Site icon Prime9

Quantum Energy Discounts: క్వాంటమ్ ఎనర్జీ అదిరిపోయే ఆఫర్లు.. అన్నీ ఈవీలపై రూ.30 వేల డిస్కౌంట్!

Quantum Energy Discounts

Quantum Energy Discounts

Quantum Energy Discounts: భారతదేశంలో ప్రముఖ ఎలక్ట్రిక్ స్కూటర్ కంపెనీలలో ఒకటైన క్వాంటమ్ ఎనర్జీ తన ప్రసిద్ద స్కూటర్లపై లిమిటెడ్ దీపావళి ఆఫర్లను ప్రకటించింది.  పండుగల సీజన్‌లో పర్యావరణ అనుకూల వాహనాలను కొనుగోలు చేసే భారతీయ వినియోగదారులకు ఎలక్ట్రిక్ వాహనాలను మరింత సరసమైన ధరగా మార్చేందుకు ఈ ప్రత్యేక ఆఫర్‌ను ప్రవేశపెట్టారు. పండుగ ఆఫర్ అక్టోబర్ 18 నుండి అక్టోబర్ 31, 2024 వరకు ఉంటుంది. ఈ ఆఫర్లు అన్ని క్వాంటమ్ ఎనర్జీ షోరూమ్‌లలో అందుబాటులో ఉంటాయని కంపెనీ తెలిపింది.

క్వాంటమ్ ఎనర్జీ వెబ్‌సైట్ ద్వారా కస్టమర్‌లు ఆన్‌లైన్‌లో టెస్ట్ రైడ్‌ని షెడ్యూల్ చేయవచ్చు. భారతదేశంలోని ఏదైనా షోరూమ్‌ని సందర్శించవచ్చు. ప్రతి క్వాంటం ఎనర్జీ షోరూమ్‌లో సమగ్రమైన 3ఎస్ సదుపాయం, సేల్స్, సర్వీస్, స్పేర్ పార్ట్స్ సపోర్టును అందిస్తూ అసాధారణమైన కస్టమర్ అనుభవాన్ని అందజేస్తుందని క్వాంటమ్ ఎనర్జీ తెలిపింది.

కంపెనీ మొత్తం మూడు స్కూటర్లపై తగ్గింపును అందిస్తోంది. ప్లాస్మా ఎక్స్ స్కూటర్ అసలు ధర రూ. 1,29,150. ఇప్పుడు రూ. 99,999 ఆఫర్ ధరతో కొనుగోలు చేయవచ్చు. అదేవిధంగా ప్లాస్మా XR బేస్ ధర రూ.1,09,999. ఆఫర్ ధర రూ.89,095 వద్ద కొనుగోలు చేయవచ్చు. మిలన్ స్కూటర్ బేస్ ధర రూ.85,999. ఆఫర్ ధర రూ.79,999 వద్ద కొనుగోలు చేయవచ్చు.

ప్రస్తుతం విక్రయిస్తున్న అన్ని మోడల్‌లు లేటెస్ట్ టెక్నాలజీ, అసాధారణమైన పనితీరు, సామర్థ్యాన్ని అందిస్తాయి. ప్లాస్మా X స్కూటర్ శక్తివంతమైన 1500W మోటార్ ద్వారా 65 km/h గరిష్ట వేగాన్ని అందుకోగలదు. ఈ స్కూటర్ ఒక్కసారి ఛార్జింగ్ పెడితే 120 కి.మీల వరకు ప్రయాణించవచ్చు.

ప్లాస్మా XR స్కూటర్ కూడా ప్లాస్మా X మాదిరిగానే అదే శక్తివంతమైన 1500W మోటారును కలిగి ఉంది. గరిష్టంగా 60 kmph వేగాన్ని అందుకోగలదు. అలాగే ఇది ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 100 కిమీ. మిలన్ స్కూటర్ 1000W మోటార్‌తో వస్తుంది. దీని గరిష్ట వేగం గంటకు 60 కిమీ, ఛార్జ్‌పై 100 కిమీ వరకు నడపగలదు.

క్వాంటమ్ ఎనర్జీ లిమిటెడ్ డైరెక్టర్ చేతన చుక్కపల్లి మాట్లాడుతూ.. దీపావళి పండుగ జరుపుకునే సమయం, క్వాంటమ్ ఎనర్జీలో మేము మా వినియోగదారులకు ఈ ఫీచర్లతో ఎలక్ట్రిక్ వాహనాలకు మారే అవకాశాన్ని అందించడానికి సంతోషిస్తున్నాము. మా ఎలక్ట్రిక్ స్కూటర్లు పనితీరు, విశ్వసనీయత అందించడానికి రూపొందించబడ్డాయి.

ఈ పండుగ ఆఫర్లు పచ్చని భవిష్యత్తును స్వీకరించడానికి మరింత మందిని ప్రోత్సహిస్తాయని మేము ఆశిస్తున్నాము. ఈ ప్రయాణంలో మాకు మద్దతు ఇస్తున్న విలువైన ఉద్యోగులు, విశ్వసనీయ వర్కర్లకు, నమ్మకమైన రైడర్‌లకు ధన్యవాదాలు. భారతీయులందరూ ఈ ఆఫర్లను వినియోగించుకోవాలని డైరెక్టర్ చేతన చుక్కపల్లి తెలిపారు.

Exit mobile version