Renault Duster Dacia Bigster: రెనాల్ట్ బడ్జెట్ ఎస్‌యూవీ లాంచ్.. రేంజ్, ఫీచర్లు అసలు ఊహించలేదు!

Renault Duster Dacia Bigster: రెనాల్ట్ తన బడ్జెట్ ఎస్‌యూవీ Dacia ను గ్లోబల్ మార్కెట్‌లో ఆవిష్కరించింది. ఈ కొత్త బిగ్‌స్టర్ ఎస్‌యూవీని ప్యారిస్ మోటార్ షోలో బ్రాండ్ తొలిసారిగా ఆవిష్కరించింది. ఈ కొత్త SUV రెనాల్ట్ డస్టర్ ఆధారంగా డిజైన్ చేశారు. అయితే ఇది దాని పెద్ద (బిగ్‌స్టర్ 7-సీటర్) వేరియంట్. బిగ్‌స్టర్ రెనాల్ట్ వేరియంట్ భవిష్యత్తులో భారతీయ మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. ఈ కొత్త 7-సీటర్ డస్టర్ SUV మార్కెట్లో చాలా కార్లను పోటీగా నిలవనుంది. ఎందుకంటే దాని అవుట్ లుక్, ఇంటీరియర్ డిజైన్ చాలా అందంగా ఉన్నాయి. దీని గ్లోబల్ మోడల్ వివరాలను తెలుసుకుందాం.

డాసియా బిగ్‌స్టర్‌ను మూడు పవర్‌ట్రెయిన్ ఎంపికలతో అందిస్తుంది. ఇది హైబ్రిడ్ పెట్రోల్, బలమైన హైబ్రిడ్ పెట్రోల్, LPG ఆప్షన్ కలిగి ఉంది. మైల్డ్-హైబ్రిడ్ బిగ్‌స్టర్‌లో 1.2-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ అమర్చారు. ఇది 140 హార్స్‌పవర్‌ల అందిస్తుంది. 48V సిస్టమ్‌ను కలిగి ఉంది. ఈ పవర్‌ట్రెయిన్ 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో జత చేశారు. ఇది ముందు చక్రాలకు పవర్ అందిస్తుంది.

ఇది కాకుండా ఆప్షనల్ ఆల్-వీల్-డ్రైవ్ సిస్టమ్ అందటులో ఉంది. ఇదులో స్నో, మడ్/సాండ్, ఆఫ్-రోడ్, నార్మల్, ఎకో, హిల్ డిసెంట్ కంట్రోల్ వంటి వివిధ డ్రైవింగ్ మోడ్‌లు ఉన్నాయి.మరొక ఇంజన్‌ 1.2-లీటర్ టర్బో-పెట్రోల్ వేరియంట్, ఇది తేలికపాటి-హైబ్రిడ్. ఇది LPG, పెట్రోల్ రెండింటిపై నడుస్తుంది. 140 హార్స్‌పవర్‌లను రిలీజ్ చేస్తుంది. డాసియా ప్రకారం.. LPG 50-లీటర్ పెట్రోల్ ట్యాంక్, 49 లీటర్ LPG ఒక రీఫ్యూయలింగ్ మధ్య 1,450 కిలోమీటర్ల రేంజ్ ఆఫర్ చేస్తుంది.

హైబ్రిడ్ కాన్ఫిగరేషన్‌లోని నాలుగు-సిలిండర్ పెట్రోల్ ఇంజన్ రెండు ఎలక్ట్రిక్ మోటార్‌లతో కలిపి 107-హార్స్‌పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇందులో 1.4kWh బ్యాటరీ ప్యాక్ ఉంది. దీని మొత్తం పవర్ అవుట్‌పుట్ 155 హార్స్‌పవర్‌లకు చేరుకుంటుంది. పెట్రోల్ ఇంజన్ కోసం 4-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్, ఎలక్ట్రిక్ మోటారుకు 2-స్పీడ్ ట్రాన్స్‌మిషన్ ద్వారా ఈ పవర్ ఫ్రంట్ వీల్స్‌కు అందుతుంది. డిజైన్ పరంగా 2021లో వచ్చిన కాన్సెప్ట్‌లో చాలా డిజైన్ ఎలిమెంట్‌లను డాసియాలో ఉంటాయి. ఇది హెడ్‌ల్యాంప్స్‌తో పాటు టెయిల్ ల్యాంప్స్, క్యాబిన్‌లపై Y యాక్సెంట్‌లను కలిగి ఉంది.