Site icon Prime9

5 Star Rating Tata Cars 2024: అది మరి టాటా అంటే.. సేఫ్టీకి కేరాఫ్ అడ్రస్‌గా ఈ ఐదు కార్లు.. క్రాష్ టెస్ట్‌లో 5 స్టార్లు..!

5 Star Rating Tata Cars 2024

5 Star Rating Tata Cars 2024

5 Star Rating Tata Cars 2024: ప్రస్తుత కాలంలో కారు కొనుగోలు చేసేటప్పుడు భారతీయ కస్టమర్లలో భద్రత ముఖ్యమైన ఆంశంగా మారింది. మనం భద్రతా కోణం నుంచి చూస్తే టాటా మోటర్స్ కార్లు ఎల్లప్పుడూ ఆధిపత్యం చెలాయిస్తాయి. 2024లో ఇండియా NCAP క్రాష్ టెస్ట్‌లో పాల్గొన్న టాటా 5 ఎస్‌యూవీల గురించి వివరంగా తెలుసుకుందాం.

Tata Curvv
టాటా మోటార్స్ భారత మార్కెట్‌లో కొత్త క్రాసోవర్ ఎస్‌యూవీ కర్వ్‌ను విడుదల చేసింది. టాటా కర్వ్ లాంచ్ అయినప్పటి నుండి కస్టమర్ల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఇండియా NCAP నిర్వహించిన క్రాష్ టెస్ట్‌లో టాటా కర్వ్ పూర్తి 5-స్టార్ రేటింగ్‌ను పొందింది. భారత్ ఎన్‌సిఎపి క్రాష్ టెస్ట్‌లో టాటా కర్వ్ పెద్దల భద్రత కోసం 32 పాయింట్లకు 29.50 పాయింట్లు పొందగా, పిల్లల భద్రత కోసం 49 పాయింట్లకు 43.66 పాయింట్లు వచ్చాయి.

Tata Curvv EV
ఎలక్ట్రిక్ కార్లకు ప్రసిద్ధి చెందిన టాటా మోటార్స్ 2024లో భారతీయ మార్కెట్‌లో అత్యంత ఆసక్తితో ఎదురుచూస్తున్న కర్వ్ ఈవీని విడుదల చేసింది. ఇండియా NCAP క్రాష్ టెస్ట్‌లో టాటా కర్వ్ EV కూడా పూర్తి 5-స్టార్ రేటింగ్‌ను పొందింది. టాటా కర్వ్ EV పెద్దల భద్రత కోసం 32 పాయింట్లకు 30.81 పాయింట్లను స్కోర్ చేయగా, పిల్లల భద్రత కోసం 49 పాయింట్లకు 44.83 పాయింట్లను సాధించింది.

Tata Nexon
టాటా నెక్సాన్ భారతీయ మార్కెట్లో అత్యధికంగా అమ్ముడవుతున్న SUVలలో ఒకటి. ఇండియా NCAP నిర్వహించిన క్రాష్ టెస్ట్‌లో టాటా నెక్సన్ పూర్తి 5-స్టార్ రేటింగ్‌ను కూడా పొందింది. టాటా నెక్సాన్ పిల్లల భద్రత కోసం 49 పాయింట్లకు 43.83 పాయింట్లు సాధించగా, పెద్దల భద్రత కోసం 32కి 29.41 పాయింట్లు స్కోర్ చేసింది.

Tata Nexon EV
టాటా నెక్సాన్ ఈవీ ఇండియా NCAPలో కుటుంబ భద్రత కోసం జరిగిన క్రాష్ టెస్ట్‌లో పూర్తి 5-స్టార్ రేటింగ్ దక్కించుకుంది. టాటా నెక్సాన్ పెద్దల భద్రత కోసం 32 పాయింట్లకు 29.86 పాయింట్లు సాధించగా, పిల్లల భద్రత కోసం 49 పాయింట్లకు 44.95 పాయింట్లు స్కోర్ చేసింది.

Tata Punch EV
టాటా మోటార్స్ 2024 సంవత్సరంలో టాటా పంచ్ EVని భారత మార్కెట్లో విడుదల చేయనుంది. ఇండియా NCAP నిర్వహించిన క్రాష్ టెస్ట్‌లో టాటా పంచ్ EV పూర్తి 5-స్టార్ రేటింగ్‌ను కూడా పొందింది. క్రాష్ టెస్ట్‌లో టాటా పంచ్ EV పెద్దల భద్రత కోసం 32 పాయింట్లకు 31.46, పిల్లల భద్రత కోసం 49 పాయింట్లకు 45 స్కోర్ చేసింది.

Exit mobile version
Skip to toolbar