Royal Enfield Upcoming Bikes: 2024 రాయల్ ఎన్‌ఫీల్డ్‌కి బాగా కలిసొచ్చింది. ఇప్పుడు కంపెనీ 2025 కోసం సన్నాహాలు ప్రారంభించింది. కొత్త సంవత్సరంలో కంపెనీ తన 5 కొత్త బైక్‌లను తీసుకురానుంది. నివేదికల ప్రకారం కంపెనీ హిమాలయన్ 450 ర్యాలీ, స్క్రామ్ 440, బుల్లెట్ 650 ట్విన్, కాంటినెంటల్ జిటి 750, క్లాసిక్ 650లను పరిచయం చేయగలదు. దీనికి సంబంధించి లేలిన్ కంపెనీ నుంచి ఇంకా ఎలాంటి సమాచారం అందలేదు. మీరు రాబోయే రోజుల్లో కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌ను కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నట్లయితే ఈ జాబితాపై ఓ లుక్కేయండి.
Bullet 650 Twin
రాయల్ ఎన్‌ఫీల్డ్ కొత్త సంవత్సరంలో కొత్త బుల్లెట్ 650 ట్విన్‌ను పరిచయం చేయగలదు. ఈ బైక్ టెస్టింగ్ సమయంలో చాలా సార్లు కనిపించింది. బుల్లెట్ 650 డిజైన్ కూడా బుల్లెట్ 350 తరహాలోనే ఉండబోతోంది. ఇది క్లాసిక్ 650 వలె అదే భాగాలు, పవర్‌ట్రెయిన్‌లను కలిగి ఉంటుంది. ఇది భారీ బైక్ అవుతుంది. హై పెర్ఫామెన్స్ బైక్ కోసం చూస్తున్న వ్యక్తులు ఈ బైక్‌ను ఇష్టపడవచ్చు.
Classic 650
రాయల్ ఎన్‌ఫీల్డ్ తన కొత్త క్లాసిక్ 650ని కూడా 2025 సంవత్సరంలోనే మార్కెట్లోకి విడుదల చేయగలదు. రిపోర్ట్స్ ప్రకారం.. ఈ బైక్ వచ్చే నెలలో లాంచ్ అవుతుంది. ఇంజన్ గురించి మాట్లాడితే బైక్‌కు 648సీసీ ప్యారలల్ ట్విన్ ఇంజన్ అందించనున్నారు. ఇది గరిష్టంగా 46.3బిహెచ్‌పి పవర్, 52.3ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేయగలదు. ఈ బైక్ డిజైన్ క్లాసిక్ 350ని పోలి ఉంటుంది.
Scram 650
రాయల్ ఎన్ఫీల్డ్ ఇటీవల Scram 440ని ప్రదర్శించింది, ఈ బైక్ 443cc సింగిల్-సిలిండర్ ఇంజిన్‌ను కలిగి ఉంది, ఇది గరిష్టంగా 25.4bhp శక్తిని మరియు 34Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. వచ్చే ఏడాది బైక్ ధర మరియు లాంచ్ వెల్లడి కావచ్చు.
Continental GT 750
రాయల్ ఎన్‌ఫీల్డ్ మరో కొత్త బైక్ కాంటినెంటల్ జిటి 750ని వచ్చే ఏడాది మార్కెట్లోకి విడుదల చేయనుంది. ఈ బైక్ టెస్టింగ్ సమయంలో చాలా సార్లు కనిపించింది. ఈ బైక్‌లో చాలా మంచి సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి. దీని ముందు భాగంలో డ్యూయల్ డిస్క్ బ్రేక్ సెటప్ ఉంటుంది. అల్లాయ్ వీల్స్, ట్యూబ్ లెస్ టైర్లను కూడా ఇందులో చూడచ్చు. రేసింగ్ అంటే ఇష్టపడే వారికి ఈ బైక్ పర్ఫెక్ట్.
Himalayan 450 Rally
రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ 450 ర్యాలీ వేరియంట్‌ను వచ్చే ఏడాది విడుదల చేయనుంది. ఈ బైక్ డిజైన్‌లో కొంత కొత్తదనం కనిపిస్తుంది. కొత్త ఎగ్జాస్ట్ ఎండ్-క్యాన్‌లు, కొన్ని అప్‌డేట్ చేసిన బాడీవర్క్ ఉన్నాయి. పూర్తిగా అడ్జస్ట్ చేయగల ఫ్రంట్, రియర్ సస్పెన్షన్ వంటి ఫంక్షనల్ అప్‌గ్రేడ్‌లను ఈ బైక్‌లో చూడచ్చు.