Site icon Prime9

Maruti Suzuki Dzire Unveiled: సరికొత్తగా డిజైర్ స్విఫ్ట్‌.. నవంబర్ 11న లాంచ్.. మైలేజ్ మాములుగా లేదన్నయ్యా!

Maruti Suzuki Dzire Unveiled

Maruti Suzuki Dzire Unveiled

Maruti Suzuki Dzire Unveiled: దేశీయ ఆటోమొబైల్ మార్కెట్లో మారుతి కార్లకు మార్కెట్లో మంచి డిమాండ్‌ ఉంటుంది. ఎందుకంటే వాటి మైలేజ్ ఇతర కంపెనీ వాహనాలతో పోలిస్తే కాస్త మెరుగ్గా ఎక్కువ. ఇప్పుడు కంపెనీ తన కస్టమర్ల సంఖ్యను పెంచుకోవడానికి కాంపాక్ట్ సెడాన్ డిజైర్‌ను తీసుకురానుంది. ఇది నవంబర్ 11న విడుదల కానుంది. దేశం నంబర్-1 సెడాన్ ఇప్పుడు అనేక సెగ్మెంట్ ఫస్ట్ ఫీచర్లతో పాటు అన్ని కొత్త డిజైన్‌లను పొందుతుంది. దీని మైలేజ్ కూడా మునుపటి మోడల్ కంటే ఎక్కువ. డిజైర్  పాత మోడల్ మైలేజ్ 22.41km/l నుండి 22.61km/l వరకు ఉంది. అయితే కొత్త మోడల్ మైలేజ్ 24.79 (MT), 25.71km/l (AT). కంపెనీ ప్రీ-బుకింగ్‌ను కూడా ప్రారంభించింది. రూ.11,000 టోకెన్ మొత్తం చెల్లించి బుక్ చేసుకోవచ్చు. దీని లాంచ్, ధర గురించి వివరంగా తెలుసుకుందాం.

అప్‌డేట్ చేసిన డిజైర్ దాని అగ్రెసివ్ ఫ్రంట్ బంపర్, హిరిజెంటల్ DRLలతో కూడిన స్టైలిష్ LED హెడ్‌లైట్‌లు, మల్టీ స్లాట్‌లతో కూడిన వైడ్ గ్రిల్, రీడిజైన్ చేసిన ఫాగ్ ల్యాంప్ హౌసింగ్‌లతో ప్రత్యేకంగా నిలుస్తుంది. అయితే దీని సిల్హౌట్ మునుపటి మోడల్‌లాగే ఉంటుంది. ఈ సెడాన్  షోల్డర్ లైన్ ఇప్పుడు మరింత ప్రముఖమైనది. ఇతర ఫీచర్లలో షార్క్ ఫిన్ యాంటెన్నా, బూట్ లిడ్ స్పాయిలర్, క్రోమ్ స్ట్రిప్‌కు అటాచ్ చేసిన Y- షేపుడ్ LED టెయిల్‌లైట్‌లు ఉన్నాయి.

డిజైర్ లోపలి భాగంలో లైట్ బ్రౌన్,  బ్లాక్ కలర్ థీమ్, డ్యాష్‌బోర్డ్‌పై ఫాక్స్ వుడ్ యాక్సెంట్‌లు ఉన్నాయి. ఇది అనలాగ్ డ్రైవర్ డిస్‌ప్లే, క్రూయిజ్ కంట్రోల్, ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో కోసం వైర్‌లెస్‌తో కూడిన 9-అంగుళాల టచ్‌స్క్రీన్, వెనుక వెంట్‌లతో కూడిన ఎయిర్ కండిషనింగ్, సింగిల్-పేన్ సన్‌రూఫ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

కొత్త డిజైర్ స్విఫ్ట్‌లో 1.2-లీటర్ మూడు-సిలిండర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్‌ను ఉంది. ఇంజన్ గరిష్టంగా 80 బీహెచ్‌పీ పవర్, 112ఎన్ఎమ్ పీక్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది 5 స్పీడ్ మాన్యువల్ లేదా AMT ట్రాన్స్‌మిషన్‌తో అటాచ్ చేసి ఉంటుంది. ఇది LXi, VXi, ZXi , ZXi ప్లస్ వేరియంట్లలో లాంచ్ కానుంది.

మారుతి సుజుకి అప్‌డేటెడ్ కాంపాక్ట్ సెడాన్ వెనుక పార్కింగ్ సెన్సార్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), 6 ఎయిర్‌బ్యాగ్‌లు (స్టాండర్డ్), 360-డిగ్రీ కెమెరా (సెగ్మెంట్‌లో మొదటిసారి) వంటి అనేక భద్రతా ఫీచర్లను కలిగి ఉంది. అప్‌డేటెడ్ డిజైర్  ఎక్స్-షోరూమ్ ధర సుమారు రూ.6.70 లక్షలు. దాని సెగ్మెంట్లో ఇది హ్యుందాయ్ ఆరా, టాటా టిగోర్, హోండా అమేజ్‌లతో పోటీపడుతుంది.

Exit mobile version