Maruti Suzuki Fronx Facelift: తొందర వద్దు సోదరా.. 35 కిమీ మైలేజ్ ఇచ్చే కార్ వచ్చేస్తోంది.. త్వరలో రోడ్లపైకి పరుగులు!

Maruti Suzuki Fronx Facelift: దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజికి ఫ్రాంక్స్ భారతీయ కస్టమర్ల హృదయాలను శాసిస్తుంది. ఈ ఎస్‌యూవీ 2023లో విడుదలైనప్పటి నుంచి దాదాపు 2 లక్షల మంది ఇళ్లకు చేరుకుంది. ఈ స్థాయి సేల్స్‌కు కంపెనీ కూడా అంచనా వేయలేక పోయింది. మారుతి ఇప్పుడు ఫ్రాంక్స్ ఫెస్‌లిఫ్ట్‌ను మార్కెట్‌లోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తుంది. ఈ సారి మరింత పవర్‌‌ఫుల్‌గా లేటెస్ట్ హైబ్రిడ్ సెటప్‌తో ప్రవేశించనుంది. 2025లో రోడ్లపై పరుగులు పెట్టే అవకాశం ఉందని భావిస్తున్నారు. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

మారుతి సుజుకి, టయోటా భవిష్యత్తులో ఎలక్ట్రిక్ కార్ల కంటే హైబ్రిడ్ కార్లపైనే ఎక్కువగా దృష్టి సారిస్తున్నాయి. ఇప్పుడు మారుతి సుజుకి తన ఫేమస్ ఎస్‌యూవీ ఫ్రంటెక్స్ ఫేస్‌లిఫ్ట్ మోడల్‌ను తీసుకువస్తోంది. భారతదేశంలో హైబ్రిడ్ ఇంజిన్‌‌తో వస్తున్న కారు ఇదే. నివేదికల ప్రకారం.. మారుతి సుజుకి 2025 ప్రారంభంలో బలమైన హైబ్రిడ్ టెక్నాలజీతో ఫ్రాంక్స్‌ను పరిచయం చేస్తుంది. వచ్చే ఏడాది జరగనున్న ఆటో ఎక్స్‌పో 2025లో లాంచ్ అవుతుందని అంచనా.

కొత్త మారుతి ఫ్రంట్‌ఎక్స్‌లో హైబ్రిడ్ ఇంజన్ అందించినట్లయితే దీనికి మంచి మైలేజ్ లభిస్తుంది. ఈ పవర్‌ట్రెయిన్‌తో కొత్త ఫ్రాంక్స్ ఫేస్‌లిఫ్ట్ లీటరుకు 35 కిలోమీటర్ల కంటే ఎక్కువ మైలేజీని పొందగలదని నమ్ముతారు. ఇదే జరిగితే ఫ్రాంక్స్ దేశంలోనే అత్యధిక మైలేజ్ ఇచ్చే కాంపాక్ట్ ఎస్‌యూవీ అవుతుంది. ఏది ఏమైనప్పటికీ భారతదేశంలో మెరుగైన మైలేజీని ఇచ్చే కార్లను ఎక్కువగా ఇష్టపడతారు.

మారుతి సుజుకి 2025 ప్రారంభంలో కొత్త eVX ను తన మొదటి ఎలక్ట్రిక్ కారుగా పరిచయం చేస్తుంది. హైబ్రిడ్ నెక్స్ట్-జెన్ బాలెనో, కాంపాక్ట్ ఎమ్‌పివిని 2026లో, సరికొత్త స్విఫ్ట్ హైబ్రిడ్‌ని 2027 నాటికి పరిచయం చేయాలని కంపెనీ యోచిస్తోంది.

ఫ్రాంక్స్ ప్రారంభించిన వెంటనే ఈ కారు 1 లక్ష యూనిట్లు 10 నెలల కంటే తక్కువ సమయంలో అమ్ముడయ్యాయి. ఈ మారుతి సుజుకి ఫ్రాంటిస్ అత్యంత వేగంగా అమ్ముడవుతున్న ఎస్‌యూవీగా మారింది. 17 నెలల్లోనే 2 లక్షల సంఖ్యను దాటింది. భారతీయ మార్కెట్‌లో అపారమైన విజయంతో ఆఫ్రికన్, లాటిన్ అమెరికన్ మార్కెట్‌లలో కూడా ఫ్రాంక్స్ తన జోరను కొనసాగిస్తుంది. కొత్త హైబ్రిడ్ ఫ్రంట్ ధర ప్రస్తుత మోడల్ కంటే ఎక్కువగా ఉండబోతోంది.

మారుతి సుజుకి ఫ్రాంటిస్ అతిపెద్ద ఫీచర్ దాని డిజైన్. మీరు దీన్ని ఇప్పటి వరకు మారుతి సుజుకి  అత్యంత స్టైలిష్ ఎస్‌యూవీగా చూడొచ్చు. అంతే కాదు దీని ఇంటీరియర్ కూడా చాలా స్టైలిష్ గా ఉంటుంది. ఇందులో చాలా మంచి ఫీచర్లు కూడా ఇచ్చారు. కారు సీట్లు కూడా స్ప్రింగ్‌గా, కొంచెం స్పోర్టీగా ఉంటాయి. చివరగా ఫ్రంట్ అమ్మకానికి మరో పెద్ద కారణం దాని పనితీరు. ఈ కారు సిటీ-హైవేలో చాలా బాగా నడుస్తుంది.