Site icon Prime9

Maruti Swift Discount: మారుతి కారుపై క్రేజీ ఆఫర్.. స్విఫ్గ్ అన్ని వేరియంట్లపై ఊహించని డిస్కౌంట్లు..!

Maruti Swift Discount

Maruti Swift Discount

Maruti Swift Discount: పండుగ సీజన్ ముగిసింది. అయితే కార్లపై డిస్కౌంట్లు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. ఇది మాత్రమే కాదు, కొన్ని కార్ కంపెనీలు ఇప్పుడు మునుపటి కంటే ఎక్కువ తగ్గింపులను అందిస్తున్నాయి. పెద్ద విషయమేమిటంటే. కార్ల కంపెనీలు తమ పాత స్టాక్‌ను క్లియర్ చేసే పనిలో నిమగ్నమై ఉన్నాయి. కంపెనీలు కూడా ఏడాది ముగిసేలోపు తమ లక్ష్యాలను పూర్తి చేయాల్సి ఉంటుంది. కార్ల కంపెనీలు తమ అమ్మకాలను ఎలాగైనా పెంచుకోవడానికి ప్రయత్నించడానికి ఇదే కారణం.

Maruti Suzuki Swift
స్విఫ్ట్ పెట్రోల్-ఆటోమేటిక్ (ZXI, ZXI ప్లస్)పై రూ. 84,000 పూర్తి తగ్గింపు అందిస్తుంది. ఇందులో నగదు తగ్గింపు రూ.50,000. అయితే అదనపు తగ్గింపు రూ.19,000. అలాగే రూ. 15,000 ఎక్స్చేంజ్ బోనస్ కూడా ఉంది. ఇది కాకుండా స్విఫ్ట్ పెట్రోల్-ఆటోమేటిక్ (VXI, VXI (O) పై రూ. 59,000 తగ్గింపు ఇస్తుంది.

ఇది కాకుండా స్విఫ్ట్ పెట్రోల్-మాన్యువల్ (ZXI, ZXI ప్లస్)పై రూ. 79,000 తగ్గింపు అందుబాటులో ఉంది. స్విఫ్ట్ పెట్రోల్-మాన్యువల్ (VXI , VXI (O) రూ. 54,000 తగ్గింపును పొందుతుండగా, స్విఫ్ట్ పెట్రోల్-మాన్యువల్ (LXI) రూ. 44,000 తగ్గింపు లభిస్తుంది.

Z సిరీస్ పెట్రోల్ ఇంజన్ మారుతి స్విఫ్ట్‌లో అందుబాటులో ఉంటుంది. ఈ ఇంజన్ 82 హెచ్‌పీ పవర్,  112 ఎన్ఎమ్ పీక్ టార్క్ అందిస్తుంది. ఇందులో ఈ ఇంజన్ 5 స్పీడ్ మ్యాన్యువల్, 5 స్పీడ్ AMT గేర్‌బాక్స్‌తో లభిస్తుంది. కొత్త Z సిరీస్ ప్రతి వాతావరణంలోనూ మెరుగ్గా పనిచేస్తుందని కంపెనీ పేర్కొంది. మైలేజీ గురించి చెప్పాలంటే మాన్యువల్ మోడ్‌లో మైలేజ్ 24.8, AMTలో 25.75 kmpl.

భద్రత పరంగా కొత్త స్విఫ్ట్ అన్ని వేరియంట్లలో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, 3 పాయింట్ సీట్ బెల్ట్, హిల్ హోల్డ్ కంట్రోల్, ESC, EBDతో కూడిన యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ కారులో 7-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 60:40 స్ప్లిట్ సీట్లు, వెనుక AC వెంట్, వైర్‌లెస్ ఛార్జర్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, సుజుకి కనెక్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

మారుతి స్విఫ్ట్‌కి నిజమైన పోటీ Grand i10 Niosతో ఉంది. ప్రస్తుతం మీరు ఈ కారుపై రూ. 58,000 వరకు ఆదా చేయవచ్చు. ఈ ఆఫర్ నవంబర్ వరకు మాత్రమే వర్తిస్తుంది. ఈ కారు 1.2 లీటర్ ఇంజన్ పొందుతుంది. ఇది దాని సెగ్మెంట్లో అత్యంత సౌకర్యవంతమైన కారు కూడా. ఈ కారు సిటీ, హైవేలో చాలా మంచి పర్ఫామెన్స్ ఇస్తుంది. ఇది గుంతల రోడ్లను సులభంగా దాటుతుంది.

Exit mobile version