Oben Rorr EZ: దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వాడకం వేగంగా పెరుగుతోంది. అనేక స్వదేశీ, విదేశీ కంపెనీలు భారత్‌లోకి ప్రవేశిస్తున్నాయి. ఎలక్ట్రిక్ స్కూటర్ సెగ్మెంట్ చాలా పెద్దది అయినప్పటికీ, ఎలక్ట్రిక్ బైక్ సెగ్మెంట్ ఇప్పటికీ పెద్దది కాదు. భారతీయ ఎలక్ట్రిక్ కంపెనీ ఒబెన్ తన కొత్త బైక్ రోర్ ఇజెడ్‌ను మార్కెట్లో విడుదల చేసింది. రోజువారీ వినియోగానికి అనుగుణంగా ఈ బైక్‌ను రూపొందించారు. ఇది సులభమైన హ్యాండ్లింగ్, రైడ్ క్వాలిటీని అందిస్తుంది. ఈ బైక్ ఎక్స్-షోరూమ్ ధర కేవలం రూ. 89,999. ఫుల్ ఛార్జింగ్ పై 175 కిలోమీటర్ల రేంజ్‌ని అందిస్తుంది. బైక్ మార్కెట్‌లోకి రాగానే షోరూం వద్ద జనం షోరూమ్‌లకు క్యూ కట్టారు. ఇందులో ఉన్న ప్రత్యేకత ఏంటో తెలుసుకుందాం.
ఒబెన్ రోర్ ఇజెడ్ ఎలక్ట్రిక్ బైక్ వివిధ వేరియంట్లలో అందుబాటులో ఉంది. దీని 2.6 kWh వేరియంట్ ధర రూ. 89,999, 3.4 kWh వేరియంట్ ధర రూ. 99,999. 4.4 kWh వేరియంట్ ధర రూ. 1,09,999. ఈ ధరలన్నీ ఎక్స్-షోరూమ్.
ఒబెన్ ఎలక్ట్రిక్ కొత్త రోర్ సులభంగా ఛార్జ్ చేస్తే 175 కిమీల రేంజ్ అందిస్తుంది. కానీ ఈ రేంజ్ దాని టాప్ మోడల్, తక్కువ వేరియంట్ల రేంజ్ దీని కంటే తక్కువగా ఉంటుంది. ఈ బైక్‌ను రోజువారీ ఉపయోగం కోసం తయారు చేసినట్లు కంపెనీ పేర్కొంది. కాబట్టి దీన్ని తరచుగా ఛార్జ్ చేయాల్సిన అవసరం ఉండదు.
ఈ బైక్ మెరుగైన రేంజ్‌కి హామీ ఇస్తుంది. ఈ బైక్ గరిష్ట వేగం గంటకు 95 కిలోమీటర్లు. కేవలం 3.3 సెకండ్ల వ్యవధిలోనే 0-40 కి.మీ వేగంతో దీనిని నడపవచ్చు. ఇది రోజువారి అవసరాలకు మంచి బైక్ కావచ్చు. ఇందులో ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్ ఉంది. ఈ ఫీచర్‌తో 45 నిమిషాల్లోనే 80 శాతం వరకు ఛార్జ్ చేయచ్చు.
ఒబెన్ రోర్ ఈజీ బైక్‌లో 3 రైడింగ్ మోడ్‌లు ఉన్నాయి. ఇది రైడ్ క్వాలిటీని మెరుగుపరుస్తుంది. ఈ బైక్‌ను ఎలక్ట్రో అంబర్, సర్జ్ సియాన్, లూమినా గ్రీన్, ఫోటాన్ వైట్ కలర్స్‌లో కొనుగోలు చేయచ్చు. బైక్‌లోని అన్ని కలర్స్ యువతను దృష్టిలో ఉంచుకుని తీసుకొచ్చారు. ఈ బైక్ ARX ఫ్రేమ్‌వర్క్‌పై తయారైంది. ఇది నియో-క్లాసిక్ డిజైన్‌లో ఉంది.
అంతే కాకుండా జియో ఫెన్సింగ్, థెఫ్ట్ ప్రొటెక్షన్, అన్‌లాక్ బై యాప్, డయాగ్నస్టిక్ అలర్ట్ సిస్టమ్ వంటి ఫీచర్లు ఈ బైక్‌లో అందించారు. ఈ బైక్ కలర్ LED డిస్‌ప్లేను కలిగి ఉంది. దీనిలో మీరు చాలా సమాచారాన్ని పొందుతారు. ఈ ఎలక్ట్రిక్ బైక్‌లో ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్, టెయిల్ ల్యాంప్, ఇండికేటర్‌లు కనిపిస్తాయి.