November Launched Cars: దేశంలో పండుగల సీజన్ ముగిసింది. అయితే ఇప్పుడు నవంబర్ నెల కూడా అదే పండుగ ఉత్సాహాన్ని ఇవ్వనుంది. అనేక ఆటోమొబైల్ కంపెనీ పెద్ద యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశాయి. మీరు ఈ నెలలో కొత్త కారును కొనాలని ప్లాన్ చేస్తుంటే నాలుగు కొత్త మోడళ్లు మార్కెట్‌లోకి రానున్నాయి. ఇందులో మారుతి నుండి రెండు కార్లు, స్కోడా నుండి కొత్త ఎస్‌యూవీ, మెర్సిడెస్ నుండి ఒక సెడాన్ ఉన్నాయి. వీటి గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Maruti Suzuki eVX
మారుతి సుజుకి తన కాన్సెప్ట్ eVX ఎలక్ట్రిక్ కారును ఆటో ఎక్స్‌పో 2023లో పరిచయం చేసింది. ఇప్పుడు మారుతి సుజుకి eVX ఎలక్ట్రిక్ SUV ప్రొడక్షన్ మోడల్‌ను నవంబర్ 4 న ఇటలీలోని మిలాన్‌లో ప్రపంచవ్యాప్త లాంచ్ చేస్తుంది. కానీ ఇది మేడ్ ఇన్ ఇండియా EV అవుతుంది. భారతదేశంలో కూడా తరువాత ప్రారంభించనుంది. eVX ఎలక్ట్రిక్ కారును వచ్చే ఏడాది భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025లో ప్రవేశపెట్టనున్నారు. ఇది 60kWh బ్యాటరీ ప్యాక్‌తో వచ్చే ఎలక్ట్రిక్ కారు, ఫుల్ ఛార్జ్‌పై 500 కిలోమీటర్ల రేంజ్ అందిస్తుంది. ఇది AWD సిస్టమ్‌తో కూడా రానుంది. ధరపై ఎటువంటి సమాచారం తెలియలేదు.
Skoda Kylaq
స్కోడా కొత్త కైలాక్ సబ్-కాంపాక్ట్ SUV సెగ్మెంట్‌లో నవంబర్ 6న భారతదేశంలో విడుదల కానుంది. కొత్త మోడల్ స్కోడా MQB-A0-IN ప్లాట్‌ఫామ్‌పై ఆధారపడి ఉంటుంది. ఈ SUV పొడవు 4 మీటర్ల కంటే తక్కువగా ఉంటుంది. ఇది 6 స్పీడ్ మాన్యువల్, AT గేర్‌బాక్స్‌తో కూడిన 1.0L TSI టర్బో పెట్రోల్ ఇంజన్‌ను కలిగి ఉంటుంది. భద్రత కోసం యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్‌తో ఈ మోడల్‌లో EBD, 6 ఎయిర్‌బ్యాగ్‌లు వంటి ఫీచర్లు కనిపిస్తాయి. ఈ కొత్త మోడల్ ధర వచ్చే ఏడాది ప్రారంభంలో ప్రకటించనుంది.
Maruti Suzuki Dzire
మారుతి సుజుకి తన అత్యంత ప్రజాదరణ పొందిన కాంపాక్ట్ SUV డిజైర్ ఫేస్‌లిఫ్ట్ మోడల్‌ను నవంబర్ 11 న విడుదల చేయబోతోంది. ఈసారి కొత్త డిజైర్‌లో అనేక ప్రధాన మార్పులు కనిపిస్తాయి. ఫస్ట్ ఇన్ క్లాస్ సెగ్మెంట్ ఫీచర్లు కూడా చేర్చారు. ఈ డిజైర్‌లో కొత్త Z-సిరీస్ ఇంజిన్ ఉంటుంది. అలానే కొత్త Z-సిరీస్ 3 సిలిండర్ ఇంజన్‌ను పొందుతుంది. ఇది దాదాపు 82 hp, 112 Nm టార్క్‌ను అందిస్తుంది. ఈ ఇంజన్ 5 స్పీడ్ మాన్యువల్, 5 స్పీడ్ AMT గేర్‌బాక్స్‌తో ఉంటుంది. ఈసారి కొత్త డిజైర్‌లో భద్రతపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. ఈసారి కొత్త డిజైర్‌లో తొలిసారిగా 6 ఎయిర్‌బ్యాగ్‌లు కనిపించనున్నాయి.
Mercedes-AMG C63 S E Performance
మెర్సిడెస్ బెంజ్ తన కొత్త AMG C 63ని నవంబర్ 12న భారతదేశంలో విడుదల చేయనుంది. ఇంజన్ గురించి మాట్లాడితే కొత్త AMG C 63 2.0-లీటర్, 4-సిలిండర్ టర్బో-పెట్రోల్ ఇంజన్‌తో పాటు కొత్త V8 ప్లగ్-ఇన్ హైబ్రిడ్ సెటప్‌తో పాటు వెనుక-మౌంటెడ్ ఎలక్ట్రిక్ మోటారును మిళితం చేస్తుంది. ఈ ఇంజన్ 475 హెచ్‌పి పవర్‌ను అందించగా, ఎలక్ట్రిక్ మోటార్ 203 హెచ్‌పి పవర్‌ను అందిస్తుంది. ఇది ఆల్-వీల్ డ్రైవ్‌తో కూడిన 9-స్పీడ్ మల్టీ-క్లచ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ని కలిగి ఉంటుంది. C 63 6.1kWh బ్యాటరీ ప్యాక్‌ను పొందుతుంది. ఇది కేవలం విద్యుత్ శక్తితో 13 కిమీ వరకు ఉంటుంది. AMG C 63 డిజైన్‌లో కొత్తదనం ఉంటుంది.