Site icon Prime9

Auto Expo 2025 Porsche: భారల్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో.. పోర్స్చే నుంచి క్రేజీ కార్లు.. ధరలు కోట్లలోనే..!

Auto Expo 2025 Porsche

Auto Expo 2025 Porsche: భారల్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025 జనవరి 17 నుంచి 22 వరకు న్యూఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో జరుగుతుంది. ఈ ఆటో ఎక్స్‌పోలో అనేక కార్ల తయారీ కంపెనీలు తమ కొత్త మోడల్స్‌లో కొన్నింటిని ప్రదర్శించనున్నాయి. ఈ జాబితాలో పోర్స్చే కూడా ఉంది. కంపెనీలు తమ ప్రసిద్ధ మోడళ్లలో కొన్నింటిని ప్రదర్శిస్తారు. పోర్స్చే ఆటో ఎక్స్‌పో 2025లో ఎటువంటి కార్లను ప్రదర్శిస్తుందో తెలుసుకుందాం.

Porsche 911 Facelift
ఈ ఆటో ఎక్స్‌పో 2025లో ఆటోమేకర్ పోర్స్చే 911 ఫేస్‌లిఫ్ట్‌ను ప్రదర్శించనుంది. ఇది భారతదేశంలో మల్టీ పవర్‌ట్రెయిన్‌లతో రానుంది. హైబ్రిడ్ సిస్టమ్‌తో కలిపి 541 పిఎస్ పవర్ రిలీజ్ చేస్తుంది. ఇది  కొత్త 3.6-లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్ కలిగి ఉండటం దీని అతిపెద్ద విషయం. దీనితో పాటు, ఇది 12.6 అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, 10.9 అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్, యాంబియంట్ లైటింగ్ వంటి ఫీచర్లతో వస్తుంది.

 Porsche Macan EV
పోర్షే మకాన్ EV ఆటో ఎక్స్‌పో 2025లో కూడా కనిపిస్తుంది. కంపెనీ అనేక బ్యాటరీ ఎంపికలతో అందిస్తుంది. ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే 641 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు. ఇందులో 12.6-అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, 10.9-అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఫ్రంట్ ప్యాసింజర్ కోసం 10.9-అంగుళాల డిస్‌ప్లే, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్,  క్రూయిజ్ కంట్రోల్ వంటి ఫీచర్లు ఉన్నాయి. పోర్స్చే మకాన్ EV ఎక్స్-షోరూమ్ ధర రూ. 1.21 కోట్ల నుండి రూ. 1.68 కోట్ల మధ్య ఉంటుంది.

Updated Porsche Taycan
పోర్స్చే టైకాన్ అప్‌గ్రేడ్ మోడల్ భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025లో చూడటానికి అందుబాటులో ఉంటుంది. ఇది 4S , టర్బో వేరియంట్లలో 105 kWh వరకు బ్యాటరీ ప్యాక్ ఎంపికను కలిగి ఉంది. దీని టాప్ స్పెక్‌లో 884 PS/890 Nm డ్యూయల్ ఎలక్ట్రిక్ మోటార్ సెటప్ ఉంది. దాని సహాయంతో, ఇది కేవలం 2.7 సెకన్లలో గంటకు 0 నుండి 100 కిమీ వేగాన్ని అందుకుంటుంది.

Porsche Panamera GTS
రూ. 2.69 కోట్లతో రాబోయే ఆటో ఎక్స్‌పోలో మూడవ తరం పనామెరా జిటిఎస్‌ను పరిచయం చేయనున్నారు. 2025 Panamera డిజైన్‌లో మార్పులు ఉంటాయి. ట్రిపుల్ స్క్రీన్ సెటప్‌తో దాని క్యాబిన్‌లో కొత్త కలర్స్. ఇందులో ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ముందు వరుసలో ప్రయాణీకుల కోసం డిస్‌ప్లే ఉన్నాయి. ఇది 2.9-లీటర్ ట్విన్-టర్బో V6 పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగిస్తుంది, ఇది 353 పిఎస్ పవర్, 500 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

Exit mobile version
Skip to toolbar