Site icon Prime9

New Gen Maruti Suzuki Dzire: న్యూ జెన్ మారుతి సుజికి డిజైర్ బుకింగ్స్ ఓపెన్.. మైలేజ్, ఫీచర్లు చూస్తే స్టన్ అవుతారు!

New Gen Maruti Suzuki Dzire

New Gen Maruti Suzuki Dzire

New Gen Maruti Suzuki Dzire Bookings Open: న్యూ జెన్ మారుతి సుజికి డిజైర్ బుకింగ్‌లు ప్రారంభమయ్యాయి. డీలర్షిప్ లేదా ఆన్‌లైన్ ద్వారా బుకింగ్‌లను చేయచ్చు. కొత్త డిజైర్‌ను కేవలం రూ.11 వేల టోకెట్ అమోంట్ చెల్లించి బుక్ చేసుకోవచ్చు. ఎంతగానో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ కారును నవంబర్ 11న కంపెనీ అధికారికంగా విడుదల చేయనుంది. ఈ కారులో సన్‌రూఫ్‌తో సహా సెగ్మెంట్ ఫస్ట్ ఫీచర్లు ఉంటాయి. ఈ కారు గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

ఇప్పటికే విడుదలైన కొత్త తరం స్విఫ్ట్‌లో అందించన అదే ఇంజన్‌పై కొత్త తరం డిజైర్‌లో కూడా ఉంటుంది. డిజైర్ 1.2-లీటర్ Z-సిరీస్ 3-సిలిండర్ ఇంజన్‌ను పొందుతుంది. ఇది 5700 ఆర్‌పిఎమ్ వద్ద 81 పిఎస్ పవర్, 4300 ఆర్‌పిఎమ్ వద్ద 112 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 5-స్పీడ్ మ్యాన్యువల్, 5-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఎంపికతో ఉంటుంది. లాంచ్ అయిన వెంటనే CNG ఎంపికను కూడా ప్రవేశపెట్టాలని భావిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన స్విఫ్ట్ పెట్రోల్, సిఎన్‌జి ఎంపికలలో మంచి డిమాండ్‌ను సృష్టిస్తోంది. డిజైర్ కూడా భారీ డిమాండ్‌ను పొందుతుందని భావిస్తున్నారు.

కొత్త మారుతి సుజుకి డిజైర్‌లో ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, 360 డిగ్రీ పార్కింగ్ కెమెరా వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ రెండూ సెగ్మెంట్‌లో ఫస్ట్ టైప్ ఫీచర్లు. డీలర్ ఫిట్ చేసే యాక్ససరీస్‌లో భాగంగా టాటా టిగోర్ సన్‌రూఫ్‌తో వస్తుంది. ఇంకా కొత్త డిజైర్‌లో ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, పుష్-బటన్ స్టార్ట్/స్టాప్‌తో కీలెస్ ఎంట్రీ, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే, వెనుక ఏసీ వెంట్‌లతో కూడిన 9.0-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.

కొత్త డిజైర్ ప్రారంభ ధర రూ.6.70 లక్షల (ఎక్స్-షోరూమ్)గా ఉంటుందని భావిస్తున్నారు. పెట్రోల్ లో 25 కి.మీ, సిఎన్ జిలో 33 కి.మీ మైలేజీ ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఇప్పటికే, కొత్త తరం స్విఫ్ట్ కారు కంపెనీ క్లెయిమ్ చేసిన మైలేజ్ ఇస్తుంది. సేఫ్టీ పరంగా కొత్త తరం మారుతి డిజైర్ ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, హిల్-హోల్డ్ అసిస్ట్, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ABS), ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ (ESP), రివర్స్ పార్కింగ్ కెమెరా, ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ (EBD)తో వస్తుంది.

Exit mobile version