Site icon Prime9

Royal Enfield Bear 650: రాయల్‌గా ఎంట్రీ.. రాయల్ ఎన్ఫీల్డ్ కొత్త బైక్ వచ్చేస్తుంది.. చూడటానికి రెండు కళ్లు సరిపోవు భయ్యా!

Royal Enfield Bear 650

Royal Enfield Bear 650

Royal Enfield Bear 650: రాయల్ ఎన్ఫీల్డ్ భారతదేశంలో ప్రముఖ ప్రీమియం మోటర్ సైకిల్ బ్రాండ్. దేశీయ మార్కెట్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైకులకు డిమాండ్ క్రేజీగా ఉంది. రాయల్ ఎన్ఫీల్డ్ ఎట్టకేలకు తన కొత్త బేర్ 650 బైకును 2024 ముందు ఆవిష్కరించింది. ఇంటర్ సెప్టర్ 650,  కాంటినెంటల్ జిటి 650, సూపర్ మెటోర్ 60 తర్వాత కొత్త బేర్ మోడల్ 650 ట్విన్ ప్లాట్‌ఫామ్‌ ఆధారిత ఐదవ 650 సిసి బైక్.

ఇంటర్‌సెప్టర్ 650 ఆధారంగా బేర్ 650 స్క్రాంబ్లర్-ఆధారిత డిజైన్‌‌కి కలిగి ఉంటుంది. ఇది కొత్త ఫీచర్లు, ప్రీమియం మెకానికల్ యూనిట్‌లతో వస్తుంది. నవంబర్ 5న జరగబోయే EICMA 2024లో రాయల్ ఎన్ఫీల్డ్ బేర్ 650 బైక్ ధరను ప్రకటించనుంది. ఇప్పుడు కొత్త బైక్ డబుల్ డౌన్‌ట్యూబ్ ఛాసిస్‌పై ఆధారపడి ఉంటుంది. దీనిలో కొన్ని అప్‌గ్రేడ్‌లు జరిగాయి.

రాయల్ ఎన్‌ఫీల్డ్ బేర్ 650 బైక్ డిజైన్ గురించి మాట్లాడితే బేర్ 650 బైక్  సిల్హౌట్ ఇంటర్‌సెప్టర్ 650 మాదిరిగానే ఉంటుంది. అయితే స్క్రాంబ్లర్ లాగా అప్‌డేట్ చేశారు. అదే డబుల్ డౌన్‌ట్యూబ్ ఛాసిస్ ఆధారంగా USDలు సరిపోయేలా బలోపేతం అవుతుంది. దీనిలో ఇకపై సబ్‌ఫ్రేమ్ ఉండదు.

ఈ కొత్త రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ ఫ్యూయల్ ట్యాంక్ ఇంటర్‌సెప్టర్ 650ని పోలి ఉంటుంది. కానీ ఆకర్షణీయమైన, ఆహ్లాదకరమైన కలర్ ఆప్షన్‌లో కనిపిస్తుంది. బేర్ 650 బైక్ LED లైటింగ్‌తో స్టాండర్డ్‌గా వస్తుంది. బైక్‌కు అడ్వెంచర్ లుక్ ఇస్తుంది. ఈ రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ మరింత సస్పెన్షన్ కోసం పొడవైన స్వింగ్‌ఆర్మ్‌ను కలిగి ఉంది. దీని ఫలితంగా దాదాపు 61 మిమీ ఎక్కువ వీల్‌బేస్ ఉంటుంది.

ఈ రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ ఇంటర్‌సెప్టర్ కంటే 10 మిమీ ఎక్కువ గ్రౌండ్ క్లియరెన్స్ 184 మిమీ కలిగి ఉంది. స్క్రాంబ్లర్-స్టైలింగ్ బైక్‌లో వెనుకవైపు కొంచెం స్కూప్-అప్ సీటు, టూ-ఇన్-వన్ ఎగ్జాస్ట్, సైడ్ ప్యానెల్‌లో నంబర్ బోర్డులు, వెడల్పాటి వన్-పీస్ హ్యాండిల్ బార్ మరియు రౌండ్ టెయిల్ ల్యాంప్ ఉన్నాయి.

కొత్త రాయల్ ఎన్ఫీల్డ్ బైక్  సస్పెన్షన్ సెటప్ గురించి మాట్లాడితే బైక్ ముందు భాగంలో యూఎస్‌డి ఫోర్క్ సెటప్, వెనుక భాగంలో ట్విన్ షాక్‌లు ఉన్నాయి. బైక్ మరింత కఠినమైన రూపాన్ని ఇచ్చేందుకు ఎమ్ఆర్ఎఫ్‌చే అభివృద్ధి చేసిన డ్యూయల్-పర్పస్ టైర్లు ఇచ్చారు.

బ్రేకింగ్ సిస్టమ్ గురించి మాట్లాడితే ఈ బైక్‌లో ముందువైపు 320 మిమీ డిస్క్ బ్రేక్, వెనుక వైపున 270 ఎమ్ఎమ్ డిస్క్ బ్రేక్ ఉన్నాయి. దీనిలో అదనపు భద్రత కోసం డ్యూయల్-ఛానల్ ఎబీఎస్‌తో కూడా వస్తుంది. బేర్ 650 ఇంటర్‌సెప్టర్ 650 కంటే 2 కిలోల తేలికైనది. ఇది 830 మిమీ అధిక సీటు ఎత్తును ఆఫర్ చేస్తుంది.

Exit mobile version