EICMA 2024 Royal Enfield Classic 650: EICMA 2024 షో ఇటలీలోని మిలన్‌లో జరుగుతోంది. కంపెనీ కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ కొత్త క్లాసిక్ 650ని పరిచయం చేసింది. లుక్స్ పరంగా ఈ బైక్ ప్రస్తుతం ఉన్న క్లాసిక్ 350ని పోలి ఉంటుంది. ఈ కొత్త బైక్‌లో ఎన్నో అద్భుతమైన ఫీచర్లు ఉంటాయి. ఈ బైక్ కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. ఇది నాలుగు విభిన్న డ్యూయల్-టోన్ పెయింట్ స్కీమ్‌లలో వస్తుంది. బైక్ ఫీచర్లు, దాని ధర గురించి వివరంగా తెలుసుకుందాం.
రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 650 ట్విన్‌ను ఆవిష్కరించారు. యునైటెడ్ కింగ్‌డమ్, యూరప్‌లో కూడా బుకింగ్ ప్రారంభించారు. అయితే దీని డెలివరీ జనవరి 2025లో జరుగుతుంది. భారతదేశంలో ఈ బైక్ బుకింగ్, టెస్ట్ రైడ్ జనవరి 2025 నుండి ప్రారంభమవుతుంది. ఈ బైక్ 4 రంగులలో లభిస్తుంది – టీల్, వల్లమ్ రెడ్, బ్రంటింగ్‌థార్ప్ బ్లూ, బ్లాక్ క్రోమ్. ఈ బైక్ అతిపెద్ద ఫీచర్ దాని శక్తివంతమైన ఇంజిన్.
కొత్త క్లాసిక్ 650 ట్విన్ డిజైన్ క్లాసిక్ 350 మాదిరిగానే ఉంటుంది. ఈ బైక్ రెట్రో డిజైన్‌ను కలిగి ఉంది. హెడ్‌ల్యాంప్ ఎల్‌ఈడీ యూనిట్‌గా ఉంటుంది. ఈ బైక్ సింగిల్ సీటుతో పాటు పిలియన్ సీట్ ఆప్షన్‌తో వస్తుంది. ఇది మాత్రమే కాకుండా బైక్‌కు ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌తో పాటు ట్రిప్పర్ నావిగేషన్ సిస్టమ్ కూడా అందించారు. దీని ముందు వైపున టెలిస్కోపిక్ ఫోర్కులు, వెనుక వైపున ట్విన్ షాక్ అబ్జార్బర్‌లు ఉంటాయి.
రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 650 ట్విన్‌కి శక్తినివ్వడానికి దీనిలో 648 సీసీ సమాంతర-ట్విన్ ఇంజిన్ ఉంటుంది. ఇది 47 హార్స్ బీహెచ్‌పీ పవర్, 52.3ఎన్ఎమ్ టార్క్‌ను రిలీజ్ చేస్తుంది. ఇది స్లిప్-అండ్-అసిస్ట్ క్లచ్‌తో కూడిన 6-స్పీడ్ గేర్‌బాక్స్‌ను కలిగి ఉంది. కంపెనీకి చెందిన ఇతర బైక్‌లలో కూడా ఇదే ఇంజన్ కనిపిస్తుంది. ఈ బైక్ బరువు 243 కిలోలు. దీని బరువు చాలా ఎక్కువనే చెప్పాలి.
ఈ బైక్‌లో 14.8-లీటర్ల పెద్ద ఇంధన ట్యాంక్ ఉంది, ఈ ట్యాంక్ నిండిన తర్వాత బైక్ బరువు మరింత పెరుగుతుంది. ఈ బైక్ ఎత్తు 800ఎమ్ఎమ్, గ్రౌండ్ క్లియరెన్స్ 154ఎమ్ఎమ్. కంపెనీ దీనిని వచ్చే ఏడాది ఫిబ్రవరి 2025లో విడుదల చేసే అవకాశం ఉంది. బైక్ అంచనా ధర సుమారు రూ. 3.5 లక్షలు (ఎక్స్-షోరూమ్) ఉండవచ్చు. మరి ఈ బైక్‌కి భారత్‌లో ఎలాంటి స్పందన లభిస్తుందో చూడాలి.