Site icon Prime9

Skoda Kylaq: స్కోడా కైలాక్‌కి క్రేజీ డిమాండ్.. 10 రోజుల్లో 10000 బుకింగ్స్.. ప్రొడక్షన్ డబుల్ చేసిన కంపెనీ..!

Skoda Kylaq

Skoda Kylaq

Skoda Kylaq: స్కోడా కొత్త కైలాక్ ఎస్‌యూవీకి భారత మార్కెట్లో విశేష స్పందన లభిస్తుంది. కంపెనీ ఫోర్ట్‌ఫోలియోలో సబ్ 4 మీటర్ల సెగ్మెంట్‌లో అత్యంత సరసమైన ఎస్‌యూవీలలో ఇది కూడా ఒకటి. దాని స్టార్టింగ్ ప్రైస్ రూ.7.89 లక్షలు మాత్రమే. కైలాక్ ధర రూ.7.89 లక్షలు ఉండటానికి కారణం దాని లోకల్ ప్లాట్‌ఫామ్. దీనికి ఇప్పటికీ 10 వేలకు పైగా బుకింగ్స్ వచ్చినట్లు కంపెనీ తెలిపింది. వెయిటింగ్ పీరియడ్ కూడా ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలోనే కస్టమర్లకు త్వరగా డెలివరీ అందించడానికి కైలాక్ ఉత్పత్తిని 30 శాతం పెంచుతుంది. కంపెనీ తన చకన్ ప్లాంట్‌లో కైలాక్ సిరీస్ ఉత్పత్తిని ప్రారంభించింది.

స్కోడా కైలాక్‌ను MQB A0 IN ప్లాట్‌ఫామ్‌లో అభివృద్ధి చేసింది. కంపెనీ ఈ ప్లాట్‌ఫామ్‌లో వోక్స్‌వ్యాగన్ టైగన్, వర్టస్‌తో పాటు కుషాక్, స్లావియాలను కూడా తయారు చేస్తుంది. అదనంగా స్కోడా కాంపోనెంట్‌ల వేగవంతమైన కలెక్షన్ కోసం దాని సప్లయర్స్ వద్ద 10 శాతం ఎక్కువ సామర్థ్యాన్ని కూడా జోడించినట్లు ప్రకటించింది. కైలాక్‌కు అనుగుణంగా, స్కోడా చకన్ ప్లాంట్‌లో ఉత్పత్తి సామర్థ్యాన్ని 30 శాతం పెంచింది. స్కోడా ఇండియా డిమాండ్‌ను బట్టి సంవత్సరానికి 50,000 నుండి 70,000 యూనిట్ల కైలాక్‌లను ఉత్పత్తి చేయాలని యోచిస్తోంది. అంటే కంపెనీ ప్రతి నెలా 4,000 నుంచి 5,800 యూనిట్లను విక్రయిస్తుంది.

ఈ కైలాక్ ఎస్‌యూవీ‌లో సింగిల్ 1.0-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్‌ ఉంది. ఇది 115హెచ్‌పి పవర్ ఉత్పత్తి చేస్తుంది. దీనిలో 6-స్పీడ్ మాన్యువల్‌ గేర్‌బాక్స్ ఉంది. కైలాక్ కేవలం 10.5 సెకన్లలో 0 నుండి 100 హెచ్‌పి పవర్‌ని రిలీజ్ చేస్తుంది. ఈ వెహికల్ పొడవు 3,995 మిమీ, వెడల్పు 1,975 మిమీ, ఎత్తు 1,575 మిమీ. దీని వీల్ బేస్ 2,566 మిమీ. దీని గ్రౌండ్ క్లియరెన్స్ 189 మిమీ. ఈ ఎస్‌యూవీలో 446 లీటర్ల క్లాస్-లీడింగ్ బూట్ స్పేస్‌ ఉంది. వెనుక సీట్లను మడతపెట్టడం ద్వారా దీనిని 1,265 లీటర్లకు పెంచుకోవచ్చు.

