Maruti Suzuki Baleno Safety: భారతదేశంలో హ్యాచ్‌బ్యాక్‌లకు విపరీతమైన డిమాండ్ ఉంది. ముఖ్యంగా మారుతి సుజికి హ్యాచ్‌బ్యాక్‌లు ప్రతి నెలా రికార్డు స్థాయిలో అమ్ముడవుతున్నాయి. మారుతి సుజికి ఫ్లాగ్‌షిప్ హ్యాచ్‌బ్యాక్ బాలెనోకు ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ కారు ఆకర్షణీయమైన డిజైన్, మంచి ఫీచర్లను కలిగి ఉంది. అయితే సేఫ్టీ విషయానికి వస్తే ఈ కారు 2021లో లాటిన్ NCAP ద్వారా క్రాష్-టెస్ట్ చేసింది. దీనిలో ఇది 0-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను దక్కించుకుంది . తాజా మోడల్‌ను భారత్ NCAP లేదా గ్లోబల్ NCAP ఇంకా పరీక్షించాల్సి ఉంది.
అయితే కొత్త ఫేస్‌లిఫ్టెడ్ బాలెనో రైడ్, బిల్డ్ క్వాలిటీ ప్రీ-ఫేస్‌లిఫ్ట్ మోడల్‌తో పోలిస్తే కొద్దిగా మెరుగుపడింది. సౌకర్యవంతమైన సీట్లు, మృదువైన ఇంజిన్, కొత్త ఫీచర్లు చిన్న కుటుంబాలకు ఇది మంచి ఎంపిక. స్టైలిష్ లుక్, 360-డిగ్రీ కెమెరా, హెడ్-అప్ డిస్‌ప్లే (HUD) వంటి ఫీచర్‌లు ఉన్నాయి.
భద్రతా ఫీచర్ల గురించి మాట్లాడితే ఈ హ్యాచ్‌బ్యాక్ ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, 360 డిగ్రీ కెమెరా, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, హిల్-హోల్డ్ అసిస్ట్, ప్రయాణికులందరికీ 3-పాయింట్ సీట్ బెల్ట్‌లు, ISOFIX చైల్డ్ సీట్ మౌంట్‌లు, వెనుక పార్కింగ్ సెన్సార్‌లతో వస్తుంది.
మారుతి బాలెనో బేస్ వేరియంట్ ధర రూ. 6.66 లక్షలు టాప్-ఎండ్ వేరియంట్‌కి రూ. 9.83 లక్షలు. CNG వేరియంట్‌ల ధరలు రూ. 8.40 లక్షల నుండి ప్రారంభమవుతాయి, అయితే పెట్రోల్-ఆటోమేటిక్ వేరియంట్‌లు రూ. 7.95 లక్షల నుండి ప్రారంభమవుతాయి.
మారుతి బాలెనో 9-అంగుళాల టచ్ స్క్రీన్, 6-స్పీకర్ అర్కామిస్ ట్యూన్డ్ సౌండ్ సిస్టమ్‌ను అన్ని వేరియంట్‌లలో కలిగి ఉంది. ఇది హెడ్స్-అప్ డిస్ప్లే, క్రూయిజ్ కంట్రోల్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, పుష్-బటన్ స్టార్ట్/స్టాప్, కీలెస్ ఎంట్రీని కూడా కలిగి ఉంది.
మారుతి బాలెనో పెట్రోల్, CNG ఎంపికలతో 1.2-లీటర్ నాచురల్-ఆస్పిరేటెడ్ ఇంజన్‌తో అందించారు. పెట్రోల్ ఇంజన్ 90 పిఎస్ పవర్, 113 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ లేదా 5-స్పీడ్ఆటోమేటెడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో వస్తుంది.
సిఎన్‌జి ఇంజన్ 77.5 పిఎస్ పవర్, 98.5 ఎన్ఎమ్ టార్క్ రిలీజ్ చేస్తుంది. దీన్ని 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో విడిగా లింగ్ చేయచ్చు. మారుతి బాలెనో హ్యుందాయ్ i20, టాటా ఆల్ట్రోజ్, టయోటా గ్లాంజా, సిట్రోయెన్ C3 క్రాస్ వంటి సైజు హ్యాచ్‌బ్యాక్‌లతో పోటీపడుతుంది.