Site icon Prime9

Electric Scooters Offers: అసలు అర్థం కావడం లేదు.. టాప్ స్కూటర్లపై రూ.30 వేల డిస్కౌంట్..!

Electric Scooters Offers

Electric Scooters Offers

Electric Scooters Offers: పండుగ సీజన్‌లో ఎలక్ట్రిక్ వాహనాల తయారీ కంపెనీలు అదిరిపోయే అదిరిపోయే డిస్కౌంట్లను అందిస్తున్నాయి. ఈ ఆఫర్లతో చాలా తక్కువ ధరకే కొత్త ఎలక్ట్రికర్ స్కూటర్లను మీ సొంతం చేసుకోవచ్చు. ఈ దీపావళికి ఎక్కువ మంది కస్టమర్లను పొందేందుకు ఓలా, ఏథర్, హీరో, టీవీఎస్ ఆకర్షణీయమైన ఆఫర్లను ప్రకటించాయి. కస్టమర్లు రూ. 30,000 వరకు ఆదా చేసుకోవచ్చు.

Bajaj Chetak
బజాజ్ ఆటో తన ప్రీమియం ఎలక్ట్రిక్ స్కూటర్ చేతక్‌పై దీపావళి ఆఫర్‌లను తమిళనాడు, కర్ణాటక రాష్ట్రంలోని వినియోగదారుల కోసం ప్రవేశపెట్టింది. ఆఫర్ కింద రూ.20,000 వరకు ఆదా చేసుకోవచ్చు. అమ్మకాల గురించి మాట్లాడితే బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ గత నెలలో అత్యధికంగా అమ్ముడైన రెండవ స్కూటర్‌గా నిలిచింది.

TVS iQube
పండుగ సీజన్‌లో టీవీఎస్ మోటర్ తన ఎలక్ట్రిక్ స్కూటర్ iQube పై చాలా మంచి ఆఫర్‌ను తీసుకొచ్చింది. ఈ నెలలో ఈ స్కూటర్ కొనుగోలు చేస్తే రూ.30,000 వరకు ఆదా చేసుకోవచ్చు. ఇది సురక్షితమైన, అద్భుతమైన స్కూటర్. iQube ధర రూ. 84,999 నుి ప్రారంభమవుతుంది.

Ather Energy
ఏథర్ ఎనర్జీ తన 450X, 450X అపెక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్లపై ఈ నెలలో రూ. 25,000 వరకు డిస్కౌంట్ అందిస్తోంది. ఈ స్కూటర్ అమ్మకాలు బాగానే ఉన్నాయి. దేశంలోనే అత్యంత విశ్వసనీయమైన స్కూటర్ ఇదే. గత నెలలో 12000 మందికి పైగా కొన్నారు. ఏథర్ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ. 1.40 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.

Hero Vida
మీరు Hero మోటోకార్ప్ EV బ్రాండ్ Vida V1 ప్లస్, V1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్‌ కొంటే రూ.29 వేల వరకు ఆదా చేసుకోవచ్చు. డిజైన్, ఫీచర్ల పరంగా ఈ స్కూటర్ చాలా బాగుంటుంది. కానీ ఇప్పుడు ఇది తక్కువ ధరలో అందుబాటులో ఉంది. దీని ధర రూ. 1.03 లక్షల నుండి ప్రారంభమవుతుంది.

Ola Electric Scooter
పండుగ సీజన్‌లో ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ తన ప్రసిద్ధ స్కూటర్ ఎస్1 ఎక్స్ ధరను ఈ నెల రూ.74,999 నుంచి రూ.49,999కి తగ్గించింది. ఇప్పటి వరకు ఇదే ఉత్తమమైన డీల్. ఈ దీపావళికి ఎలక్ట్రిక్ టూ-వీలర్ కంపెనీ iVOOMi దాని ఎలక్ట్రిక్ స్కూటర్లు Jeet X ZE, S1 సిరీస్‌పై రూ. 10,000 వరకు డిస్కౌంట్‌ను ఆఫర్ చేస్తోంది.

Exit mobile version