Skoda Kylaq Specifications
ఇందులో 16-అంగుళాల స్టీల్ వీల్స్, 6 ఎయిర్‌బ్యాగ్‌లు, సెంట్రల్ లాకింగ్, మాన్యువల్ డే/నైట్ IRVM, ISOFIX యాంకర్లు, ప్రయాణీకులందరికీ మూడు-పాయింట్ సీట్ బెల్ట్‌లు, అడ్జస్ట్ చేయగల హెడ్‌రెస్ట్‌లు, ట్రాక్షన్ కంట్రోల్, ఆటో ఇంజిన్ స్టార్ట్-స్టాప్, పవర్ విండోస్ ఉన్నాయి. మాన్యువల్ AC, వెనుక AC వెంట్, డిజిటల్ MIDతో అనలాగ్ డయల్, ఫ్రంట్ సెంటర్ ఆర్మ్ రెస్ట్, 12V ఛార్జింగ్ సాకెట్, టిల్ట్ స్టీరింగ్ అడ్జస్ట్, పవర్డ్ వింగ్ అద్దాలు, ఫాబ్రిక్ సీటు, 4 స్పీకర్లు ఉన్నాయి.

స్కోడా కైలాక్ సిగ్నేచర్ ట్రిమ్‌లో 16-అంగుళాల అల్లాయ్ వీల్స్, టైర్ ప్రెజర్ మానిటర్, వెనుక డీఫాగర్, డాష్‌పై డ్యూయల్-టోన్ ఫినిషింగ్, డోర్ ప్యానెల్లు, సీట్ ఫాబ్రిక్, 5-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్, స్టీరింగ్-మౌంటెడ్ కంట్రోల్స్, AC వెంట్స్, డోర్ హ్యాండిల్స్‌పై క్రోమ్ వంటి క్లాసిక్ ఫీచర్‌లతో వస్తుంది. గార్నిష్, USB టైప్-సి స్లాట్ (ముందు), వెనుక పార్శిల్ షెల్ఫ్, 2 ట్వీటర్‌లు ఉన్నాయి.

స్కోడా కైలాక్ సిగ్నేచర్+ ట్రిమ్‌లో 6MT, 6AT గేర్‌బాక్స్ ఎంపికలు, వెనుక సెంటర్ ఆర్మ్ రెస్ట్, 10-అంగుళాల టచ్‌స్క్రీన్, ఆటో AC, డిజిటల్ డయల్స్, పవర్ ఫోల్డింగ్ వింగ్ మిర్రర్స్, లెదర్-ర్యాప్డ్ స్టీరింగ్‌తో క్రోమ్ గార్నిష్, క్రూయిజ్ కంట్రోల్, డాష్ ఇన్సర్ట్‌లు, ప్యాడిల్స్‌తో సహా అన్ని సిగ్నేచర్ ఫీచర్లను కలిగి ఉంది. షిఫ్టర్‌లు కూడా ఉన్నారు.

చివరగా స్కోడా కైలాక్ ప్రెస్టీజ్ ట్రిమ్ విషయానికి వస్తే ఇందులో 17-అంగుళాల అల్లాయ్ వీల్స్, వెనుక వైపర్, ఆటో-డిమ్మింగ్ IRVM, పవర్డ్ సన్‌రూఫ్, వెంటిలేటెడ్ సీట్లు, లెదర్ అప్హోల్స్టరీ, పవర్డ్ ఫ్రంట్ సీట్లతో సహా అన్ని సిగ్నేచర్+ ఫీచర్లతో వస్తుంది. ఇది మారుతి బ్రెజ్జా, టాటా నెక్సాన్, హ్యుందాయ్ వెన్యూ, మహీంద్రా XUV 3XO, కియా సోనెట్ వంటి మోడళ్లతో పోటీపడనుంది.

Exit mobile version