Site icon Prime9

Hyundai Offers: కార్ లవర్స్‌కు అదిరిపోయే శుభవార్త.. అల్కాజర్‌ ఎస్‌యూవీపై భారీ డిస్కౌంట్..!

Hyundai Offers

Hyundai Offers

Hyundai Offers: కొత్త కారు కొనాలనుకొనే వారికి అదిరిపోయే శుభవార్త ఉంది. కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ తన ప్రసిద్ధ SUV అల్కాజర్‌పై నవంబర్ నెలలో బంపర్ డిస్కౌంట్లను అందిస్తోంది.  మీరు నవంబర్ నెలలో ప్రీ-ఫేస్‌లిఫ్ట్ హ్యుందాయ్ అల్కాజర్‌ను కొనుగోలు చేస్తే గరిష్టంగా రూ. 85,000 ఆదా చేయచ్చు. ఇటీవల కంపెనీ హ్యుందాయ్ అల్కాజార్  అప్‌డేటెడ్ వెర్షన్‌ను కూడా విడుదల చేసింది. దీనికి కస్టమర్ల నుండి గొప్ప స్పందన లభిస్తోంది. తగ్గింపు గురించి మరిన్ని వివరాల కోసం కస్టమర్‌లు తమ సమీప డీలర్‌షిప్‌ను సంప్రదించవచ్చు. హ్యుందాయ్ అల్కాజార్ ఫీచర్లు, పవర్‌ట్రెయిన్, ధర గురించి వివరంగా తెలుసుకుందాం.

హ్యుందాయ్ అల్కాజర్‌ పవర్‌ట్రెయిన్ గురించి మాట్లాడినట్లయితేకస్టమర్‌లు 1.5-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్‌ను పొందుతారు. ఇది గరిష్టంగా 160 బీహెచ్‌పీ హర్స్ పవర్, 253ఎన్ఎమ్ పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. ఇది కాకుండా కారులో 1.5-లీటర్ డీజిల్ ఇంజన్ కూడా ఉంది. కారు ఇంజిన్‌లో కస్టమర్‌లు మాన్యువల్, ఆటోమేటిక్ గేర్‌బాక్స్ రెండింటి ఎంపికను పొందుతారు.

ప్రస్తుతం హ్యుందాయ్ అల్కాజార్ 8 వేరియంట్లలో వినియోగదారులకు అందుబాటులో ఉంది. ఇది కాకుండా వినియోగదారులు హ్యుందాయ్ అల్కాజార్‌లో 3 డ్రైవ్ మోడ్‌లు ఉన్నాయి. త్వరలో హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‌లిఫ్ట్‌ను భారత మార్కెట్లో విడుదల చేయడానికి కంపెనీ సన్నాహాలు చేస్తోంది.

హ్యుందాయ్ అల్కాజార్ లోపలి భాగంలో కస్టమర్‌లు 10.25-అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆటో క్లైమేట్ కంట్రోల్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్, క్రూయిజ్ కంట్రోల్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇది కాకుండా కారులో వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, వాయిస్ కంట్రోల్డ్ పనోరమిక్ సన్‌రూఫ్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.

మరోవైపు భద్రత కోసం కారులో 6-ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, వెనుక పార్కింగ్ కెమెరా వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. హ్యుందాయ్ అల్కాజర్ మార్కెట్లో మహీంద్రా XUV700, టాటా సఫారీలకు పోటీగా ఉంది. హ్యుందాయ్ అల్కాజార్ ఎక్స్-షోరూమ్ ధర భారతదేశంలో రూ. 14.99 లక్షల నుండి మొదలవుతుంది. టాప్ మోడల్‌కు రూ. 21.55 లక్షల వరకు ఉంటుంది.

Exit mobile version