Ola Electric Offers: ప్రముఖ విద్యుత్ స్కూటర్ల తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ హోలీ సందర్భంగా అదిరిపోయే ఆఫర్లను తీసుకొచ్చింది. కొత్తగా ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలనుకునే వారికి ఓలా భారీ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. హోలీ సందర్భంగా డిస్కౌంట్ ఆఫర్, ఎక్స్చేంజ్ ఆఫర్ లాంటి వాటిని ప్రకటించింది. ఓలా ఎస్ 1, ఓలా ఎస్ 1 ప్రో స్కూటర్లపై ఈ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి.
మార్చి 8 నుంచి 12 వరకు(Ola Electric Offers)
మరోవైపు ఇప్పటికే ఉపయోగిస్తున్న పెట్రోల్ స్కూటర్ పై ఆఫర్ కింద రూ. 45 వేల వరకు డిస్కౌంట్ పొందుతుండగా.. ఇపుడు హోలీ ఆఫర్స్ అదనంగా లభిస్తున్నాయి. అలాగే ఓలా ఎక్స్‌పీరియన్స్ సెంటర్ ద్వారా కొనుగోలు చేస్తే మరో రూ. 6,999 వరకు ప్రయోజనాలను పొందొచ్చు. ఈ ఆఫర్స్ మార్చి 8 నుంచి 12 వరకు అందుబాటులో ఉంటాయి.
50 శాతం వరకు తగ్గింపు
మార్చి 11,12 తేదీల్లో ఎక్స్‌పీరియన్స్ సెంటర్లలో ఎస్1, ఎస్1 ప్రో స్కూటర్లను కొనే వారికి ఓలా కేర్+ సబ్‌స్క్రిప్షన్లలో 50 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది. ఓలా కేర్+లో ఫ్రీ లేబర్ ఆన్ సర్వీస్, థెఫ్ట్ అసిస్టెన్స్ హెల్ప్ లైన్, పంక్చర్ అసిస్టెన్స్ వంటి ఆఫర్లు ఉన్నాయి.
వీటితో పాటు వార్షిక వాహన చెకప్, ఉచిత కన్జ్యూమబుల్స్, 24/7 డాక్టర్ అండ్ అంబులెన్స్ సర్వీస్ లాంటి ప్రయోజనాలను కూడా పొందొచ్చు. ఓలా(Ola Electric Offers) హోలీ ఆఫర్ల ద్వారా కస్టమర్లు ప్రయోజనం పొందొచ్చని కంపెనీ తెలిపింది. తాజా ఆఫర్లతో పండుగ ఆనందం మరింత పెరుగుతుందని పేర్కొంది.