Site icon Prime9

Nissan Magnite CNG: మైలేజ్ చాలా బాగుంది.. సీఎన్‌జీగా నిస్సాన్ మాగ్నైట్.. ధర ఎంతంటే..?

Nissan Magnite CNG

Nissan Magnite CNG

Nissan Magnite CNG: మారుతి సుజుకి, టాటా తర్వాత ఇప్పుడు నిస్సాన్ ఇండియా కూడా భారతదేశంలో తన మొదటి CNG కాంపాక్ట్ ఎస్‌యూవీని విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. కొత్త మోడల్ రాకతో వినియోగదారులకు అనేక మంచి ఎంపికలు కూడా లభిస్తాయి. నిస్సాన్ మాత్రమే కాదు, అనేక ఇతర కంపెనీలు కూడా CNG సెగ్మెంట్లోకి ప్రవేశించడానికి సిద్ధమవుతున్నాయి. ఇప్పుడు కొత్త మాగ్నైట్ CNG వచ్చే నెల ఏప్రిల్‌లో విడుదల కానుంది. ఈ వాహనం టెస్టింగ్ సమయంలో చాలాసార్లు కనిపించింది. దేశంలో ఇది టాటా పంచ్‌తో పోటీపడుతుంది.

CNG కిట్ నిస్సాన్ మాగ్నైట్‌లో డీలర్-స్థాయి అనుబంధ కిట్‌గా ఉంటుంది. CNG కిట్‌పై 1 సంవత్సరం డీలర్ వారంటీ కూడా ఇస్తుంది. అయితే సీఎన్‌జీ కిట్ ధర రూ.75,000 నుంచి రూ.79,500 వరకు ఉంటుందని కూడా వార్తలు వస్తున్నాయి. CNG మోడల్‌తో కంపెనీ మార్కెట్ వాటా పెరుగుతుందని కంపెనీ తెలిపింది.

CNG కిట్ మాగ్నైట్ 1.0-లీటర్ పెట్రోల్ ఇంజన్‌లో మాత్రమే ఇన్‌స్టాల్ చేసి ఉంటుంది. ఈ ఇంజన్ 5 మాన్యువల్ గేర్‌బాక్స్‌తో ఉంటుంది. మాగ్నైట్ CNG వెర్షన్ 22/Kg వరకు మైలేజీని పొందవచ్చని అంచనా. అయితే CNG కిట్‌తో పవర్, టార్క్ అవుట్‌పుట్‌తో సహా ఇతర స్పెసిఫికేషన్‌ల వివరాలు ఇంకా వెల్లడి కాలేదు. మాగ్నైట్ CNG వెర్షన్ 22Km/Kg వరకు మైలేజీని ఇవ్వగలదని అంచనా. అయితే CNG కిట్‌తో పవర్, టార్క్ అవుట్‌పుట్‌తో సహా ఇతర స్పెసిఫికేషన్‌ల వివరాలు ఇంకా వెల్లడి కాలేదు.

భద్రత కోసం ఈ మాగ్నైట్‌లో 6 ఎయిర్‌బ్యాగ్స్, హై స్పీడ్ అలర్ట్ సిస్టమ్, చైల్డ్ సీట్ మౌంట్, ఎమర్జెన్సీ స్టాప్ సిగ్నల్, యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ విత్ EBD, ట్రాక్షన్ కంట్రోల్, హిల్ స్టార్ట్ అసిస్ట్, వెహికల్ డైనమిక్ కంట్రోల్, హైడ్రాలిక్ బ్రేక్ అసిస్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

టాటా పంచ్ 72.49 బిహెచ్‌పి,103 ఎన్ఎమ్ టార్క్‌ను అందించే CNGలో 1.2-లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్‌ ఉంటుంది. ఇందులో 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌ ఉంది. టాటా పంచ్ CNG ట్విన్-సిలిండర్ టెక్నాలజీతో వస్తుంది. 210-లీటర్ల బూట్ స్పేస్‌ను కలిగి ఉంది. ఈ మోడల్ 26.99 km/kg మైలేజీని ఇస్తుంది.

Exit mobile version
Skip to toolbar