Site icon Prime9

Renault Dacia: రెనాల్ట్ డస్టర్ మళ్లీ వచ్చేస్తోంది.. ఈసారి ఫీచర్లు, లుక్ అదిరిపోయాయ్!

Renault Dacia

Renault Dacia

Renault Dacia: రెనాల్ట్ డస్టర్ ఎస్‌యూవీకి మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. ఇది రెనాల్ట్ బెస్ట్ సెల్లింగ్ SUVగా మారింది. కానీ, రెనాల్ట్ కొన్నేళ్ల క్రితం దీన్ని నిలిపివేసింది. ఇప్పుడు మరోసారి రెనాల్ట్ డస్టర్ ప్రియులకు ఒక గొప్ప వార్త వచ్చింది. ఎందుకంటే అతి త్వరలో రెనాల్ట్ డస్టర్ SUV కొత్త వేరియంట్ మార్కెట్లోకి రానుంది. కొత్త జెన్ రెనాల్ట్ డస్టర్ 3-లైన్ SUV కావచ్చు. రెనాల్ట్ డస్టర్ SUV భారతదేశంలో బిగ్ డాసియా SUVగా విడుదల చేయవచ్చు. ఇది ఇటీవల పారిస్ మోటార్ షో ముందు కనిపించింది.

సమాచారం ప్రకారం Dacia Bigster SUV ప్రొడక్షన్ వేరియంట్ మొదటి ఓవర్ వ్యూ 2024 పారిస్ మోటార్ షోలో అధికారికంగా అరంగేట్రం చేయడానికి ముందు వెల్లడైంది. ఇది డస్టర్ 3 లైన్ వేరియంట్. రెనాల్ట్, నిస్సాన్ రెండూ SUVలు 2025లో విడుదల చేసే అవకాశం ఉంది. రెనాల్ట్ డస్టర్ తరహాలో ఇంజన్, గేర్‌బాక్స్ ఇందులో చూడవచ్చు.

ఈ పెద్ద SUVకి భిన్నమైన ఫ్రంట్ ఫాసియా ఉంటుంది. కంపెనీ ఇందులో అల్లాయ్ వీల్స్ అందించవచ్చు. మూడవ వరుసలో కంఫర్ట్ అందించడానికి ఈ SUVని కొంచెం పొడవుగా చేయవచ్చు. ఇది డస్టర్ పవర్‌ట్రెన్, ఫీచ్ లిస్ట్, ఇంటీరియర్ లేఅవుట్‌ని ఉపయోగించాలని భావిస్తున్నారు. రెనాల్ట్ దీనిని 6 సీటర్, 7 సీటర్ లేఅవుట్‌లలో అందించవచ్చు.

ఈ కారును సి సెగ్మెంట్‌లోకి తీసుకురావడంలో రెనాల్ట్ నిస్సాన్ పెద్ద పాత్ర పోషిస్తాయి. దాని విభాగంలో ఈ SUV హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, హోండా ఎలివేట్, మారుతి గ్రాండ్ విటారా, టయోటా హైరైడర్, వోక్స్‌వ్యాగన్ టైగన్, స్కోడా కుషాక్ వంటి SUVలతో పోటీపడుతుంది. అక్టోబర్ 4, 2024 న, నిస్సాన్ తన అద్భుతమైన SUV మాగ్నైట్ ఫేస్‌లిఫ్ట్ మోడల్‌ను విడుదల చేసింది. కంపెనీ పాత మోడల్ ధరలోనే దీన్ని లాంచ్ చేసింది. దీని ప్రారంభ ధర రూ.5.99 లక్షలు.

Exit mobile version