18.25 Lakh Discount: స్కోడా ఇండియా ఏప్రిల్ 2023లో 3వ తరం సూపర్బ్‌ను భారతదేశంలో ప్రవేశపెట్టింది. ఇదొక గొప్ప లగ్జరీ పెద్ద సైజు సెడాన్ కారు. సూపర్బ్ కారు ఏప్రిల్ 2024లో కంప్లీట్ బిల్డ్ యూనిట్‌గా దేశానికి వచ్చింది. సూపర్బ్ ధర రూ.54 లక్షలుగా ఉంది. దిగుమతి చేసుకున్న సూపర్బ్‌లో 100 యూనిట్లు మాత్రమే సేల్‌కి అందుబాటులో ఉంటాయని స్కోడా ప్రకటించింది. ఇంటర్నెట్‌లోని సమాచారం ప్రకారం.. డీలర్‌షిప్‌లు ఇన్వెంటరీని క్లియర్ చేయడానికి స్కోడా సూపర్బ్‌పై రూ. 18 లక్షల వరకు తగ్గింపును అందిస్తున్నాయి. ఈ కారును కొనుగోలు చేసేందుకు ఇదో గొప్ప అవకాశం. ఈ నేపధ్యంలో దీని పూర్తి వివరాలపై ఓ లుక్కేయండి.
18.25 Lakh Discount
స్కోడా సూపర్బ్ ఎక్స్-షో రూమ్ ధర రూ. 55 లక్షలు. దీని ఆన్-రోడ్ ధర రూ. 57.23 లక్షల వరకు ఈ కారుపై రూ. 18.25 లక్షల తగ్గింపును అందిస్తోంది. ఆ తర్వాత దీని ధర రూ. 38.78 లక్షలకు చేరుకుంది.
2024 Skoda Superb Features
ఫీచర్ల గురించి మాట్లాడితే సూపర్బ్‌లో అడాప్టివ్ LED హెడ్‌ల్యాంప్‌లు, 9 ఎయిర్‌బ్యాగ్‌లు, 360-డిగ్రీ కెమెరా, ADAS సూట్, ఎలక్ట్రానిక్ డిఫరెన్షియల్ లాక్ (EDS), పనోరమిక్ సన్‌రూఫ్, 18-అంగుళాల వీల్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి. స్కోడా విలాసవంతమైన కారు అయినప్పటికీ రూ.18 లక్షల డిస్కౌంట్ తర్వాత కూడా దీనిని కొనుగోలు చేయడం సరైన నిర్ణయం కాదు. దీని బ్రాండ్ ఇమేజ్ కొనుగోలు చేసేంత బలంగా లేదు. మీరు ఇతర ఎంపికలను చూడటం మంచిది.
Mahindra XUV400 Discount
ఈ నెలలో మహీంద్రా XUV400ని కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నట్లయితే.. మీరు ఈ వాహనంపై రూ. 3.1 లక్షల వరకు తగ్గింపును పొందచ్చు. XUV400 టాప్-స్పెక్ EL ప్రో వేరియంట్‌పై మాత్రమే ఈ తగ్గింపు ఇస్తున్నారు. ఇందులో 39.4kWh , 34.5kWh బ్యాటరీ ప్యాక్ ఉంది. XUV400 రోజువారీ వినియోగానికి మంచి ఎంపిక. ఇది కాకుండా మీరు XUV700లో రూ. 40,000 వరకు ఆదా చేయచ్చు. భారతదేశంలో మహీంద్రా XUV400 ఎక్స్-షోరూమ్ ధర రూ. 16.74 లక్షల నుండి రూ. 17.69 లక్షల వరకు ఉంది.
Maruti Suzuki Jimny
మారుతి సుజుకి జిమ్నీపై చాలా మంచి తగ్గింపులు అందుబాటులో ఉన్నాయి. ఈ నెలలో జిమ్నీపై రూ.2.30 లక్షల వరకు తగ్గింపు లభిస్తుంది. ఈ తగ్గింపు చాలా కాలంగా కొనసాగుతోంది. పండుగ సీజన్‌లో కూడా ఇదే విధమైన తగ్గింపు అందించారు. అయితే ఈ డీల్ వినియోగదారులను ఆకర్షించడంలో ప్రభావవంతంగా ఉంది. మారుతి జిమ్నీ ఎక్స్-షోరూమ్ ధర రూ. 12.74 లక్షల నుండి రూ. 15.05 లక్షల వరకు ఉంది.
జిమ్నీలో 1.5 లీటర్ K సిరీస్ పెట్రోల్ ఇంజన్ ఉంది. ఇది ఒక లీటర్‌లో 16.94 కిలోమీటర్ల వరకు మైలేజీని అందిస్తుందని కంపెనీ పేర్కొంది. ఇది 4 వీల్ డ్రైవ్‌తో వస్తుంది. ఈ వాహనం అధిక ధర కారణంగా దీని అమ్మకాలు చాలా తక్కువగా ఉన్నాయి.