Tata Altroz: మారుతి సుజుకి బాలెనో, హ్యుందాయ్ ఐ 20 లకు పోటీగా టాటా మోటార్స్ భారతదేశంలో ఆల్ట్రోజ్‌ను లాంచ్ చేసింది. అయితే క్రమంగా దాని అమ్మకాలు తగ్గడం ప్రారంభించాయి. కంపెనీ తన వంతు ప్రయత్నం చేసినప్పటికీ అమ్మకాల్లో ఊపును పొందలేకపోయింది. డిస్కౌంట్ తర్వాత కూడా షోరూమ్‌కు కస్టమర్లను ఆకర్షించడంలో సక్సెస్ కాలేదు. ఆల్ట్రోజ్ ధర రూ. 6.65 లక్షల నుండి ప్రారంభమవుతుంది. అక్టోబర్ నెలలో టాటా ఆల్ట్రోజ్ అమ్మకాల ఫలితాలు వచ్చాయి. కంపెనీ ఎన్ని వాహనాలను విక్రయించిందో ఇప్పుడు తెలుసుకుందాం.
టాటా ఆల్ట్రోజ్ గురించి మాట్లాడితే ఈ కారు గత నెలలో కేవలం 2642 యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయి. అయితే గత సంవత్సరం అక్టోబర్‌లో కంపెనీ 5984 యూనిట్లను విక్రయించింది. ఈసారి అమ్మకాలు 56 శాతం క్షీణించాయి. గత ఒక సంవత్సరంతో పోలిస్తే దీని అమ్మకాలు సగానికి పైగా పడిపోయాయి. అయితే ఈ వాహనం విక్రయాలలో నిరంతర తగ్గుదల కనిపిస్తుంది. అయితే దీనిలో చాలా బ్లైండ్ స్పాట్‌లు ఉన్నాయి. దీని కారణంగా డ్రైవింగ్ చేసేటప్పుడు కాస్తా ఇబ్బందిగా ఉంటుంది.
ఆల్ట్రోజ్ పెట్రోల్, డీజిల్ ఇంజన్ ఆప్షన్‌లలో వస్తుంది. ఇందులో 1.2 లీటర్ పెట్రోల్, 1.2 లీటర్ టర్బో పెట్రోల్, 1.5 లీటర్ డీజిల్ ఇంజన్ ఆప్షన్‌లు ఉన్నాయి. ఈ ఇంజన్ 5 స్పీడ్ మాన్యువల్, 6 స్పీడ్ డ్యూయల్ క్లచ్ ఆటో (DCA) ట్రాన్స్‌మిషన్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. ఇది కాకుండా ఈ కారు CNGలో కూడా అందుబాటులో ఉంది. ఈ కారు ఒక లీటర్‌లో 18 నుండి 25 కిమీ/లీటరు కలిపి మైలేజీని ఇస్తుంది.
కస్టమర్లను ఆకర్షించడానికి ఈ కారు రేసర్ ఎడిషన్ కూడా మార్కెట్లో విడుదల చేసింది. ఇందులో 1.2 లీటర్ రెవోట్రాన్ టర్బోచార్జ్డ్ ఇంజన్ 120 హార్స్ పవర్, 170 పీక్ టార్క్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 6 స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో ఉంటుంది. ఇందులో 16 అంగుళాల టైర్లు ఉన్నాయి.
ఫీచర్‌గా ఈ కారులో 7-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంది. దీని సౌండ్ చాలా లౌడ్‌గా ఉంటుంది. ఇది కాకుండా క్రూయిజ్ కంట్రోల్, సెమీ-డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, యాంబియంట్ లైటింగ్, కనెక్టెడ్ కార్ టెక్ వంటి ఫీచర్లు ఇందులో అందుబాటులో ఉన్నాయి.
భద్రత కోసంఈ కారులో డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లు, చైల్డ్ సీట్ యాంకర్, ఆటో పార్క్ లాక్, వెనుక పార్కింగ్ సెన్సార్ వంటి భద్రతా ఫీచర్లు ఉన్నాయి. ఆల్ట్రోజ్ ఎక్స్-షో రూమ్ ధరలు రూ. 6.65 లక్షల నుండి ప్రారంభమవుతాయి.