Maruti Suzuki e Vitara: మారుతి నుంచి ఫస్ట్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ.. అదిరిపోయే ఫీచర్లతో టాటా కర్వ్‌తో పోటీ..!

Maruti Suzuki e Vitara: ఇటలీలోని మిలన్ నగరంలో జరిగిన మోటర్ షోలో సుజికి తన మొదటి ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ఇ విటారాను పరిచయం చేసింది. కంపెనీ గ్లోబల్ మార్కెట్‌లో తన మొదటి EV e-Vitara ఓవర్ వ్యూని చూపింది. మారుతి సుజుకి ఇప్పటికే భారతదేశంలోని ఆటో ఎక్స్‌పోలో దాని ప్రొడక్షన్ స్పెక్ వెర్షన్ eVX కాన్సెప్ట్‌ను పరిచయం చేసింది. కొత్త మోడల్‌ను ఇ-విటారా అనే పేరుతో దేశంలో ప్రారంభించవచ్చు. కానీ ఈ వెహికల్ కాన్సెప్ట్ డిజైన్ 4-మీటర్ల ఎస్‌యూవీ కంటే పెద్దదిగా ఉంటుందని నమ్ముతారు.

కొత్త ఇ విటారా డిజైన్, అనుభూతి గ్రాండ్ విటారా కంటే చాలా భిన్నంగా ఉంటాయి. ఈ ఎలక్ట్రిక్ కారు హార్ట్‌టెక్ ఇ-ప్లాట్‌ఫామ్ ఆధారంగా రూపొందించారు. చాలా షార్ప్ ఎల్‌ఈడీ డీఆర్ఎల్‌లుదాని ముందు భాగంలో కనిపిస్తాయి. ఒక ఖాళీ ఆఫ్ గ్రిల్ దీనిలో ఇన్స్టాలై ఉంటుంది. ఇది మాత్రమే కాదు, దీని టాప్-ఎండ్ వెర్షన్‌లో 19-అంగుళాల అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. అయితే దీని స్టాండర్డ్ ప్లస్ వేరియంట్‌లో 18-అంగుళాల అల్లాయ్ వీల్స్ ఉన్నాయి.

మారుతీ ఇ-విటారాలో మునుపటి స్విఫ్ట్‌లో ఉన్న డోర్ హ్యాండిల్స్‌ను ఈ వాహనంలో అమర్చారు. వెనుక నుండి దాని డిజైన్‌లో ఫ్రాండ్స్ చూడవచ్చు. మారుతి ఎలక్ట్రిక్ కారు కూడా 2700 mm వీల్ బేస్ కలిగి ఉంది.లోపలి భాగం చాలా విశాలంగా ఉంది. ఇది కాకుండా ఇ-విటారా డ్యాష్‌బోర్డ్ డిజైన్ చాలా భిన్నంగా ఉంది. ఈ మోడల్‌లో కొత్త 2-స్పోక్ స్టీరింగ్ వీల్ ఉంది. ట్విన్ స్క్రీన్ లేఅవుట్ ఉంది. కొత్త డ్రైవ్ సెలెక్టర్ కూడా అందించారు. దీనిలో ‘ALLGRIP-e’ అనే ఎలక్ట్రిక్ 4WD సిస్టమ్‌‌ను సెటప్ చేశారు. ఇది ఆఫ్-రోడ్ సామర్థ్యాలను అందిస్తుంది.

మారుతి ఇ విటారా స్టాండర్డ్ వెర్షన్‌లో ఒకే ఫ్రంట్ మోటార్ ఉంది. ఇందులో 49 kWh బ్యాటరీ ప్యాక్ ఉంది. ఇది 142 బీహెచ్‌పి పవర్,  189 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అయితే దీని రేంజ్ ఏంటో మాత్రం వెల్లడించలేదు. ఈ వాహనం 61 kWh పెద్ద బ్యాటరీ ప్యాక్‌తో రానుంది. ఇందులో డ్యూయల్ మోటార్ ఉంటుంది. ఇది 180 బీహెచ్‌పి పవర్, 300 ఎన్ఎమ్ టార్క్‌ను అందిస్తుంది.

మారుతి ఇ విటారా వచ్చే ఏడాది (2025)లో సుజుకి మోటార్ గుజరాత్‌లో భారతదేశంలో ఉత్పత్తి చేస్తుంది. ఈ వాహనాన్ని నెక్సా డీలర్షిప్ ద్వారా సేల్ చేయచ్చు. ఇది మారుతికి అత్యంత ప్రీమియం కారు కావచ్చు. దేశంలో ఇది టాటా కర్వ్ ఈవీ, హ్యుందాయ్ క్రెటా ఈవీలతో పోటీపడుతుంది.