Site icon Prime9

New Technology Tyres: సరికొత్త టెక్నాలజీ.. 10 వేల కిమీ వరకు గాలి అవసరం లేదు.. టైరు మార్చక్కర్లేదు..!

New Technology Tyres

New Technology Tyres

New Technology Tyres: ప్రపంచంలోని రెండవ అతిపెద్ద టైర్ తయారీ కంపెనీ మిచెలిన్-అమెరికన్ కార్ల తయారీ సంస్థ జనరల్ మోటార్స్ పంక్చర్ ప్రూఫ్ ఎయిర్‌లెస్ టైర్‌ను అభివృద్ధి చేశాయి. 5 సంవత్సరాల క్రితం MovinOn ట్రాన్స్‌పోర్ట్ సమ్మిట్‌లో కంపెనీ తన డిజైన్‌ను ప్రదర్శించింది. అప్పటి నుంచి దీని ప్రారంభానికి సంబంధించిన వార్తలు వచ్చాయి. అయితే ఇంకా మార్కెట్‌లోకి రాలేకపోయింది. ఈ టైర్ ప్రత్యేకత ఏమిటంటే, దీనికి ట్యూబ్ లేదు గాలి కూడా ఉండదు. టైర్ పంక్చర్‌ను నివారించడానికి చాలా కంపెనీలు విభిన్న ఆవిష్కరణలు చేస్తున్నాయి.

ఈ ఎయిర్‌లెస్ టైర్ రెసిన్-ఎంబెడెడ్ ఫైబర్ గ్లాస్, అల్యూమినియం వీల్‌తో రూపొందించారు. ఇది ప్రస్తుతం ఉన్న టైర్ల కంటే చౌకగా ఉండటమే కాకుండా ఎక్కువ కాలం మన్నుతుంది. ‘ఆప్టిస్’ పేరుతో ఈ టైర్‌ను 2024  చివరి నాటికి మార్కెట్‌లోకి విడుదల చేయాలని భావిస్తున్నారు. అయితే ఎయిర్‌లెస్ టైర్ల కాన్సెప్ట్ పాతదే. దీని టెస్టింగ్ హెవీ లోడర్ మెషీన్లలో కూడా జరిగింది. అదే సమయంలో అవి కొన్ని కార్లలో కూడా అమర్చారు. ఈ ప్రయోగం విజయవంతమైంది. ఇప్పుడు కంపెనీలు ఈ దిశగా అడుగులు వేయడానికి ఇదే కారణం.

టన్నస్ ప్రకారం.. వచ్చే ఏడాది దేశంలో 29-అంగుళాల,  27.5-అంగుళాల MTB సైజు టైర్లను విడుదల చేయనున్నారు. ఈ టైర్ల జీవితకాలం 10 వేల కిలోమీటర్ల వరకు ఉంటుంది. అంటే వాటిని గాలితో నింపాల్సిన అవసరం లేదు. అలాగే ఇన్ని కిలోమీటర్ల వరకు పంక్చర్ పడదు. ఇప్పుడు వాడుతున్న గాలిలేని టైర్ల డిజైన్ చక్రంలా ఉంది. అంటే టైర్‌లో ఉపయోగించే రబ్బర్ బేస్‌లో V డిజైన్ సపోర్ట్ ఉంటుంది.

ఈ టైర్ల ప్రత్యేకత ఏమిటంటే.. భారీ లోడర్ల యంత్రాల బరువు కూడా టైర్లను ప్రభావితం చేయని సాంకేతికత ఇందులో ఉపయోగించారు. మిచెలిన్ ఇటీవలే వారి కొత్త అప్టిస్ డిజైన్‌ను ప్రకటించింది. ఇది చువ్వలకు చెవ్రాన్ ఆకారాన్ని కలిగి ఉంటుంది. 2024 నాటికి GM భాగస్వామ్యంతో ఈ ఉత్పత్తిని ప్రారంభించాలని కంపెనీ యోచిస్తోంది. మిచెలిన్ మొదటిసారిగా 2005లో దాని ట్విల్ ప్రోటోటైప్‌తో పబ్లిక్‌గా వెళ్లింది.

Exit mobile version