటర్స్ తన సిఎన్‌జి పోర్ట్‌ఫోలియోను విస్తరించేందుకు సిద్ధమవుతోంది.

కొత్త ఏడాది కంపెనీ అనేక కొత్త మోడళ్లను ఆవిష్కరించబోతుంది. ఈసారి టాటా ఈ సంవత్సరం విడుదల చేసిన కూపే ఎస్‌యూవీ కర్వ్ సీఎన్‌జీ మోడల్‌ను తీసుకొస్తుంది. ప్రస్తుతం కర్వ్ పెట్రోల్, డీజిల్‌ వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. కర్వ్ సిఎన్‌జిని వచ్చే ఏడాది ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఇప్పటి వరకు కంపెనీ నుంచి ఎలాంటి సమాచారం రాలేదు.

టాటా Curvv CNGలో ఒక్కొక్కటి 30 లీటర్ల (60 లీటర్లు) రెండు CNG ట్యాంకులు కూడా ఉంటాయి. CNG ట్యాంక్ తర్వాత కూడా, దాని బూట్‌లో స్థలం కొరత ఉండదు. ట్విన్ సిఎన్‌జి సిలిండర్ టెక్నాలజీ ఉన్న ఇతర టాటా కార్లలో స్పేస్ సమస్య లేదు. విశేషమేమిటంటేటర్బో-పెట్రోల్ ఇంజన్‌తో CNG కిట్‌ను అందించిన భారతదేశపు మొట్టమొదటి CNG కారు ఇదే.

Tata Curvv CNG Price
టాటా Curvv CNG డిజైన్‌, ఇంటీరియర్‌లో ఎటువంటి మార్పు ఉండదు. భద్రత కోసం ఈ కారు అగ్రస్థానంలో ఉంది. టాటా కర్వ్ సిఎన్‌జిని ఈ సంవత్సరం చివరి నాటికి లేదా వచ్చే ఏడాది ఆటో ఎక్స్‌పోలో భారతదేశంలో ప్రవేశపెట్టవచ్చు. ఎక్కువ మైలేజీని ఆశించే వారు కర్వ్ సిఎన్‌జి కోసం వేచి ఉండాలి. దీని ధర దాదాపు రూ.10 లక్షలు ఉండవచ్చు.

Tata Curvv CNG Specifications
టాటా Curvv CNG 1.2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ కలిగి ఉంది, ఇది దాదాపు 99 బిహెచ్‌పి, 170 ఎన్ఎమ్ టార్క్ ఇస్తుంది. కానీ CNG కిట్‌తో పవర్, టార్క్ అవుట్‌పుట్‌లో కొన్ని మార్పులు చేయచ్చు. ఇదే ఇంజన్ Nexon CNGలో కూడా ఉంటుంది. టాటా కర్వ్ సిఎన్‌జిలో భద్రతా ఫీచర్ల కొరత ఉండదు. క్రాష్ టెస్ట్ లో ఈ కారు ఇప్పటికే 5 స్టార్ రేటింగ్ పొందింది. కర్వ్‌లో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, EPS, బ్రేక్ అసిస్ట్, 3 పాయింట్ సీట్ బెల్ట్, డిస్క్ బ్రేక్‌లు ఉంటాయి.

కస్టమర్ల సౌలభ్యం కోసం టాటా కర్వ్‌లో 12.3-అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ అందించారు. సంగీత ప్రియుల కోసం ఈ కారులో 9 స్పీకర్లు, JBL వాయిస్ అసిస్ట్ సిస్టమ్ ఉంది. ఈ కారులో 10.25 అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే ఉంటుంది. ఇది హై క్లాస్ ఇంటీరియర్ లుక్ ఇస్తుంది. టాటా నెక్సాన్ సిఎన్‌జి ధర రూ. 8.99 లక్షల నుండి ప్రారంభమవుతుంది.